Breaking News

అటవీ సంపదను కాపాడాలనే ఉద్దేశంతోనే హరితహారం

 

– జిల్లా ఎంపి కె.కవిత

నిజామాబాద్‌, ఆగష్టు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తరిగిపోతున్న అటవీ సంపదను కాపాడాలనే సదుద్దేశంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచంలోని 3వ అతిపెద్ద మానవ ప్రయత్నంగా చేపట్టడం జరిగిందని నిజామాబాద్‌ ఎంపి కె.కవిత అన్నారు. సోమవారం కాలూరు చౌరస్తాలో, నిజామాబాద్‌ పట్టణంలోని అర్సపల్లి, మాధవనగర్‌ బైపాస్‌ రోడ్డులో జిల్లా ఎస్పీ పి.విశ్వప్రసాద్‌ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఎవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలు నాటి ట్రీగార్డులను జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, నగరమేయర్‌ ఆకుల సుజాతతో కలిసి ఏర్పాటు చేశారు. తరిగిపోతున్న అటవీ సంపదను కాపాడాలనే ఉద్దేశంతో మొదట హరితహారం కార్యక్రమాన్ని ఆస్ట్రేలియాలో, తర్వాత చైనాలో చేపట్టారని, ప్రపంచలో ఏర్పడిన వాతావరణ అసమతుల్యత వల్ల పర్యావరణంలో మార్పులు జరిగి విచిత్రమైన పరిస్థితులు ఏర్పడుచున్నవని గ్రహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టితో నేడు భారతదేశంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. నిజామాబాద్‌ పట్టణంలోని బైపాస్‌ రోడ్డును సుందరీకరణ చేసి ఉదయం, సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి పోలీసుశాఖ ముందుకు వచ్చి ఆకర్షణీయమైన సువాసనభరిత పుష్పాలను ఇచ్చె దాదాపు 10 రకాల మొక్కలు 2 వేల 200 మొక్కలు నాటడానికి ముందుక వచ్చారని, వీటిని సంరక్షించే బాధ్యత తీసుకొని రాబోయే తరాల వారికి బహుమతిగా అందివ్వడానికి ప్రతి ఒక్కరు తమవంతు సహాయ సహకారాలు అందివ్వాలని కోరారు. కార్యక్రమంలో డిఎస్పీ ఆనంద్‌కుమార్‌, మునిసిపల్‌ కమీషనర్‌ నాగేశ్వర్‌రావు, తహసీల్దార్‌ సుదర్శన్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *