Breaking News

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

 

కామారెడ్డి, సెప్టెంబరు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్‌ చౌరస్తాలో శుక్రవారం యుటియుసి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం చేసినట్లు యుటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు కొత్త నర్సింలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మిక చట్టం రావాలని, దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు స్వచ్చందంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారన్నారు. కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరించాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్లు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు రవి, నరేశ్‌, మల్లేశం, కృపాల్‌, భూమేశ్‌, స్వామి, ప్రసాద్‌, జబ్బర్‌ నాయక్‌, ఫయాజ్‌, నరేశ్‌, తదితరులున్నారు.

Check Also

పారిశుద్య పనులు పర్యవేక్షించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జోన్‌ 1 పరిదిలోని 37వ డివిజన్‌, 16వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *