Breaking News

సార్వత్రిక సమ్మె పాక్షికం…

 

కామారెడ్డి, సెప్టెంబరు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కామారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన బంద్‌ పాక్షికంగా కొనసాగింది. కార్మిక సంఘాల నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. గాంధీ గంజ్‌ నుంచి సిరిసిల్లా రోడ్డు, స్టేషన్‌ రోడ్డు, రైల్వే కమాన్‌ మీదుగా ర్యాలీ కొత్త బస్టాండ్‌కు చేరుకుంది. అనంతరం పట్టణంలో కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని అన్నారు. నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని, కార్మికులకు కనీస వేతనం కింద నెలకు రూ. 18 వేలు చెల్లించాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దుచేసి, వారిని క్రమబద్దీకరించాలని పేర్కొన్నారు. అసంఘటిత రంగ, వ్యవసాయ కార్మికులకు సామాజిక బద్రత కల్పించాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, బోనస్‌ చట్టాలను అమలు చేయాలని, అందరికి పెన్షన్లు వర్తింపజేయాలని డిమాండ్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే కార్మికులంతా ఏకమై ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా కార్మిక సంఘాల నాయకులు వి.ఎల్‌.నర్సింహారెడ్డి, బాల్‌రాజు, దశరథ్‌, వెంకటి గౌడ్‌, వి.డి.దాస్‌, సంపత్‌, రాజు, స్టాలిన్‌, లక్ష్మణ్‌, నర్సింగ్‌రావు, నసీర్‌, రాజశేఖర్‌, రవి, రాంచంద్రం, చంద్రశేఖర్‌, ఆజాద్‌, సుమన్‌, రాజు, సుధీర్‌, కట్ల భూమన్న, రాజలింగం, ఎల్లయ్య, యాదమ్మ, రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *