Breaking News

Daily Archives: September 8, 2016

సిపిఐ ఆధ్వర్యంలో గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, సెప్టెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని అందుకు సంబంధించిన గోడప్రతులను గురువారం సిపిఐ నాయకులు ఆవిష్కరించారు. సెప్టెంబరు 11నుంచి 17 తేదీ వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించనున్నట్టు సీనియర్‌ నాయకులు వి.ఎల్‌.నర్సింహారెడ్డి తెలిపారు. సెప్టెంబరు 17 గురించి మాట్లాడే అర్హత బిజెపికి లేదని పేర్కొన్నారు. నాటి పోరాట వారసులు కమ్యూనిస్టులేనని, నిజాంపాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి కల్పించింది కమ్యూనిస్టు నాయకులేనన్నారు. బిజెపి నేతలు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం ...

Read More »

గిరిజన వసతి గృహంలో విద్యార్థుల గెంటివేతపై ఆందోళన

  కామారెడ్డి, సెప్టెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి శివారులోని గిరిజన వసతి గృహం నుంచి విద్యార్థులను రాత్రివేళ గెంటివేయడాన్ని నిరసిస్తూ గురువారం విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆలిండియా బంజారా సేవా సంఘ్‌, ఆర్‌ఎస్‌పి, సిపిఎం, ఏఐబిఎస్‌ఎఫ్‌, టిజివిపి ఆద్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్‌ఎస్‌పి ఆద్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవునిపల్లి ఎస్‌ఐ ఆద్వర్యంలో ఈనెల 5న రాత్రి వసతి గృహంలోని ...

Read More »

గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి

  కామారెడ్డి, సెప్టెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భిణీలు పౌష్టికాహారాన్ని తీసుకొని తాము ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనివ్వాలని అంగన్‌వాడి కార్యకర్తలు సూచించారు. కామారెడ్డి పట్టణంలోని రుక్మిణి కుంట అర్బన్‌ అంగన్‌వాడి సెంటర్లో గురువారం పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. ఈసందర్భంగా గర్భిణీలు తీసుకోవాల్సిన ఆహార విషయాలు, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. పాలు, పండ్లు, గుడ్లు, ఆకుకూరలతో పాలు పోషక విలువలు ఎక్కువగా ఉన్నపదార్థాలు తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ క్షేమంగా ఉంటారని సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడి కార్యకర్తలు సాదికా ...

Read More »

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

  బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కల్పన కామారెడ్డి, సెప్టెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కల్పన డిమాండ్‌ చేశారు. మహిళా మోర్చా ఆద్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో గురువారం విద్యార్థులకు విమోచన దినోత్సవ విశిష్టతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా కల్పన మాట్లాడుతూ విద్యార్థులకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వివరిస్తూ జిల్లాలోని అన్ని మహిళా కళాశాలల్లో పోటీలు ...

Read More »

గణేష్‌ మండపాల వద్ద అన్నదానం

  కామారెడ్డి, సెప్టెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని గణేష్‌ మండపాల వద్ద గురువారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రైల్వేస్టేషన్‌లోని యువజన సమాఖ్య గణేష్‌ మండలి, కిష్టమ్మ గుడి వద్దగల గణేష్‌ మండలి వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండపాల నిర్వాహకులు గోపీగౌడ్‌, రాజాగౌడ్‌, రవిగౌడ్‌, సాజిద్‌, శ్రీకాంత్‌గౌడ్‌, పవన్‌కుమార్‌, అర్చిత్‌ గౌడ్‌, రమేశ్‌, బిజెపి పట్టణ అధ్యక్షుడు చింతల రమేశ్‌, సంతు, ప్రవీణ్‌, నారాయణ, శ్రీనివాస్‌, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు. మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి ...

Read More »

ఎల్‌ఐసి ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిద పోటీలు

  కామారెడ్డి, సెప్టెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్‌ఐసి 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి ఎల్‌ఐసి శాఖ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి ఆర్కిడ్‌ పాఠశాల విద్యార్థులు అనూష, సాత్వికలు ప్రథమ స్థానంలో గెలుపొందారు. వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు శ్రీనివాస్‌, గోవర్ధన్‌రెడ్డి, నితిన్‌కుమార్‌, కిషన్‌, శ్రీధర్‌, అక్బర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

  – మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ కామారెడ్డి, సెప్టెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయులు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సామాన్య కుటుంబంలో జన్మించి ఆయన గురువు ఆశీస్సులతో అవిశ్రాంతంగా కృషి చేసి ఉపాధ్యాయవృత్తిలో రాణించి దేశంలోనే అత్యున్నత రాష్ట్రపతి పదవిని పొందారన్నారు. అలాంటి ...

Read More »

వినాయక చవితి మహా అన్నదాన కార్యక్రమం

  బీర్కూర్‌, సెప్టెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక చవితి పురస్కరించుకొని మండలంలోని పలు గణేష్‌ మండళ్ల ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గత నాలుగురోజులుగా వినాయక చవితి సందర్భంగా విద్యుత్‌ దీపకాంతులతో గణేష్‌ మండపాలను అలంకరించారు. మండల కేంద్రంలోని బీర్కూర్‌లో గంగపుత్ర కమిటీ సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మహాఅన్నదాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు. వినాయక నిమజ్జనం జరిగే వరకు ప్రతిరోజు మండలంలోని ఆయాగ్రామాల్లో వినాయక మండపాల ...

Read More »

తెవివి రిజిస్ట్రార్‌కు రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపకునిగా గురువారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతుల మీదుగా తెవివి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వై.జయప్రకాశ్‌రావు అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆచార్య జయప్రకాశ్‌రావు రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ టి.పాపిరెడ్డి, ఇతరసీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల సమక్షంలో ఈ అవార్డు ప్రదానం జరిగింది. ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు తన కుటుంబ ...

Read More »

కొలువుదీరిన గణపతులు

  నిజాంసాగర్‌ రూరల్‌, సెప్టెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంతో పాటు ఆయాగ్రామాల్లో ఏర్పాటు చేసిన గణేష్‌ మండపాల్లో భక్తులు వినాయకునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నిజాంసాగర్‌, మల్లూరు, కోమలంచ, సింగీతం, హసన్‌పల్లి గ్రామాల యూత్‌ సభ్యులు గణేష్‌ మండపాలను అందంగా అలంకరించారు. స్థానిక మండపాల వద్ద భక్తులు గణపయ్యకు విశేష పూజలతో పాటు నిత్య హారతులు సమర్పిస్తున్నారు. వినాయక నవరాత్రుల సందర్భంగా మండపాల వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. మండల కేంద్రంలోని పలు చోట్ల వినాయక ...

Read More »

బ్రేకింగ్: భారత బౌలర్‌ తలకు తగిలిన బాల్, తీవ్రగాయంతో ఆస్పత్రిలో చికిత్స

నోయిడా: తలకు తీవ్రమైన గాయంతో హుటాహుటిన హాస్పటల్‌కు తరలించబడి చికిత్స పొందుతున్నాడు భారత బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా. దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా గ్రీన్, ఇండియా బ్లూ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది. మ్యాచ్ గ్రేటర్ నోయిడాలో జరగగా ఓజా ఇండియా గ్రీన్ జట్టు తరుపున ఫీల్డింగ్ చేస్తున్నాడు. అయితే ఇండియా గ్రీన్ జట్టు బౌలర్ జలజ్ సక్సేనా వేసిన బంతిని ఇండియా బ్లు జట్టు బ్యాట్స్‌మన్ పంకజ్ సింగ్ మిడ్ ఆన్ మీదగా షాట్ బాదాడు. అక్కడ ఫీల్డింగ్ ...

Read More »

భర్తను పొడిచి భార్యను పొలాల్లోకి ఈడ్చుకెళ్లి..

లక్నో: ఉత్తరప్రదేశ్లో మరో బులంద్ షహర్ తరహా దాడి జరిగింది. గంగా నదిలో పుణ్యస్నానానికి వెళ్లొస్తున్న దంపతులపై ఓ గ్యాంగ్ దాడి చేసి భర్తను కత్తితో పొడిచి అతడి కళ్లముందే భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం దారుణంగా గొంతునులిమి చంపేశారు. అలీఘడ్ జిల్లాలోని కాస్గంజ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత ఆదివారం గంగానదిలో పుణ్యస్నానం చేసిన దంపతులు సైకిల్పై తిరిగొస్తున్నారు. అలా వచ్చే క్రమంలో మార్గం మధ్యలో ఉండగా ఓ గుర్తు తెలియని వ్యక్తుల గ్రూపు వారిపై ...

Read More »

మిర్చి రసం తాగించి అత్యాచారం చేసేవాడు.. ఆపై మెడిసన్స్ ఇచ్చేవాడు: బాలికలు

షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు చేపట్టిన విచారణలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. నయీమ్ కేసులో కీలక నేతలున్నట్లు ఇప్పటికే సిట్ అధికారులు చేపట్టిన విచారణలో వెల్లడైన నేపథ్యంలో నయీమ్ బాలికలపై విచక్షణారహితంగా లైంగిక దాడులకు పాల్పడినట్లు బాధితులే స్వయంగా చెప్పడం అందరినీ కంటతడి పెట్టేలా చేసింది. నయీమ్ గ్యాంగ్‌లో సుల్తానా, ఫయీం, తాహీరా, హసీనాబేగం, సలీమా బేగం తానియా తీవ్రంగా హింసించేవారని బాధిత బాలికలు చెప్తున్నారు. రెండ్రోజులకోసారి నయీం గదిలోకి వెళ్లాలని వేధించేవారని.. వెళ్ళకపోతే.. నయీమ్ ...

Read More »