Breaking News

కళాశాల తనిఖీ చేసిన విసి

 

డిచ్‌పల్లి, సెప్టెంబరు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూనివర్సిటీ కళాశాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ పి.సాంబయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం ఉదయం 9.50 గంటలకే వర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు చేరుకున్న విసి ఉదయం 10 గంటలకు అధ్యాపకుల రాకను గమనించారు. అధ్యాపకులు సకాలంలో వచ్చి ఆయా విభాగాలలో తరగతులు తీసుకునే విధానాన్ని పరిశీలించారు. వివిధ తరగతి గదుల్లో తనిఖీ చేసి విద్యార్థులు మరింత ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే విధంగా వారిని ప్రోత్సహించాలని ఆదేశించారు. రెగ్యులర్‌గా తరగతులు జరిగితే మంచి అకడమిక్‌ వాతావరణం నెలకొంటుందని విసి సాంబయ్య అన్నారు. అధ్యాపకులు విద్యార్థులకు మంచి దిశా నిర్దేశం చేయాలని, డిపార్టుమెంటల్‌ రీసర్చ్‌ కమిటీలు ఏర్పాటు చేసి రిసర్చ్‌ స్కాలర్స్‌ సరైన విధంగా పరిశోధనలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు, ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కనకయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ దామెర జాన్సన్‌, డాక్టర్‌ ప్రవీణాబాయి, ప్రజాసంబంధాల అధికారి రాజారాం, టూటా అధ్యక్షుడు డాక్టర్‌ ప్రవీణ్‌, తదితరులున్నారు.

Check Also

అర్హత పరీక్ష గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత ...