Breaking News

Daily Archives: September 9, 2016

జీవ వనరులను సంరక్షించుకోవాలి

  – మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ సుష్మ కామారెడ్డి, సెప్టెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవ వనరులను సంరక్షించుకోవాలని కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. కామారెడ్డి పట్టణంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీవ వైవిద్య చట్టం – 2002 సంబందిత పరిజ్ఞానం కోసం శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీవ వైవిధ్య చట్టం ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక జీవవైవిద్య యాజమాన్య ...

Read More »

గణేష్‌ మండపం వద్ద అన్నదానం

  కామారెడ్డి, సెప్టెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని యువజన సమాఖ్య గణేష్‌ మండలి వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతియేటా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈయేడు సైతం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సమాఖ్య అధ్యక్షుడు రవిందర్‌గౌడ్‌ తెలిపారు. సింహాచలం గౌడ్‌ కార్యక్రమానికి అన్నదాతగా వ్యవహరించారన్నారు. కార్యక్రమంలో సమాఖ్య ప్రతినిధులు అచ్యుత్‌ గౌడ్‌, శ్రీకాంత్‌ గౌడ్‌, శ్రవణ్‌ కుమార్‌గౌడ్‌, సవేందర్‌ గౌడ్‌, రవి, గోనె శ్రీనివాస్‌, సాజిద్‌, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

  కామారెడ్డి, సెప్టెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం రోటరీ క్లబ్‌ ఆద్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. సూర్యప్రకాశ్‌రావు, అనురాద, సుధాకర్‌, మనోహర్‌, విజయలక్ష్మి, శివగౌడ్‌, వాణి, వీరబ్రహ్మం, సవిత, నరేందర్‌, మధుసూదన్‌, శ్యాంలకు శాలువాలు కప్పి జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత అయాచితం నటేశ్వర శర్మ, రోటరీక్లబ్‌ అధ్యక్షుడు విష్ణుమూర్తి, ప్రతినిధలు లక్ష్మినర్సింలు, సత్యం, శ్రీశైలం, డాక్టర్‌ బాలరాజు, డాక్టర్‌ వెంకట్‌రాజు, రంగారెడ్డి, ధనుంజయ్‌, సుభాష్‌ ...

Read More »

వైభవంగా కుంకుమార్చన

  కామారెడ్డి, సెప్టెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కిష్టమ్మ గుడిలోని గణేష్‌ మండపం వద్ద శుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శివకేశవ ఆలయ గణేష్‌ మండలి ఆద్వర్యంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతోపాటు గణేషునికి ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు. కార్యక్రమంలో వార్డుకౌన్సిలరన శశిరేఖ, పూజారి నాగరాజు శర్మ, మండలి ప్రతినిధులు కిరణ్‌, ప్రసాదన, నారాయణ, నర్సింలు, కాంగ్రెస్‌ నాయకులు దయానంద్‌, కృపాల్‌, పండ్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రెండోవిడతలో 92 చెరువుల పునరుద్దరణ

  నిజాంసాగర్‌ రూరల్‌, సెప్టెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకంలో రెండో విడతలో భాగంగా నియోజకవర్గంలోని 92 చెరువులను పునరుద్దరణకు ప్రభుత్వం నిదులు మంజూరు చేసిందని నీటిపారుదల శాఖ డిప్యూటి ఇఇ సురేశ్‌బాబు తెలిపారు. మండలంలోని అచ్చంపేట ఊరచెరువును శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 60 చెరువులకు నిదులు మంజూరు చేయగా 104 చెరువుల పనులు పూర్తయ్యాయి. మొదటి, రెండవ విడతలో త్వరితగతిన పనులు పూర్తిచేస్తామన్నారు.

Read More »

టగ్‌ ఆఫ్‌ వార్‌ సెలక్షన్స్‌కు భారీ స్పందన

  కామారెడ్డి, సెప్టెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శిశుమందిర్‌ పాఠశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి టగ్‌ ఆఫ్‌ వార్‌ సెలక్షన్స్‌లో క్రీడాకారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. విద్యార్తిని, విద్యార్థులు 300 మంది సెలక్షన్స్‌లో పాలుపంచుకున్నారు. వీరు పోటీల్లో తమ ప్రతిభను కనబరిచారు. క్రీడాకారులకు ఉపవిద్యాధికారి బలరాం క్రీడా దుస్తులను పంపినీ చేశారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయలు మధుసూదన్‌రెడ్డి, గులాం, భాస్కర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, రసూల్‌, హీరాలాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఉచిత వైద్య శిబిరం

  కామారెడ్డి, సెప్టెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం ఆరేంజ్‌ స్కిన్‌ ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత కిడ్నీ, మూత్రవ్యాధి నిర్దారణ శిబిరంలో 130 మందికి పరీక్షలు నిర్వహించినట్టు వైద్యులు రవిచందర్‌ తెలిపారు. 130 రోగులను పరిశీలించి వ్యాధికి గురైన వారికి తగిన చికిత్సలు చేయించుకోవాలని సూచించినట్టు తెలిపారు. వారికి వ్యాధులకు సంబంధించిన వివరాలు తెలిపారు. కార్యక్రమంలో ఆరేంజ్‌ ఫార్మా రవి, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, సెప్టెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిప్యూటి తహసీల్దార్‌ హైమద్‌ మస్రూద్‌ అన్నారు. వెల్గనూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో 226 కుటుంబాలకు గాను 138 కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయన్నారు. మిగతా కుటుంబాల వారు 15వ తేదీలోగా మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు చేపడతామన్నారు. ఒక్కొ లబ్దిదారునికి రూ.12 వేల చొప్పున నిదులు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ...

Read More »

జర్నలిస్టులకు సన్మానం

  కామారెడ్డి, సెప్టెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్యవైశ్య పట్టణ సంఘం, వాసవీ క్లబ్‌ కామారెడ్డి ఆద్వర్యంలో శుక్రవారం జర్నలిస్టు డేను పురస్కరించుకొని వివిద పత్రికలకు చెందిన జర్నలిస్టులను సన్మానించారు. జర్నలిస్టులు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశం, వెంకటి, ఇంద్రసేనారెడ్డి, దశగౌడ్‌లను సన్మానించారు. జర్నలిస్టులు సమాజ నిర్మాణంలో ప్రజలకు, పాలకులకు మధ్య వారధిలా పనిచేస్తున్నారని అన్నారు. అలాంటి జర్నలిస్టులను సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కైలాస్‌ శ్రీనివాస్‌రావు, నాగేశ్వర్‌రావు, మహేశ్‌గుప్త, ప్రవీణ్‌కుమార్‌, ఆంజనేయులు, కొండ భైరయ్య, హరిదర్‌, శ్రీనివాస్‌, నారాయణ, తదితరులు ...

Read More »

తెలంగాణ భావోద్వేగాలకు ప్రతీక కాళోజి

  నిజామాబాద్‌, సెప్టెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ భావోద్వేగాలకు ప్రతీకగా కాళోజి నిలుస్తారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌యోగితా రాణాపేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రగతిభవన్‌లో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా నిర్వహించిన తెలంగాణ భాషా దినోత్సవంలో జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ భాషకు, మాండలికం, వాడుక పదాలకు సాహిత్య సౌరభాన్ని చేకూర్చిన ఘనత కాళోజిదేనని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి కాళోజి వెలుగు దివ్వెగా ...

Read More »

ప్రజావసరాలకు అనుగుణంగా కొత్త కార్యాలయాలు

  – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నిజామాబాద్‌, సెప్టెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోఉన్న వనరులు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా, డివిజన్‌ స్థాయిల్లో ప్రభుత్వ కార్యాలయాలను కొనసాగించనున్నట్టు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తెలిపారు. శుక్రవారం జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణపై జిల్లా కలెక్టర్లు, అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో రాజీవ్‌శర్మ మాట్లాడారు. రాష్ట్రంలోని 10 జిల్లా కేంద్రాల్లోని కార్యాలయాలకు మంజూరైన 38 వేల పోస్టుల్లో ప్రస్తుతం 27 వేల 912 మంది ...

Read More »

రక్షణ సంపత్తికి కీలక ఒప్పందం

భారత్‌ అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య బంధం మరింత ధృఢపడటంతోపాటు రక్షణ రంగంలో కూడా పటిష్టబంధం ఏర్పడింది. ఇప్పటికే భారత్‌లోని పలురక్షణరంగ అవసరాలకు అమె రికా బాసటగా నిలుస్తోంది. మరికొన్నింటికి జాయింట్‌ వెంచర్లు రూపంలో భారత్‌కు రానున్నది. ఈదశలో ఇరు దేశాలమధ్య సైనికసేవల పరస్పర మార్పిడి ఒప్పందం (లెమోఆ) అత్యంత కీలకంగా మారింది. రక్షణమంత్రి మనోహర్‌ పారిక్కర్‌, అమెరికా రక్షణ మంత్రి ఆస్టన్‌ కార్టర్లు ఈ ఒప్పందంపై సంతకాలుచేసారు. భవిష్యత్తు మిలిటరీ ఒప్పందాలకు ఈ లమోవా కీలకం కానున్నట్లు అంచనా. అయితే భారత్‌ సార్వభౌమత్వంపై ...

Read More »

ఫేస్‌బుక్‌‌లో మీ ఫోటో పోస్ట్ చేస్తున్నారా… రకరకాల షేడ్స్‌లో పంపించండి

 హైదరాబాద్‌ సిటీ: ఎక్కడైనా మంచి ఫొటో దిగితే దాన్ని ఫేస్‌బుక్‌లో ప్రెండ్స్‌కి చూపించాలని తపన పడుతుంటారు. ఇమేజ్‌ ఎఫెక్ట్స్‌ చేసి మరీ పోస్టు చేస్తుంటారు.. దానికోసం థర్డ్‌పార్టీ యాప్స్‌ను వాడుతుంటారు. ఇప్పుడు వాటి అవసరం లేకుండానే ఫేస్‌బుక్‌ నేరుగా ఫొటో అప్‌లోడ్‌ చేసే సమయంలోనే ఎఫెక్ట్స్‌ పెట్టుకునేలా అవకాశం కల్పించింది. దీంతో రకరకాల షేడ్స్‌లో మన ఇమేజ్‌ను పోస్టు చేసుకోవచ్చు. మొత్తం ఆరురకాలుగా మార్చుకునే వీలుంది. ప్రస్తుతం బీటా వర్షన్‌ 94.0.0.8.68లో ఈ అప్‌డేట్‌ ఇచ్చారు. దీన్ని పూర్తిస్థాయిలో పరీక్షించిన తరవాత రెగ్యులర్‌ అప్‌డేట్‌ ...

Read More »

సమంతానే నా పెద్ద కోడలు: నాగార్జున

హైదరాబాద్‌: తన కుమారుల వివాహం గురించి ప్రముఖ హీరో నాగార్జున తొలిసారి పెదవి విప్పారు. స్టార్‌ హీరోయిన్‌ సమంతా తన కోడలు కాబోతోందని క్లారిటీ ఇచ్చారు. నాగ చైతన్యతోపాటు అఖిల్‌కు కూడా వివాహం నిశ్చయమైనట్లు వివరించారు. అఖిల్‌ నిశ్చితార్థం డిసెంబరు 9న ఉంటుందని, నాగ చైతన్య మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు అక్కినేని బ్రదర్స్‌ పెళ్లిళ్లపై మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. నాగచైతన్య సమంతాతోనూ, అఖిల్‌..అతని స్నేహితురాలు శ్రేయా భూపాల్‌తోనూ ప్రేమలో ఉన్నారని, వాళ్ల వివాహాలకు పెద్దలు కూడా అంగీకరించారని కథనాలు వచ్చాయి. ...

Read More »

ఇంకొక్కడు రివ్యూ

బ్యానర్: ఎన్.కె.ఆర్.ఫిలింస్ నటీనటులు: విక్రమ్, నయనతార, నిత్యామీనన్, తంబి రామయ్య, కరుణాకరన్, బాల తదితరులు సంగీతం: హారీష్ జైరాజ్ సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి ఎడిటింగ్: భాను శ్రీనివాసన్ నిర్మాత: నీలం కృష్ణారెడ్డి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఆనంద్ శంకర్ విక్రమ్ అంటేనే సినీ ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ ఉంది. కమర్షియల్ సినిమాలనే కాకుండా వాటికి భిన్నంగా ఉండే విలక్షణ చిత్రాల్లో కూడా నటిస్తుంటాడు. నటిస్తాడనడం కంటే జీవిస్తాడనే చెప్పాలి. ఎందుకంటే విక్రమ్ నటించిన అపరిచితుడు, నాన్న, ఐ ఇలా ...

Read More »

ఫే‌స్‌బుక్ ఫ్రెండ్.. ఇంటికి రమ్మన్నాడు.. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందిచ్చి అత్యాచారం చేశాడు

సోషల్ మీడియాతో ప్రజలు పొందే మేలు కొంతే అయినా.. కీడు మాత్రం అధికమేనని చెప్పాలి. తాజాగా సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో స్నేహితుడయ్యాడని నమ్మి అతనింటికి వెళ్లిన పాపానికి 16 ఏళ్ల బాలిక దారుణంగా మోసపోయిన ఘటన బెంగళూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. డానియెల్ (24) అనే యువకుడికి ఆరు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో బాధితురాలు పరిచయం అయ్యింది. వీరిద్దరి పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ కామన్ బర్త్ డే పార్టీ ఉందని.. బాధితురాలిని డానియెల్ ఇంటికి రమ్మన్నాడు. ఆతడిని నమ్మి ఇంటికొచ్చిన బాధితురాలికి ...

Read More »

డబ్బు కోసమే రాధిక ఆప్టే శృంగార సన్నివేశాలు లీక్ చేశారట

ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. రాధిక తాజా సినిమాలో కొన్ని శృంగార సన్నివేశాలకు సంబంధించిన వీడియో ఇటీవల లీకయింది. ఆ వీడియో గురించి ఇప్పటి వరకూ రాధిక ఒక్క మాటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దానికి కారణం ఆ సినిమా దర్శకనిర్మాతలు ముందుగానే ఆమెకు ఈ విషయం చెప్పి మాట్లాడకుండా ఉండడానికి కొంత సొమ్ము ముట్టజెప్పారట! సినిమా మీద మంచి హైప్‌ తీసుకురావడానికి ఈ విధంగా వీడియో వాళ్ళే స్వయంగా లీక్‌ చేయించారని అంటున్నారు. తనకు ఏది తోస్తే అది ...

Read More »

నాకొక జియో సిమ్‌ కావలెరా..

ఇది రేషన్‌ సరుకుల క్యూ కాదు. ఏ బ్లాక్‌బస్టర్‌ సినిమా టికెట్ల లైనో కూడా కాదు. రిలయన్స్‌ జియో సిమ్‌ కోసం తీరిన బారులు!! హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో గురువారం ఉదయం కనిపించిన దృశ్యమిది. ఇక్కడే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని చాలాచోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పొద్దుపొద్దున్నే పదైనా కాకముందే రిలయన్స్‌ దుకాణాల ముందు జనం క్యూలు కడుతున్నారు. మూణ్నెల్లపాటు దేశవ్యాప్తంగా ఎక్కడికైనా కాల్స్‌ చేసుకునే సదుపాయం.. అపరిమిత ఇంటర్నెట్‌ సౌకర్యాలు కల్పిస్తామంటూ రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించడంతో జియో సిమ్‌కు ...

Read More »

ఏపీకి ఇదే మా సాయం…. వెబ్‌సైట్‌లో పెట్టిన కేంద్రం

న్యూఢిల్లీ: ఏపీకి చేయబోయే సాయానికి సంబంధించిన వివరాలను కేంద్రం పీఐబీ వెబ్‌సైట్‌లో పెట్టింది. నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఏపీకి ప్రత్యేక సాయంపై చేసిన ప్రకటనను యధాతథంగా గురువారం వెబ్‌సైట్‌లో పెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదావల్ల కలిగే ప్రయోజనాలను కలిగించామని సైట్‌లో పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనేజేషన్ యాక్ట్‌లో ఉన్న మేరకు ఏ రకమైన సాయం చేయాలనే విషయాన్ని వెబ్ సైట్‌లో ఉంచారు. నాలుగు కేటగిరీల కింద ఏపీకి ప్రత్యేకసాయం అంటూ నీతి ఆయోగ్‌ సిఫార్సులను ఈ వెబ్ నోట్‌లో పొందుపరిచారు. ...

Read More »

బాబు భయపడాల్సిన అవసరం ఏమిటి?: వెంకయ్య

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి చంద్రబాబు భయపడుతున్నారని కొందరు అంటున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భయపడాల్సిన అవసరం చంద్రబాబుకు ఏముందంటూ, కష్టపడి పనిచేస్తున్నందుకు ఆయన భయపడాలా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు వైదొలిగితే మీకు ఛాన్స్‌ వస్తుందని అనుకుంటున్నారా? అని విపక్షాలను వెంకయ్య అడిగారు. ఏపీకి ప్రత్యేకహోదా కావాలని గతంలో తాను అడిగింది వాస్తవమేనని, ఏపీకి అన్యాయం జరిగిందని డిమాండ్‌ చేయడం వల్లే ఇవాళ ప్యాకేజీ వచ్చిందని వెంకయ్య పేర్కొన్నారు. హోదా ఇచ్చే అవకాశం లేనందువల్లే భారీ ప్యాకేజీ ఇస్తున్నామన్న ...

Read More »