Breaking News

బైక్‌పై బాలుడి స్టంట్స్… గర్ల్‌ఫ్రెండ్ మృతి

బెంగళూరు : అబ్బాయి వయసు 17 ఏళ్ళు… చేతిలో బైక్… తోడుగా అందమైన అమ్మాయి… రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయం… ఇంకేముంది ఆ కుర్రాడు రెచ్చిపోయాడు. ఉరకలేసే ఉత్సాహంతో బైక్‌తో విన్యాసాలు చేశాడు. ఒక వీల్‌ను పైకెత్తి, క్రింద పడేసి, అటు తిప్పి, ఇటు తిప్పి స్టంట్స్ చేశాడు.  శ్రుతి మించి, గతి తప్పి బైక్ అకస్మాత్తుగా అదుపు తప్పింది. వెనుక సీట్లో కూర్చున్న అమ్మాయి రోడ్డుపై పడగానే ఆ వెనుకనే వస్తు న్న ఓ వాహనం ఆమెపైనుంచి దూసుకుపోయింది. ఆ అబ్బాయికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. వెంటనే లేచి దులిపేసుకొని బైక్ తీసుకుని పారిపోయాడు. వెనుకనున్న అమ్మాయికి ఎలా ఉందో? అనే ఆలోచన కూడా లేకుండా చీకట్లో మాయమైపోయాడు. ఈ దుర్ఘటన గురువారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు పాత మద్రాసు రోడ్డులో ఓ మాల్ ఎదురుగా జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అక్కడ ఉన్నవాళ్ళు ఆ అమ్మాయి షైనీ కిరణ్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. బైక్‌పై విన్యాసాలు చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Check Also

ఏడు కుటుంబాల‌కు కిరాణ సరుకుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డు కౌన్సిల‌ర్‌ ...

Comment on the article