Breaking News

పాముకాటుతో విద్యార్థిని మృతి

 

– తెవివిలో సంతాపసభ

డిచ్‌పల్లి, ఆగష్టు 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో ఎంఎ ఎకనామిక్స్‌ రెండో సంవత్సరం చదువుతున్న కె.నిరోశ అనే విద్యార్థిని తన స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని ఉసిరిగాయలపల్లిలో పాముకాటుతో మృతి చెందింది. మంగళవారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో విషసర్పం కాటువేయడంతో మృతి చెందిందని కుటుంబీకుల ద్వారా తెలిసింది. ఈ సంఘటనతో యూనివర్సిటీలో విషాదం నెలకొంది. వర్సిటీ కళాశాల భవనం ముందు ఏర్పాటు చేసిన సంతాపసమావేశంలో వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్యతో సహా అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న పేద, గిరిజన విద్యార్థిని అకాల మృతి చెందడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబానికి వర్సిటీ తరఫున ప్రగాఢ సంతాపం తెలిపారు. అందరు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఆచార్య కనకయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జాన్సన్‌ దామెర, డాక్టర్‌ ప్రవీణాబాయి, డాక్టర్‌ పాతనాగరాజు, డాక్టర్‌ రవిందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *