Breaking News

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెయు రిజిస్ట్రార్‌ ఎంపిక

 

డిచ్‌పల్లి, సెప్టెంబరు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వై.జయప్రకాశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపకునిగా అవార్డుకు ఎంపికైనట్టు యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ తరఫున ఈ అవార్డుకు ఆచార్య జయప్రకాశ్‌రావు ఈ సంవత్సరం ఒక్కరే ఎంపిక కావడం విశేషం. సెప్టెంబరు 8న గురువారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రవీంద్రభారతిలో నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆచార్య జయప్రకాశ్‌రావు ఈ అవార్డు అందుకుంటారన్నారు. 24 సంవత్సరాల అపార బోధన అనుబవం ఉన్న జయప్రకాశ్‌రావు రసాయన శాస్త్ర విభాగంలో ఆచార్యునిగా మంచి గుర్తింపు పొందారు. వరంగల్‌ జిల్లా ల్యాబర్తి గ్రామంలో జన్మించిన జయప్రకాశ్‌రావు వరంగల్‌ సికెఎం కళాశాలలో బిఎస్సీ వరకు చదివారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పిజి పిహెచ్‌డి చేశారు. సిఎస్‌ఐఆర్‌ ఫెలోషిప్‌ కూడా సాధించారు. పేటెంట్‌ చట్టాలలో డిప్లమా పూర్తి చేశారు. రీసెర్చ్‌ అసోసియేట్‌గా అమెరికాలో నార్త్‌ కరోలినా యూనివర్సిటీలో అవకాశం వచ్చినా వదులుకుని ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యునిగా విధులు నిర్వర్తించారు. 2014 నుంచి తెలంగాణ యూనివర్సిటీలో ఆచార్యునిగా, సైన్స్‌ డీన్‌గా, అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌డైరెక్టర్‌గా, యుజిసి డీన్‌గా, ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరి గైడ్‌షిప్‌లో 8 మంది సిఎస్‌ఐఆర్‌ యుజిసి ఫెలోషిప్‌, ఇతర రీసెర్చ్‌ స్కాలర్స్‌ పిహెచ్‌డి పరిశోధనలు చేస్తున్నారు. ముప్పైకి పైగా పరిశోధనా పత్రాలు, రెండు పుస్తకాలు, కోర్సు మెటీరియల్‌ ప్రచురించారు. స్టేట్‌ బెస్ట్‌ టీచర్‌గా అవార్డుకు ఎంపికైన సందర్భంలో వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య, ఇతర అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *