Breaking News

Daily Archives: September 7, 2016

పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి

  కామారెడ్డి, సెప్టెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేష్‌ ఉత్సవాలు, బక్రీద్‌ పండగను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని కామారెడ్డి ఆర్డీఓ నగేశ్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో బుధవారం హిందూ, మైనార్టీలతో శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పండగల నిర్వహణలో కామారెడ్డికిప్రత్యేకంగా పేరుందని, ఎప్పుడు పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటారన్నారు. ఈ యేడు సైతం వినాయక చవితి, బక్రీద్‌ వేడుకలను ప్రశాంత వాతావరణంలోనే జరుపుకోవాలని సూచించారు. అల్లర్లు చోటుచేసుకోకుండా ఎటువంటి ఘర్షణలు తావివ్వకుండా పండగలు జరుపుకోవాలన్నారు. ఒకరినొకరు ...

Read More »

సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినం నిర్వహించాలి

  కామారెడ్డి, సెప్టెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజేపి ఆద్వర్యంలో బుధవారం కామారెడ్డి ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణకు 1948 సెప్టెంబరు 17న స్వాతంత్య్రం వచ్చిందని, అప్పటివరకు తెలంగాణ నిజాం నిరంకుశ పాలనలో నరకాన్ని అనుభవించారన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పోలీసు చర్యతో సెప్టెంబరు 17న విముక్తి కలిగించారన్నారు. ప్రభుత్వం సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధకారికంగా నిర్వహించాలని ...

Read More »

సంతూర్‌ సబ్బు పున: ప్రారంభం

  కామారెడ్డి, సెప్టెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా కామారెడ్డి పట్టణంలోని విప్రో సంతూర్‌ సబ్బును పున: ప్రారంభించినట్టు కంపెనీ ఉపాధ్యక్షుడు అనిల్‌ చుక్‌ తెలిపారు. బుధవారం కామారెడ్డిలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంతూర్‌ సబ్బు వినియోగదారుల మన్ననలు పొందిందన్నారు. ఈనేపథ్యంలో సబ్బును మరింత ఆకర్షనీయంగా తయారుచేసి రీ లాంచ్‌ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో యాద అంజయ్య, నాగరాజు, శ్రీమన్నారాయణ, మనోహర్‌, శ్రీనివాస్‌, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఏఐటిఎస్‌యు ఆద్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

  కామారెడ్డి, సెప్టెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిపట్టణంలోని గిరిజన వసతి గృహంలో అర్ధరాత్రి విద్యార్థుల గెంటివేతను నిరసిస్తూ ఏఐటిఎస్‌యు ఆద్వర్యంలో కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట బుధవారం దర్నా నిర్వహించారు. అంతకుముందు కొత్త బస్టాండ్‌నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర కార్యదర్శి జబ్బర్‌ నాయక్‌ మాట్లాడుతూ గత 15 రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే వసతి గృహాన్ని ప్రారంభించారన్నారు. విద్యార్థులు వచ్చి వారంరోజులు గడవకముందే విద్యార్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి ...

Read More »

మంజీరా కళాశాలలో టాస్క్‌ అవగాహన సదస్సు

  కామారెడ్డి, సెప్టెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని మంజీర డిగ్రీ కళాశాలలో బుధవారం సాప్ట్‌ స్కిల్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాప్ట్‌ స్కిల్స్‌ శిక్షకులు నరేందర్‌ విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్‌, సాప్ట్‌ స్కిల్స్‌పై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థికి పోటీ ప్రపంచంలో సాప్ట్‌ స్కిల్స్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ, డిడిఎం సుధాకర్‌, బాలు మహేంద్ర, డైరెక్టర్‌ సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెయు రిజిస్ట్రార్‌ ఎంపిక

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వై.జయప్రకాశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపకునిగా అవార్డుకు ఎంపికైనట్టు యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ తరఫున ఈ అవార్డుకు ఆచార్య జయప్రకాశ్‌రావు ఈ సంవత్సరం ఒక్కరే ఎంపిక కావడం విశేషం. సెప్టెంబరు 8న గురువారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రవీంద్రభారతిలో నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆచార్య జయప్రకాశ్‌రావు ఈ అవార్డు అందుకుంటారన్నారు. 24 సంవత్సరాల అపార బోధన అనుబవం ఉన్న జయప్రకాశ్‌రావు ...

Read More »

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్ఞానాన్వేషణతో ప్రశ్నించే తాత్విక గుణంతో నిరంతర అధ్యయనం చేస్తూ, గతిశీలమైన జ్ఞానంతో తమ సన్నిధిలో ఉన్న విద్యార్థి సామాజిక, ఆర్థిక, సాంఘిక, స్థానిక స్థితిగతులను ఆకలింపు చేసుకొని అధ్యాపనంనెరిపేవారే నిజమైన ఉపాధ్యాయులని అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ పాతనాగరాజు అన్నారు. బుధవారం తెలంగాణ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ విద్యార్థులు ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఎకనామిక్స్‌ విభాగంలో చక్కని భవిష్యత్‌ ఉందని, మరెన్నో అవకాశాలున్నాయని అవన్నీ ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన శివకుమార్‌

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌చే బెస్ట్‌ టీచర్‌ అవార్డును లా కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జె.వి.శివకుమార్‌ బుధవారం రవీంద్రభారతిలో జరిగిన ప్రత్యేకకార్యక్రమంలో స్వీకరించారు. డాక్టర్‌ శివకుమార్‌ లా బోధనలో గత రెండు దశాబ్దాలు గా చేసిన కృషిని గుర్తించి ఈ బెస్ట్‌ టీచర్‌ సత్కారానికి ఎంపిక చేసినట్లు లయన్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధులు తెలిపారు. అవార్డును లయన్స్‌ ఇంటర్నేషనల్‌ గవర్నర్‌ ఓబుల్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డును ఒక గురువుగా తాను తన ...

Read More »

గణేష్‌ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి

  రెంజల్‌, సెప్టెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని తహసీల్దార్‌ వెంకటయ్య, ఎస్‌.ఐ. డి.రవికుమార్‌ అన్నారు. మండలంలోని నీలా గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గణేష్‌ మండళ్ళ నిర్వాహకులనుద్దేశించి వారు మాట్లాడారు. బక్రీద్‌, వినాయక ఉత్సవాలను భక్తులు భక్తి శ్రద్దలతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఆదివారం గ్రామాల్లో వినాయక నిమజ్జనాలు ఉన్నందున నిర్వాహకులు, గ్రామ పెద్దలు సహకరించి గ్రామానికి మంచిపేరు తెచ్చుకోవాలన్నారు. ...

Read More »

అంగన్‌వాడిల ద్వారా 68 శాతం పౌష్టికాహారం

  నిజామాబాద్‌, సెప్టెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్పు పథకంకింద గర్భిణీలకు కల్పించే ఆరోగ్యలక్ష్మి అమలుతీరు, పౌష్టికాహారం, వ్యాక్సినేషన్‌, ఐరన్‌ పోలిక్‌ఆసిడ్‌ మాత్రల పంపిణీ వివరాల నివేదికలు సంబంధిత అధికారులు సెప్టెంబరు 30 లోగా అందజేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. బుధవారం నూతన అంబేడ్కర్‌ భవనంలో ఏర్పాటుచేసిన జాతీయ పౌష్టికాహార వారరోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ అంగన్‌వాడి కేంద్రాల్లో నూటికి నూరుశాతం గర్భిణీలకు పౌష్టికాహారం, వ్యాక్సినేషన్‌, ఐరన్‌ పోలిక్‌ ఆసిడ్‌ బిల్లలు అందజేసి సుఖప్రదమైన ...

Read More »

పడకేసిన వాతావరణ పరిశోధన?

వేషం,భావం కంటే చెప్పే మాటలు ఎంత వరకు విశ్వసనీయంగా ఉంటాయనే దానిని బట్టే వ్యక్తులపై కానీ,సంస్థలపై కానీ నమ్మకం ఏర్పడి అనుమానం పెరిగి అనుసరణీయం అవుతాయి. బాధ్య తలు పెరిగేకొద్దీ మాటలకు విలువ పెరుగుతుంది. సంస్థ లైతే మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఆ సంస్థల నుండి వెలువడే అంచనాలు, మాటలు, కోట్లాది మంది జీవనానికి ముడిపడి ఉంటాయి. ఇందులో ఏమా త్రం విఫలమైనా వీటిపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాల పరిస్థితి దారుణంగా తయారవ్ఞతోంది. భార తదేశంలో ఇప్పటికీ అధికశాతం జనాభా వ్యవసాయరం గం ...

Read More »

రిలయన్స్‌ జియోతో ఢీ అంటే ఢీ

అవసరమైతే ఉచిత వాయిస్‌ కాల్స్‌కూ సిద్ధం బిఎస్‌ఎన్‌ఎల్‌ సిఎండి న్యూఢిల్లీ: డేటా, వాయిస్‌ కాల్ప్‌ విషయంలో రిలయన్స్‌ జియో పోటీకి ధీటుగానే స్పందిస్తామని ప్రభుత్వ రంగంలోని బిఎ్‌సఎన్‌ఎల్‌ ప్రకటించింది. జియో ప్రవేశం టెలికాం మార్కెట్‌లో ఉన్న ప్రస్తుత కంపెనీలన్నిటికి సవాల్‌ వంటిదని కంపెనీ సిఎండి అనుపమ్‌ శ్రీవాస్తవ అన్నారు. పోటీని తట్టుకునేందుకు మిగతా కంపెనీలు కూడా జియో టారి్‌ఫలకు తగ్గట్టు కొత్త ఆఫర్లు ప్రకటిస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. బిఎ్‌సఎన్‌ఎల్‌ కూడా ఈ విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తుందన్నారు. జియో 4జి సేవలు ప్రకటించిన మరుసటి రోజే ...

Read More »

ఎమిరేట్స్’ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక

గత నెలలో దుబాయ్ విమానాశ్రయంలో జరిగిన ఎమిరేట్స్ విమాన ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను మంగళవారం అధికారులు వెల్లడించారు. ల్యాండ్ అవుతున్న విమానాన్ని తిరిగి పైకి తీసుకెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు విశ్లేషించారు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ చరిత్రలోనే ఘోర ప్రమాదంగా ఇది రికార్డుకెక్కింది. అయితే అదృష్టవశాత్తూ 300 మంది ప్రయాణికులు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. మంటలను అదుపుచేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఒకరు మృతి చెందారు. ఈ విమాన ప్రమాదంపై అరబ్ ఎమిరేట్స్ పౌర విమాన అధికార యంత్రాంగం దర్యాప్తు జరిపింది. ఫ్లైట్ ...

Read More »

ప్రేమను నిరాకరించిందని.. అసభ్య వీడియోలో మార్ఫింగ్‌

 ప్రేమను నిరాకరించిందన్న నెపంతో ఆ యువతి ఫోటోలు, వీడియోలను అసభ్యకర దృశ్యాలుగా చిత్రీకరించి నెట్‌లో పెట్టాడో దుర్మార్గుడు. ఈ సంఘటన విజయవాడలో జరిగింది. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన మాదివాడ మురారి(23) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీనలో ఉద్యోగం చేస్తున్నాడు. విజయవాడ భవానీపురం స్టేషన పరిధిలోని గొల్లపూడికి చెందిన యువతి.. మురారి పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం చేస్తోంది. ఆమెతో మురారి పరిచయం పెంచుకున్నాడు. తర్వాత తనను ప్రేమించాలని వేధించడం ప్రారంభించాడు. యువతి నిరాకరించింది. దీంతో అసభ్య చిత్రాలను ఆ యువతి ఫొటోలతో మార్ఫింగ్‌ చేశాడు. ...

Read More »

ఆ ముస్లిం యువకులు ఎవరూ చేయని పనిచేశారు!

థానె: అర్ధరాత్రి చనిపోయిన ఓ హిందూ వ్యక్తి దహన సంస్కారాలను నిర్వహించి తమ గొప్పతనాన్ని చాటుకున్నారు ముస్లిం యువకులు. ముంబ్రా లోని కౌసా ప్రాంతానికి చెందిన వామన్ కదమ్(65), భార్యతో కలిసి నివసిస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి కదమ్ మృతి చెందాడు. భార్య తప్ప అతడికి నా అన్న వారు ఎవరూ లేకపోవడంతో అదే ప్రాంతానికి చెందిన 8 మంది ముస్లిం యువకులు కదమ్ దహన సంస్కారాలకు ముందుకొచ్చారు. అందుకు కావాల్సిన వెదురు కర్రలు, తాడు, మట్టి కుండ.. తదితర అన్ని వస్తువులు కొనుగోలు చేశారు. ...

Read More »

రూ.8,999కే మోటో జీ కొత్త ఫోను

దిల్లీ: లెనోవో సంస్థ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 8,999తో ‘మోటో జీ4 ప్లే’ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో ఈ ఫోన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఫోన్‌ ఫీచర్లు * 5 అంగుళాల తెర * 5 ఎంపీ ముందు కెమెరా * 8 ఎంపీ వెనుక కెమెరా * 1.2 గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌ * ఆండ్రాయిడ్‌ 6.0.1 మార్ష్‌మాలో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ * 2 జీబీ ర్యామ్‌ * 16 జీబీ ...

Read More »

ఇల్లరికపుటల్లుడు కొంపముంచాడు

కామపిశాచాన్ని కడతేర్చిన భార్య ఇద్దరు మరదళ్లు, అత్తపై లైంగిక వేధింపులే కారణం శవాన్ని పూడ్చలేక పోలీసులకు లొంగిపోయిన వైనం కాకతీయఖని, సెప్టెంబరు 6: భర్త చనిపోయాడు.. ఇంట్లో ఎదిగొచ్చిన ముగ్గురు ఆడపిల్లలు! మగదిక్కు లేకపోవడంతో పెద్దకూతురి కోసం ఇల్లరికం అల్లుడిని తెచ్చుకుంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటాడని ఆశపడింది! కానీ ఆమె ఆశలు అడియాసలే అయ్యాయి. కామంతో కళ్లుమూసుకుపోయిన ‘ఆ అల్లుడు’ మరదళ్లు, అత్తపైనే లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దాష్టీకాలు ఆపాలని భర్తను వేడుకుంది ఆ భార్య! చంపేస్తానని గొడ్డలిని పైకెత్తాడా కర్కోటకుడు. ...

Read More »

అమ్మ ప్రేమ అందరికీ ఒకటేనని ఆ ఏనుగులు నిరూపించాయి

కియోంఝర్ : రాగద్వేషాలకు ఏ జీవీ అతీతం కాదు. అమ్మదనం జీవులన్నిటికీ సమానమే. అనురాగం, ఆత్మీయతలో ఏ జీవి అయినా మానవుడి కన్నా తీసిపోదు. అవకాశం వచ్చిన ప్రతిసారీ మనసు మహిమ తెలుస్తూనే ఉంటుంది. త్యాగానికి వెనుకాడని ధీరత్వం, సాహసం వెల్లడవుతూనే ఉంటుంది. ఒడిశాలోని కియోంఝర్‌లో ఆదివారం అలాంటి ఘటనే జరిగింది. దానిని చూసిన ప్రజల కళ్ళు చెమర్చాయి. వర్షాలు తీవ్రంగా కురవడంతో ఆదివారం వైతరణి నది ప్రవాహం విపరీతంగా ఉంది. మేత కోసం వెళ్ళిన ఏనుగులు అక్కడికి వచ్చాయి. వాటితో పాటు మూడు ...

Read More »

గర్భ నిరోధక మాత్రలతో కేన్సర్‌ నుంచి రక్షణ!

లండన్‌, సెప్టెంబరు 6: గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల మహిళలకు అండాశయ కేన్సర్‌ నుంచి రక్షణ లభిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 2002 నుంచి 2012 మధ్య అండాశయ కేన్సర్‌ వల్ల చనిపోయే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిందని, గర్భనిరోధక మాత్రలు వాడటమే ముఖ్య కారణమని ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిలన్‌ పరిశోధకులు వెల్లడించారు. అమెరికా, ఈయూ, బ్రిటన్‌, జపాన్‌, తదితర దేశాల్లో 1970 నుంచి జరిగిన పలు అధ్యయనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. ఈ కేన్సర్‌ మరణాల రేటు బాగా ...

Read More »

తోటకూర తింటే ఇన్ని లాభాలా?

మార్కెట్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. ఇందులో పోషకాలు లెక్కలేనన్ని. తరచూ తోటకూరను ఎందుకు తినాలంటే.. బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్‌గా తోటకూర తినడం ఉత్తమం. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికితోడు కొవ్వును తగ్గిస్తుంది. తక్షణశక్తికి ఈ ఆకుకూర తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా వండుకుతిన్న కూర అయితే ఉత్తమం. అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుందీ కూర. హైపర్‌టెన్షన్‌తో బాధపడే వాళ్లకు మేలు చేస్తుంది. తోటకూరలోని ‘విటమిన్‌ సి’ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. దీంతో ఒక సీజన్‌ ...

Read More »