Breaking News

పట్టపగలే చోరీ…

 

బాన్సువాడ, ఆగష్టు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో ఓ వ్యాపారి ఇంట్లో దొంగలు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని సిండికేటు బ్యాంకు వెనక ప్రాంతంలోగల బెజుగం రాఘవేందర్‌ అనే వ్యాపారి ఇంట్లో శుక్రవారం దొంగతనం జరిగింది. ఇంటివారు పట్టణంలో జరుగుతున్న పెళ్లికి కుటుంబీకులతో కలిసి తాళం వేసి వెళ్లగా దీన్ని గమనించిన దొంగలు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన ఆయన తలుపులు, బీరువా తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్టు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదు తులాల బంగారం, 20 తులాల వెండితో పాటు ఐదు లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణ సిఐతోపాటు బోధన్‌ డిఎస్పీ క్లూస్‌టీంతో వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆధారాలు సేకరించి దర్యాప్తు జరుపుతున్నారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *