Breaking News

గణేశ్‌ ఉత్సవ క్రీడాపోటీలు ప్రారంభం

 

డిచ్‌పల్లి, సెప్టెంబరు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెవివి గణేష్‌ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడాపోటీలు శుక్రవారం వర్సిటీ మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రికెట్‌ పోటీలు ప్రారంభించిన రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్సాహంగా ఆటల పోటీల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటడం అభినందనీయమన్నారు. గణేష్‌ ఉత్సవాల్లో భాగంగా వివిధ అంశాలలో క్రీడా పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో క్రీడాసక్తిని పెంచడం అభినందనీయమన్నారు. ఎలాంటి గొడవలకు తావులేకుండా క్రీడాస్ఫూర్తితో ఈ పోటీలను నిర్వహించుకోవాలని సూచించారు. ఐఎంబిఎ, కెమిస్ట్రి విభాగాల మధ్య క్రికెట్‌ పోటీలను రిజిస్ట్రార్‌ టాస్‌ వేసి ప్రారంభించారు. కొంతసేపు బ్యాటింగ్‌ కూడా చేశారు. గణేష్‌ ఉత్సవ కమిటీ బాధ్యులు రమణ, సంతోష్‌గౌడ్‌, రాజు నాయక్‌, మహేశ్‌రాం ముదిరాజ్‌, సాయి, ఇతర విద్యార్థి నాయకులు క్రీడా పోటీలు సమన్వయం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ పిఆర్వో డాక్టర్‌ రాజారాం, ఏపి ఆర్వో డాక్టర్‌ అబ్దుల్‌ ఖవి తదితరులు పాల్గొన్నారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *