Breaking News

నూతనంగా నిర్మిస్తున్న వసతి గృహం తనిఖీ

 

డిచ్‌పల్లి, ఆగష్టు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో 400 విద్యార్థులకు సరిపడా కొత్తగా నిర్మిస్తున్న బాలుర వసతి గృహ భవనాలను వైస్‌ఛాన్స్‌లర్‌ సాంబయ్య సోమవారం పరిశీలించారు. ఆయన వెంట రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు, సిపిడబ్ల్యుడి, యూనివర్సిటీ ఇంజనీర్లు ఉన్నారు. వసతి గృహ భవనాన్ని నిర్ణీత సమయంలో పూర్తిచేసి అప్పగించాలని సూచించారు. దీనివల్ల విద్యార్థులకు వసతి సదుపాయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని పేర్కొన్నారు. వారివెంట ఇంజనీర్లు రాజన్న, వినోద్‌కుమార్‌, తదితరులున్నారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *