Breaking News

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

 

కామారెడ్డి, ఆగష్టు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబరు 2వ తేదీన ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో నిర్వహించనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకుడు ఖాజామోహినోద్దీన్‌ కోరారు. సమ్మెకు సంబంధించిన గోడప్రతులను శుక్రవారం కామారెడ్డి ఐఎఫ్‌టియు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేంద్రమోడి ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పిగొట్టాలని, కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని సెప్టెంబరు 2న దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్టు పేర్కొన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, గ్రాడ్యువిటి, బోనస్‌ వంటి సౌకర్యాలు వర్తింపజేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సమ్మె నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రాజయ్య, చంద్రన్న, బషీరుద్దీన్‌, లక్ష్మి, కళావతి, జి.కళావతి తదితరులు పాల్గొన్నారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *