Breaking News

Daily Archives: September 4, 2016

గౌడ సంఘం జిల్లా అధ్యక్షునికి సన్మానం

  కామారెడ్డి, సెప్టెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గౌడ సంఘం జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన సంపత్‌గౌడ్‌ను కామారెడ్డిలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఆయనతోపాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల గౌడ సంఘాల ప్రతినిధులు గైని శ్రీనివాస్‌గౌడ్‌, రాజబాలుగౌడ్‌, నాగరాజుగౌడ్‌, శ్రీనివాస్‌, రవితేజ, రాజాగౌడ్‌, బాల్‌రాజు తదితరులను ఘనంగా సన్మానించారు. గౌడ కులస్తుల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో యాదగిరి, మురళి, శేఖర్‌, సురేందర్‌, నర్సాగౌడ్‌, రమేశ్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలి

  – జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్‌ కామారెడ్డి, సెప్టెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఆదివారం ఆటో డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించి, ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. లయన్స్‌ క్లబ్‌ కామారెడ్డి, జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటుచేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు, ఇతర ...

Read More »

వరుణ్‌ మోటార్సులో వార్షికోత్సవ వేడుకలు

  కామారెడ్డి, సెప్టెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మారుతి డీలర్‌ వరుణ్‌ మోటార్సు ఏర్పాటు చేసి రెండేళ్ళు గడిచి మూడోఏటకు అడుగిడుతున్న సందర్భంలో ఆదివారం వార్షికోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌కట్‌ చేసి వేడుకలు జరిపారు. వినియోగదారుల మన్ననలు చూరగొని దేశంలోనే వరుణ్‌మోటార్సు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఇందుకు వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్‌ మధుసూదన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

గౌడ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు

  కామారెడ్డి, సెప్టెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన గౌడ విద్యార్థులకు జమదగ్ని గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. వారికి ప్రతిభ పురస్కారాలు అందజేశారు, వారిని ఘనంగా సన్మానించారు. రిషిత్‌గౌడ్‌, రిషిత, సంజన, శివచందన, సౌఖ్య, సాయతేజ, రేఖలకు పురస్కారాలు అందజేశారు. పాత్రికేయుడు నర్సాగౌడ్‌ను సైతం సన్మానించారు. కార్యక్రమంలో హనుమాగౌడ్‌, బాల్‌కిషన్‌గౌడ్‌, వెంకటేశ్వర్‌గౌడ్‌, అంజాగౌడ్‌, ఈశ్వర్‌గౌడ్‌, లక్ష్మణ్‌గౌడ్‌, రవికుమార్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో మట్టి గణపతుల వితరణ

  కామారెడ్డి, సెప్టెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం కామారెడ్డి పట్టణంలో మట్టి గణపతులు పంపిణీ చేశారు. పట్టణంలోని అశోక్‌నగర్‌ కాలనీలోని అభయాంజనేయస్వామి ఆలయంలోవంద మట్టి గణపతులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్బంగా క్లబ్‌ అధ్యక్షుడు మహేశ్‌గుప్త మాట్లాడుతూ పర్యావరణ సంరక్షణ, నీటి కాలుష్యాన్నినివారించే క్రమంలో తమవంతుగా మట్టి గణపతులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిదులు ప్రవీణ్‌కుమార్‌, సతీష్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదు

  కామారెడ్డి, సెప్టెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వీర తెలంగాణ రైతాంగ సాయుధపోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులని బిజెపి నాయకులు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని దీన్ని సహించేది లేదని ఆర్‌ఎస్‌పి జిల్లా కార్యవర్గ సభ్యుడు కొత్త నర్సింలు అన్నారు. కామారెడ్డిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినం అని కొందరు, విలీన దినం అని కొందరు చరిత్రను వక్రీకరిస్తున్నారన్నారు. నిజాం రజాకార్లకు, కమ్యూనిస్టులకు సంబంధాలున్నాయని బిజెపి నేత ఇంద్రసేనారెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ...

Read More »

రోజూ ఒక అరటిపండు నెలరోజులు తింటే పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!!

చాలా సాధారణంగా.. అందరూ తీసుకునే ఫ్రూట్ బనానా. ఆకలిని తగ్గించుకోవడానికి అరటిపండుని తింటారు. ఇది.. ఏడాదంతా అందుబాటులో ఉండటం వల్ల.. దీన్ని ప్రతి ఒక్కరూ తినడానికి ఆసక్తి చూపుతారు. ఇష్టపడతారు. కానీ.. చాలామంది అరటిపండులో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలియదు. అరటిపండు అంటే.. చాలా నిర్లక్ష్యంగా చూస్తారు. ఇందులో అద్భుతమైన పోషకాలు మిలితమై ఉంటాయి. సాధారణంగా.. రోజుకి ఒక యాపిల్ డాక్టర్ ని దూరంగా ఉంచుతుంది అంటారు. కానీ.. రోజుకి ఒక అరటిపండు కూడా.. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. బరువు ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ఆద్వర్యంలో బీరువా, లాకర్ల పంపిణీ

  కామారెడ్డి, సెప్టెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ వివేకానంద కామారెడ్డి ఆద్వర్యంలో శనివారం సరస్వతి శిశు మందిర్‌ పాఠశాలకు బీరువా, లాకర్‌లను పంపినీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్‌ అధ్యక్షుడు బందం ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ క్లబ్‌ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అందులో భాగంగానే పాఠశాలకు బీరువా, లాకర్‌లు అందజేశామన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిధులు శ్రీనివాస్‌, హరిదర్‌, సంతోష్‌కుమార్‌, రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆర్మూర్‌లో సద్భావన మంచ్‌ఏర్పాటు

  నందిపేట, సెప్టెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జమాతె ఇస్లామి హింద్‌ దేశవ్యాప్తంగాచేస్తున్న శాంతి, మానవతా ఉద్యమంలో భాగంగా వివిధ మత వర్గాల మధ్య సుహృద్భావం నెలకొల్పేందుకు వివిధ మతాల వారిని ఒకే గొడుగు కిందికి తీసుకొని ప్రజల మధ్య ప్రేమ, సోదరబావం పెంపొందించాలనే ఉద్దేశంతో ఆర్మూర్‌ పట్టణంలోని జమాతె ఇస్లామి హింద్‌ కార్యాలయంలో శుక్రవారం రాత్రి సద్భావన సమావేశం ఏర్పాటు చేసి సద్భావన మంచ్‌ కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా జమాతె ఇస్లామి హింద్‌ అద్యక్షుడు అబ్దుల్‌ గబ్బార్‌, కో ...

Read More »

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి

  కామారెడ్డి, సెప్టెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టిగణపతులు పంపినీ చేస్తున్నట్టు ప్రొఫెషనల్‌ కొరియర్‌ ప్రతినిధి అన్నారు. కామారెడ్డిలో శనివారం కొరియర్‌ ఆద్వర్యంలో మట్టి గణపతులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనాలతో తయారుచేసిన మట్టి గణపతుల వల్ల వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు. దీన్ని నివారించేందుకు మట్టి గణపతులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇందులో భాగంగా 200 మట్టి గణపతులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌బ్యాంకు మేనేజర్‌ సునీల్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రోటరీక్లబ్‌ ఆద్వర్యంలో హరితహారం

  కామారెడ్డి, సెప్టెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం రోటరీక్లబ్‌, ఆదిత్య నర్సింగ్‌ హోం సంయుక్త ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, వైద్యులు అజయ్‌, హరికిషోర్‌, రోటరీక్లబ్‌ అధ్యక్షుడు కృష్ణమూర్తిలు మొక్కలు నాటి నీరుపోశారు. సిరిసిల్లా రోడ్డులోని డివైడర్‌ల మధ్యలో మొక్కలునాటి వాటికి కంచెలు ఏర్పాటు చేశారు. మొక్కలునాటి పర్యావరణ సమతుల్యం కాపాడాలని, స్వచ్చమైన గాలి పీల్చుకునేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు విధిగా నాటాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కైలాష్‌ ...

Read More »

మట్టి వినాయక విగ్రహాల వితరణ

  కామారెడ్డి, సెప్టెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని గంజ్‌ వర్తక సంఘ రామాలయంలో శనివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస్‌రావు విగ్రహాలను ప్రజలకు అందజేశారు. ఐదు సంవత్సరాలుగా తమ సంఘం ఆద్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు రసాయనాలు, పివోపిలతో తయారుచేసి విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు ఏర్పాటుచేసి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సంఘం ...

Read More »

డిజెలకు అనుమతి లేదు

  – ఎస్‌ఐ జాన్‌రెడ్డి నందిపేట, సెప్టెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట పోలీసు స్టేషన్‌ ఆవరణలో శనివారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. వివిధ గ్రామాల యువకులు, సర్పంచ్‌లు, గణేష్‌ మండలీల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎస్‌ఐ జాన్‌రెడ్డి, తహసీల్దార్‌ ఉమాకాంత్‌లు మాట్లాడుతూ పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఇందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. గణేష్‌ మండలీల నిర్వాహకులు తప్పకుండా పోలీసుస్టేషన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, రాత్రివేళ మండపాల వద్ద ఒకరిద్దరు కార్యకర్తలు ఉండాలని సూచించారు. నిమజ్జన సమయంలో డిజెలకు ...

Read More »

సేంద్రీయ ఎరువులతో సాగుచేసి దిగుబడి సాధించండి

  కామారెడ్డి, సెప్టెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు సేంద్రీయ వ్యవసాయం ద్వారా సాగుచేసి అధిక దిగుబడి సాధించాలని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్‌ పాలేకర్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో శనివారం నిర్వహించిన రైతుశిక్షణ శిబిరానికి ఆయనముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం రైతులు యూరియా, పురుగు మందులు, ఇతర కెమికల్స్‌ ద్వారాపంటలు సాగుచేస్తూ తద్వారా వారు నష్టపోవడమే గాకుండా దాన్ని తినే ప్రజలు సైతం ఆరోగ్యాన్ని నష్టపోతున్నారన్నారు. పురాతన కాలం నుంచి వస్తున్న ప్రకృతి వ్యవసాయం ద్వారా ...

Read More »

మట్టి గణపతులతో విద్యార్థుల ర్యాలీ

  నందిపేట, సెప్టెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణలో మేము సైతం భాగస్వాములమని తమవంతు బాధ్యతగా నందిపేట లిటిల్‌ ఫ్లవర్‌ పాఠశాల విద్యార్థులు శనివారం మట్టి గణపతులు చేతబూని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు గత రెండ్రోజులుగా తమ చేతులతో పాఠశాలలో మట్టి గణపతులు తయారుచేశారు. అయితే శనివారం వాటిని పట్టుకొని ర్యాలీ నిర్వహించి తెలంగాణ చౌక్‌లో ఏర్పాటు చేసిన ఉచిత స్టాల్‌లో ప్రజలకు అవగాహన కల్పించి అందజేశారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ప్యారిస్‌తో చేసిన గణపతుల వల్ల ...

Read More »

మతసామరస్యాన్ని చాటిన విద్యార్థి

  రెంజల్‌, సెప్టెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం తాడ్‌బిలోలి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అబ్రదుల్‌ హక్‌ మట్టితో గణపయ్యను తయారుచేసి మతసామరస్యాన్ని చాటారు. పాఠశాల విద్యార్థులు వినాయక చవితి పండగను పురస్కరించుకొని మట్టి గణపతులను తయారుచేశారు. వీటిని ఎంపిపి మోబిన్‌ఖాన్‌ తిలకించారు. విద్యార్థులు మట్టి గణపతుల ఆవశ్యకతను చక్కగా వివరించడం జరిగింది. విద్యార్థుల నైపుణ్యాన్ని చూసి ఎంపిపి అబ్బురపడ్డారు. ఆయనవెంట సర్పంచ్‌ శంకర్‌, ఉపాధ్యాయులు నర్సింహారెడ్డి, తదితరులు ఉన్నారు.

Read More »

మరుగుదొడ్లు నిర్మించుకోవాలని విద్యార్థుల అవగాహన ర్యాలీ

  రెంజల్‌, సెప్టెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం నీలా గ్రామంలో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులతో ఉపాధ్యాయులు మరుగుదొడ్ల నిర్మాణంపై శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి ప్రారంభించిన ర్యాలీ గ్రామంలోని ప్రధానవీధుల గుండా కొనసాగించారు. ప్రతి ఒక్కరు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి పారిశుద్యాన్ని కాపాడాలని విద్యార్థులు నినాదాలు చేస్తు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిఆర్‌టియు మండల అధ్యక్షుడు టి. సోమలింగం మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణం వల్ల ఎలాంటి అంటువ్యాధులు సంక్రమించే అవకాశముండదని ...

Read More »

శాంతియుత వాతావరణంలో గణేష్‌ ఉత్సవాలు నిర్వహించాలి

  – ఎంపిపి మోబిన్‌ఖాన్‌ రెంజల్‌, సెప్టెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాంతియుత వాతావరణంలో గణేష్‌ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు చేయాలని రెంజల్‌ మండల పరిషత్‌ ఛైర్మన్‌ మోబిన్‌ఖాన్‌ అన్నారు. శనివారం తహసీల్‌ కార్యాలయంలో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత భక్తి శ్రద్దలతో పండుగలు జరుపుకోవాలన్నారు. అనవసరమైన అపోహలను నమ్మి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు. వినాయక చవితి, బక్రీద్‌ పండగలను కుల, మతాలకతీతంగా జరుపుకొని మత సామరస్యాన్ని చాటాలని ఎంపిపి కోరారు. ఎస్‌ఐ రవికుమార్‌ మాట్లాడుతూ ...

Read More »

360 ఎకరాలకు ధర నిర్ణయం

  – ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేసిన భూముల్లో వ్యవసాయం చేసుకోవాలి నిజామాబాద్‌, సెప్టెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూమిలేని నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు చెందిన వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు భూపంపిణీ కార్యక్రమం కింద అందజేసే మూడు ఎకరాల భూమికొనుగోలు చేసి ప్రతి కుటుంబానికి అందివ్వాలనే ఉద్దేశంతో సుమారు 360 ఎకరాలకు చెందిన పొలాల్లోని వనరులను, పండించే పంటలను బట్టి ధర నిర్ణయించడం జరిగిందని జిల్లాకలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శనివారం రెవెన్యూ డివిజనల్‌ అధికారి చాంబర్‌లో భూములకు ...

Read More »