Breaking News

తెవివిలో జాతీయ క్రీడాదినోత్సవం

 

డిచ్‌పల్లి, ఆగష్టు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు క్రీడల ద్వారా వారి శారీరక, మానసికంగా ఉల్లాసవంతులు కావడమేగాకుండా సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించవచ్చని స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం. మమత అన్నారు. ఈ మేరకు యూనివర్సిటీలో జాతీయ క్రీడాదినోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్రీడలను అలవరుచుకోవాలని సూచించారు. బి.ఆర్‌.నేత మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థులు తమకిష్టమైన క్రీడను ఎంచుకొని ప్రతిరోజు అభ్యాసం చేయాలని పేర్కొన్నారు. అంతేగాకుండా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ఎటువంటి పనులనైనా సాధించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో అనిల్‌, బాలాజీ, రమేశ్‌, మనోజ్‌, శారద తదితరులు పాల్గొన్నారు.

Check Also

అర్హత పరీక్ష గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత ...

Comment on the article