Breaking News

Daily Archives: September 1, 2016

అంగన్‌వాడిలలోనే పోషకాహారాన్ని తినాలి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల్లి, బిడ్డ ఆరోగ్యంగా పెరిగేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహార లక్ష్మి పోషకాహారాన్ని అంగన్‌వాడి కేంద్రాల్లోనే తినాలని గర్భిణీలు, బాలింతలకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా సూచించారు. జాతీయ ఆరోగ్య పోషక దినోత్సవం సందర్భంగా గురువారం ఎడపల్లి మండలం జైతాపూర్‌ అంగన్‌వాడి కేంద్రాన్ని తనికీ చేసి, గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు అందజేస్తున్న పథకాలను కలెక్టర్‌ సమీక్షించారు. భోజనంతోపాటు ఇచ్చే గుడ్డు, పాలు, ఐరన్‌ ...

Read More »

సామాజిక తెలంగాణకై ఉద్యమిద్దాం – ప్రొఫెసర్‌ ప్రభంజన్‌ యాదవ్‌

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో దళిత, బిసి, గిరిజన, మైనార్టీ ప్రజలకు మేలు జరగాలంటే అందరూ కలిసికట్టుగా సామాజిక తెలంగాణ సాధనకై పోరాడాలని ప్రొఫెసర్‌ ప్రభంజన్‌ కుమార్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. గురువారం రోజు తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల సెమినార్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. నిజమైన బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలంటే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ది ఫలాలు అందాలని వివరించారు. తెలంగాణ సాధనకై దళిత బహుజన ...

Read More »

కామారెడ్డి జిల్లా వివరాలు రెండు ప్రతులు తయారుచేయించాలి

  నిజామాబాద్‌, సెప్టెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు పూర్తి సమాచారాన్ని నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం ప్రగతిభవన్‌లో జిల్లా స్థాయి అధికారులతో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, ఫైళ్లను, డాక్యుమెంట్లను జిరాక్సులు తీయించడానికి, వాటి ప్రతులను జిల్లాస్థాయిలో రికార్డు చేయడానికి వివరాలు అందించాలన్నారు. అతిముఖ్యమైన వివరాలను జాగ్రత్తగా నమోదు చేయించాలన్నారు. వీటికి సంబంధించి ...

Read More »

సిద్దమవుతున్న మట్టి గణపతులు

  పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం కామారెడ్డి, సెప్టెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయకచవితి పండగ సమీపిస్తున్న తరుణంలో మట్టి గణపతి విగ్రహాల తయారీ జోరందుకుంది. కలకత్తా నుంచి వచ్చిన కళాకారులు వినాయక విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. కలకత్తా నుంచి తీసుకొచ్చిన గంగ మట్టితో గణపతి విగ్రహాలు రూపొందిస్తున్నారు. ఈసారి వినాయక మండప నిర్వాహకులు సైతం పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ గణనాయకుల ఏర్పాటుకు సిద్దమవుతున్నారు. దీంతో మట్టిగణపతులకు డిమాండ్‌ బాగా పెరిగింది. వైవిద్యమైన రూపాల్లో మట్టిగణపతులు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ముందస్తుగానే ఆర్డర్‌ ...

Read More »

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

  కామారెడ్డి, సెప్టెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఎన్‌ఎంల అరెస్టులను నిరసిస్తూ కామారెడ్డిలో గురువారం సిఐటియు ఆద్వర్యంలో రెండవ ఎఎన్‌ఎంలు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు హైదరాబాద్‌కు వెళుతున్న ఏఎన్‌ఎంలను ఆడపడుచులనికూడా చూడకుండా ప్రభుత్వం దాడులు చేసి అరెస్టులు చేయించడం గర్హణీయమన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని ...

Read More »

వృద్దులకు పాలు, పండ్లు పంపిణీ

  కామారెడ్డి, సెప్టెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణ శివారులోని వృద్దాశ్రమంలో గురువారం వృద్దులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ అందించిన జనతా గ్యారేజ్‌ సినిమా బుధవారం విడుదలైన నేపథ్యంలో తమ అభిమాన నటుడి సినిమాలు విజయపథంలో నడవాలని ఆకాంక్షిస్తూ పాలు, పండ్లు పంపిణీ చేశామన్నారు. రక్తదానంతోపాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్‌ పట్టణ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు అనిల్‌, ...

Read More »

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం చేయండి

  కామారెడ్డి, సెప్టెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 2న తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆజాద్‌, అరుణ్‌కుమార్‌, నరేశ్‌లు డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సెప్టెంబరు 2న జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా విద్యావ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని దుయ్యబట్టారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం, ...

Read More »

ప్రగతి పనుల కోసం నిధులు మంజూరు చేయాలి

  కామారెడ్డి, సెప్టెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వార్డుల్లో ప్రగతి పనుల నిర్వహణ కోసం నిధులు మంజూరు చేయాలని పట్టణంలోని 4వ వార్డు కౌన్సిలర్‌ జ్యోతి డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో గురువారం ఆమె వార్డు ప్రజలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో మురికి కాలువల నిర్మాణాలు లేకపోవడంతో మురికినీరు రోడ్లపైకి వచ్చి ప్రజలు వ్యాదుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాలువల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని ఛైర్‌పర్సన్‌, అధికారులను కోరినా స్పందన కరువైందని పేర్కొన్నారు. మునిసిపల్‌ ...

Read More »

ముస్తాబవుతున్న గణేష్‌ మండపాలు

  బీర్కూర్‌, సెప్టెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకొని ఆయా మండలీల సభ్యులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వినాయక విగ్రహాలను బోదన్‌, నిజామాబాద్‌, బాన్సువాడ ప్రాంతాల్లో ఆర్డర్లు ఇచ్చి తయారుచేయిస్తున్నారు. ఈ యేడు కూడా విద్యార్థులకు ఆటల, సాంస్కృతిక పోటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా భజనలు, అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వినాయక ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులతో శాంతి కమిటీ ఏర్పాటు చేసి పలు ...

Read More »

ఘనంగా పొలాల అమావాస్య

  బీర్కూర్‌, సెప్టెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజలు ఘనంగా పొలాల అమావాస్య పండగ నిర్వహించారు. రంగులతో ఆవులను, ఎద్దులను అలంకరించి ఆయా గ్రామాల ప్రధాన ఆలయం వరకుఊరేగింపుగా తీసుకెళ్లారు. బీర్కూర్‌ గ్రామంలో జోడు లింగాల ఆలయం వద్ద రంగు రంగులతో అలంకరిచిన ఆవులు, ఎద్దులు గ్రామస్తులను, చూపరులను మంత్ర ముగ్దులను చేశాయి. జోడులింగాల ఆలయం నుంచి పడమటి హనుమాన్‌ మందిరం వరకు గ్రామ పెద్ద ఆధ్వర్యంలో ఊరేగించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More »

జీవాల ఎదుగుదల కోసమే నట్టలమందు

  నిజాంసాగర్‌ రూరల్‌, సెప్టెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూగజీవాల ఎదుగుదల కోసమే నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తున్నామని మండల పశు సంవర్ధకశాఖ అధికారి సయ్యద్‌ యూనుస్‌ అన్నారు. మండలంలోని బంజపల్లి, గాలిపూర్‌ గ్రామాల్లో సర్పంచ్‌ బేగరి రాజు, రాజగౌడ్‌తో కలిసి మండల వైద్యాధికారి నట్టల నివారణ మందులు పశువులకు వేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ జీవాలకు నట్టల నివారన మందులు వేయడంతో జీవాల ఎదుగుదల అవుతుందన్నారు. కురిసిన వర్షాలకు కొత్త గడ్డి తినడంతో జీవాల కడుపుల్లో ...

Read More »

నాగమడుగు వంతెన మంజూరయ్యేనా….

  నిజాంసాగర్‌ రూరల్‌, సెప్టెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట గ్రామ శివారులో నాగమడుగు ప్రాంతం వద్ద గల హైలెవల్‌ వంతెన నిర్మాణం ఎంతైనా అవసరముందని ప్రయాణీకులు, నిజాంసాగర్‌, అచ్చంపేట గ్రామాల ప్రజలు పేర్కొన్నారు. వర్షాకాలంలో సమృద్దిగా వర్షాలు కురిసిన సమయంలో నాగమడుగు రహదారిపై నీరుచేరి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. మండలంలోని నర్సింగ్‌రావుపల్లి శివారులోగల నల్లవాగు మత్తడి పొంగిపొర్లితే నాగమడుగులోకి నీరు వచ్చి రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ప్రజలు అంటున్నారు. ఈ రహదారిగుండానే వెళుతుంటారు. వర్షాకాలంలో ఈ ...

Read More »

కొత్త రేషన్‌ కార్డులు వచ్చాయి…

  నిజాంసాగర్‌ రూరల్‌, సెప్టెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎంసి ఆహారభద్రత కార్డులను రేషన్‌ కార్డుల స్థానంలో నూతనంగా ప్రవేశపెట్టింది. నూతన కార్డులు నిజాంసాగర్‌ తహసీల్‌ కార్యాలయానికి జిల్లా ఉన్నతాధికారులు పంపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ చిత్రపటాలను కార్డుపై ముద్రించారు. ఆధార్‌నెంబరు, రేషన్‌కార్డు నెంబరు, లబ్దిదారుల వ్యక్తిగత ఫోటోలతో ఆహారభద్రత కార్డులు ముద్రించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రేషన్‌ కార్డులపై గ్రూపుగా కుటుంబ సభ్యుల ఫోటోలు ముద్రించారు. తెలంగాణ ప్రభుత్వం ...

Read More »

సాదా బైనామాను పరిష్కరిస్తాం

  నిజాంసాగర్‌ రూరల్‌, సెప్టెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారుల పేరున పట్టాల మార్పిడి చేస్తామని స్థానిక తహసీల్దార్‌ ఎం.డి. అబ్దుల్‌ గనిఖాన్‌ అన్నారు. బంజేపల్లి గ్రామంలో సాదా బైనామా దరఖాస్తులను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామంలో 22 సాదా బైనామా దరఖాస్తులు వచ్చాయని, పట్టాదారులను పిలిపించి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. పట్టాదారుల వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకొని సాదా బైనామా అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల కో ఆప్షన్‌ ...

Read More »

రివ్యూ : జనతా గ్యారేజ్‌

సినిమా పేరు; జనతా గ్యారేజ్ నటీనటులు: ఎన్టీఆర్‌.. మోహన్‌లాల్‌.. సమంత.. నిత్యమేనన్‌..  ఉన్ని ముకుందన్‌.. సాయికుమార్‌.. దేవయాని.. రెహమాన్‌.. అజయ్‌ తదితరులు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ ఛాయాగ్రహణం: తిరు కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని. . రవిశంకర్‌.. సీవీ మోహన్‌ రచన – దర్శకత్వం: కొరటాల శివ కొరటాల శివ తీసింది రెండే సినిమాలు. అయినా దర్శకుడిగా తనకంటూ ఓ ముద్ర వేయగలిగారు. ఓ కమర్షియల్‌ చిత్రాన్ని సందేశంతో మేళవించి ఎలా తీయొచ్చో శ్రీమంతుడుతో నిరూపించారు. ఎన్టీఆర్‌  స్థాయి గురించి ప్రత్యేకంగా ...

Read More »

జట్టుకు రంగేసుకుంటున్నారా… ముందు ఈ విషయం తెలుసుకోండి !

ప్రస్తుత సమాజంలో యువత ఫ్యాషన్‌కి ఇస్తున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ముఖానికి మాత్రమే పరిమితమైన అందం అనే అంశం నేడు కొత్త పుంతులు తొక్కుతోంది. మారుతున్న అభిరుచులు, అలవాట్లతో ప్రపంచం రంగులు పులుముకుంటోంది. జుట్టుకు వేసుకునే రంగు దగ్గర్నుంచి కాళ్ల గోళ్లకు వేసుకునే రంగుల దాకా అన్నీ ఫ్యాషన్‌కు తగ్గట్టుగా ఉండాలని నేటి సమాజం భావిస్తోంది. ఇది ఈతరం ఫాలో అవుతున్న బ్యూటీ మంత్ర. ఈ విషయంలో అమ్మాయిలతో పాటు అబ్బాయిలూ తక్కువేమీ కాదు. అమ్మాయిలకు ధీటుగా అందగాళ్లనిపించుకోవడానికి ఫ్యాషన్ ఫ్యాంటసీలో ...

Read More »

సిటీపై వాన వేటు

హైదరాబాద్: మహానగరం మరోసారి ముంపునకు గురైంది. బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన జడివాన దాటికి భాగ్యనగరం కాస్తా.. అభాగ్య నగరంగా మారిపోయింది. మూడు గంటల వర్షవిలయానికి ఏడు నిండు ప్రాణాలు బలయ్యాయి. రామంతాపూర్ ప్రగతి నగ ర్‌లో గోడ కూలి గుడిసెపై పడడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. భోలక్‌పూర్‌లోని బంగ్లాదేశ్ కాలనీలో పురాతన ఇంటి పైకప్పు కూలడంతో ముగ్గురు తనువు చాలించారు. గ్రేటర్ పరిధిలో బుధవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు సగటున 7.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అంబర్‌పేట్‌లో ...

Read More »

సిద్ధరామయ్య కారుపై కాకి వాలింది.. కొత్త కారొచ్చింది.. బిడ్డపోయాడు.. చేతిలో నిమ్మకాయతో?

  కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కారుపై జూన్‌ 2న ఓ కాకి వాలింది. డ్రైవర్‌ తరిమికొట్టినా వెళ్లకుండా.. దాదాపు 10 నిమిషాల పాటు కారుపై కూర్చొండిపోయిందా కాకి. దీంతో ఈయన కొత్తకారు కొనుక్కోవడం అప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో వింత ఘటన చోటుచేసుకుంది. ఈ మధ్యకాలంలో సిద్ధరామయ్య ఎక్కడికి వెళ్లినా తన చేతిలో నిమ్మకాయని తీసుకెళ్లడం అందరిని భయభ్రాంతులకి గురిచేస్తుంది. మైసూరులోని రామకృష్ణ నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన సీఎం మంత్రించిన ...

Read More »

రియల్టీ, ఇన్‌ఫ్రాకు కొత్త ఊపిరి

న్యూఢిల్లీ : దేశంలో నిర్మాణం, రియల్టీ రంగాలను పునరుజ్జీవింపచేసే లక్ష్యంతో కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. వివాదాల సత్వర పరిష్కారానికి మార్గనిర్దేశం చేసింది. వివిధ ప్రాజెక్టులపై కాంట్రాక్టర్లకు, ప్రాజెక్టును అప్పగించిన సంస్థలకు మధ్య వివాదం కోర్టు పరిశీలనలో ఉన్నా బ్యాంకు గ్యారంటీల రూపంలో చిక్కుకున్న సొమ్ములో 75 శాతం విడుదల చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. రియల్టీ రంగంలో వత్తిడిలో ఉన్న ఆస్తులను గుర్తించి వాటికి వన్‌ టైమ్‌ స్కీమ్‌ ఒకటి ప్రకటించే విషయం ఆర్థిక సర్వీసుల శాఖ, ఆర్‌బిఐ పరిశీలించేందుకు అంగీకారం ...

Read More »