Breaking News

Daily Archives: September 2, 2016

నిధులున్నా నిర్మాణాలు కాకపోవడం బాధాకరం

  – జిల్లా కలెక్టర్‌ యోగితారాణా నిజామాబాద్‌, సెప్టెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా జిల్లాను తీర్చిదిద్దేందుకు 60 కోట్ల నిధులు విడుదల చేసినా మంచి ఫలితం రాకపోవడంపై సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం డిచ్‌పల్లిలోని టిటిడిసిలో డిఎఫ్‌కు చెందిన అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. చత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ప్రజలు మరుగుదొడ్లు నిర్మించిన తర్వాత వారు వాడుకున్న మూడు నెలల తర్వాత ...

Read More »

తీసుకున్న రుణాలు చెల్లించాలి

  నిజామాబాద్‌, సెప్టెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వయం సహాయక సంఘాలలోని సభ్యులు రుణ రూపంలో తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని పేదరిక నిర్మూలన సంస్థ, డిఆర్‌డిఎ సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శుక్రవారం డిచ్‌పల్లిలోని టిటిడిసిలో తెలంగాణ పేదరిక నిర్మూలన సంస్థ, డిఆర్‌డిఎ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బి,సి మరియు డి గ్రేడింగ్‌లో ఉన్న అన్ని స్వయం సహాయక సంఘాలు ఏ గ్రేడ్‌లో ఉండేలా ...

Read More »

బిఈడి సప్లమెంటరీ పరీక్షఫీజు చెల్లింపునకు సెప్టెంబరు 6 చివరితేది

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఈడి సప్లమెంటరీ పరీక్షఫీజు చెల్లింపునకు సెప్టెంబరు 6 చివరితేది అని వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ పాతనాగరాజు తెలిపారు. 2013-14, 2014-15 ల్యాబుల వారికి బ్యాక్‌లాగ్‌ పరీక్షలు, అలాగే 2011-12, 2012-13 బ్యాచుల వారికి చివరి అవకాశంగా ఈ పరీక్షలు నిర్వహిస్తారని పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు. ఇందులో భాగంగా థియరి, ప్రాక్టీకల్‌ పరీక్షలు నిర్వహిస్తామని సిఓఈ వెల్లడించారు. ఈ పరీక్షలన్ని కూడా సెప్టెంబరు మాసంలోనే నిర్వహించే అవకాశం ఉంది.

Read More »

గణేశ్‌ ఉత్సవ క్రీడాపోటీలు ప్రారంభం

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెవివి గణేష్‌ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడాపోటీలు శుక్రవారం వర్సిటీ మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రికెట్‌ పోటీలు ప్రారంభించిన రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్సాహంగా ఆటల పోటీల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటడం అభినందనీయమన్నారు. గణేష్‌ ఉత్సవాల్లో భాగంగా వివిధ అంశాలలో క్రీడా పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో క్రీడాసక్తిని పెంచడం అభినందనీయమన్నారు. ఎలాంటి గొడవలకు తావులేకుండా క్రీడాస్ఫూర్తితో ఈ పోటీలను నిర్వహించుకోవాలని సూచించారు. ఐఎంబిఎ, కెమిస్ట్రి ...

Read More »

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

  కామారెడ్డి, సెప్టెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కామారెడ్డిలో శుక్రవారం పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐపిఎస్‌యు ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను మానుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు కల్పించకుండా విద్యార్థులు లేరనే సాకుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ప్రయివేటు యూనివర్సిటీ ...

Read More »

11 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

  కామారెడ్డి, సెప్టెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రుద్ర ఆసుపత్రి సమీపంలో పేకాట స్థావరంపై దాడులు జరిపి 11 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. వారి వద్దనుంచి రూ.16,240 స్వాధీనం చేసుకొని,ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

Read More »

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  కామారెడ్డి, సెప్టెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం ఆధ్వర్యంలో కామారెడ్డిలో శుక్రవారం కార్మికశాఖాధికారికి జిల్లా అధ్యక్షుడు గుర్రపు నారాయణ ఆద్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. దేశ ప్రధాని నరేంద్రమోడి అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొడతామన్నారు. కార్మికులకు కనీస వేతనం కింద రూ. 18 వేలు చెల్లించాలని, ఇళ్లులేని కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, కార్మికుల భద్రతకు సంక్షేమ చట్టాలు తీసుకురావాలని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరించాలని ...

Read More »

ఘనంగా వైఎస్‌ఆర్‌ వర్ధంతి

  కామారెడ్డి, సెప్టెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 7వ వర్ధంతిని కామారెడ్డిలో శుక్రవారం వైఎస్‌ఆర్‌ సిపి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాలబాలికల అనాథ, వృద్ధాశ్రమంలో పాలు, బ్రెడ్‌, బిస్కట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ సిపి ట్రేడ్‌ యూనియన్‌ అద్యక్షుడు భిక్షపతి మాట్లాడుతూ ఉచిత విద్యుత్తు, ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌గృహ కల్ప, వృధ్దాప్య, వికలాంగ ...

Read More »

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

  కామారెడ్డి, సెప్టెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్‌ చౌరస్తాలో శుక్రవారం యుటియుసి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం చేసినట్లు యుటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు కొత్త నర్సింలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మిక చట్టం రావాలని, దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు స్వచ్చందంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారన్నారు. కార్మికులకు ...

Read More »

సార్వత్రిక సమ్మె పాక్షికం…

  కామారెడ్డి, సెప్టెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కామారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన బంద్‌ పాక్షికంగా కొనసాగింది. కార్మిక సంఘాల నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. గాంధీ గంజ్‌ నుంచి సిరిసిల్లా రోడ్డు, స్టేషన్‌ రోడ్డు, రైల్వే కమాన్‌ మీదుగా ర్యాలీ కొత్త బస్టాండ్‌కు చేరుకుంది. అనంతరం పట్టణంలో కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ...

Read More »

కళాశాల తనిఖీ చేసిన విసి

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూనివర్సిటీ కళాశాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ పి.సాంబయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం ఉదయం 9.50 గంటలకే వర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు చేరుకున్న విసి ఉదయం 10 గంటలకు అధ్యాపకుల రాకను గమనించారు. అధ్యాపకులు సకాలంలో వచ్చి ఆయా విభాగాలలో తరగతులు తీసుకునే విధానాన్ని పరిశీలించారు. వివిధ తరగతి గదుల్లో తనిఖీ చేసి విద్యార్థులు మరింత ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే విధంగా వారిని ప్రోత్సహించాలని ఆదేశించారు. రెగ్యులర్‌గా తరగతులు ...

Read More »

బైక్‌పై బాలుడి స్టంట్స్… గర్ల్‌ఫ్రెండ్ మృతి

బెంగళూరు : అబ్బాయి వయసు 17 ఏళ్ళు… చేతిలో బైక్… తోడుగా అందమైన అమ్మాయి… రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయం… ఇంకేముంది ఆ కుర్రాడు రెచ్చిపోయాడు. ఉరకలేసే ఉత్సాహంతో బైక్‌తో విన్యాసాలు చేశాడు. ఒక వీల్‌ను పైకెత్తి, క్రింద పడేసి, అటు తిప్పి, ఇటు తిప్పి స్టంట్స్ చేశాడు.  శ్రుతి మించి, గతి తప్పి బైక్ అకస్మాత్తుగా అదుపు తప్పింది. వెనుక సీట్లో కూర్చున్న అమ్మాయి రోడ్డుపై పడగానే ఆ వెనుకనే వస్తు న్న ఓ వాహనం ఆమెపైనుంచి దూసుకుపోయింది. ఆ అబ్బాయికి చిన్న ...

Read More »

హైద‌రాబాదులో వెంక‌య్య‌, బాబు ఆంత‌రంగిక భేటీ… అది రాకుంటే తడఖా చూపిస్తాం… బాబు వార్నింగ్…?

హైద‌రాబాదు :  సీఎం చంద్ర‌బాబు కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు గోవా బ‌య‌లుదేరారు. అంత‌కుముందు హైద‌రాబాదులో కేంద్రమంత్రి వెంకయ్య‌నాయుడు, సీఎం చంద్ర‌బాబు ఆంత‌రంగికంగా స‌మావేశం అయిన‌ట్లు తెలుస్తోంది. తెలుగువాడు… మ‌రో తెలుగువాడికి… మ‌రీ ద‌గ్గ‌ర అయిన‌వాడికి సాయం చేయ‌కపోతే ఎలా… ఏపీ సంక్షోభాల‌కు సొల్యూష‌న్ చెప్ప‌క‌పోతే ఎలా… అన్న‌ట్లుగా సాగింద‌ట‌… వీరిద్ద‌రి భేటీ. సీఎం చంద్ర‌బాబు ఎదుట ఉన్న ప్ర‌ధాన స‌మ‌స్య‌లు ఇపుడు రెండు. ప్రత్యేక హోదా, ఓటుకు నోటు కేసు. ఈ రెండింటికీ ముడిపెట్టి… ఇద్ద‌రూ గ‌డియ పెట్టి మ‌రీ మాట్లాడుకున్నార‌ని స‌మాచారం. ...

Read More »

జియో నుంచి కాల్‌ చేస్తే ఈ నెట్‌వర్క్‌లకు కలవడం లేదట

 స్మార్ట్‌ఫోన్‌ పట్టుకున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు రిలయన్స్‌ జియో గురించి చర్చిస్తున్నారంటే అతిశయోక్తికాదు.. ఎందుకంటే నాలుగు నెలలు అపరిమిత కాల్స్‌.. అపరిమిత 4జీ స్పీడ్‌తో మొబైల్‌ ఇంటర్నెట్‌.. భవిష్యత్తులోనూ రూ.149కే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ అని సంస్థ ప్రకటించిన దగ్గర నుంచి మరింత క్రేజ్‌ పెరిగిపోయింది… 1జీబీ 3జీ లేదా 4జీ డాటా కొనాలంటే కచ్చితంగా రూ.250 పైనే ఖర్చుచేయాలి. అలాంటి పరిస్థితుల్లో అన్‌లిమిటెడ్‌ సేవలు అదీ 4జీ జియో అందించడమంటే ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. కొత్త తరహా జియో 4జీ సేవలపై హైదరాబాద్‌సిటీ: జియో నెట్‌వర్క్‌ ...

Read More »

హాజెల్‌ పట్ల ‘వెస్ట్రన్‌’ జాతివివక్ష

యువరాజ్‌ ఆగ్రహం  న్యూఢిల్లీ: తనకు కాబోయే భార్య హాజెల్‌ కీచ్‌ పట్ల జాతి వివక్ష చూపిన అధికారి తీరుపై స్టార్‌ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశా డు. వెస్ట్రన్‌ యూనియన్‌లో మనీ ట్రాన్స్‌ఫర్‌ కోసం  ఒక అధికారితో సంప్రదించినపుడు తాను జాతి వివక్షను ఎదుర్కొన్నట్టు హాజెల్‌ కీచ్‌ ట్వీట్‌ చేసింది. మనీ ట్రాన్స్‌ఫర్‌ కోసం జైపూర్‌లోని వెస్ట్రన్‌ యూనియన్‌ ఉద్యోగిని సంప్రదించగా తన పేరు హిందువుల పేరులా లేదంటూ ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు తిరస్కరించాడని కీచ్‌ చెప్పింది. ‘వెస్ట్రన్‌ యూనియన్‌ తీరు తనను కలిచి ...

Read More »