Breaking News

Daily Archives: September 11, 2016

క్యాంపస్‌ జీవితం అత్యంత కీలకం

  – జిల్లా ఎస్పీ పి.విశ్వప్రసాద్‌ డిచ్‌పల్లి, సెప్టెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి విద్యార్థి జీవితంలో క్యాంపస్‌ జీవితం అత్యంత కీలకదశ అని జిల్లాఎస్పీ పి.విశ్వప్రసాద్‌ అన్నారు. క్యాంపస్‌ లైఫ్‌ అనేక విషయాలను, పాఠాలను, అనుభవాలను నేర్పిస్తుందని, క్యాంపస్‌ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ గణేష్‌ ఉత్సవ కమిటీ ఆద్వర్యంలో జరిగిన బహుమతుల ప్రదాన కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు ఆయన తెయు బాలుర వసతి గృహంలో జరిగిన వినాయక ...

Read More »

ప్రాజెక్టు అసిస్టెంట్‌ ఉద్యోగానికి తెయులో ఈనెల 16న ఇంటర్వ్యూ

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిపార్టు మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌అండ్‌ టెక్నాలజి, సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ బోర్డు ఆర్తిక సహాయంతో తెలంగాణ యూనివర్సిటీ కెమిస్ట్రి అధ్యాపకుడు డాక్టర్‌ జి.బాలకిషన్‌ నేతృత్వంలో నడుస్తున్న పరిశోధన ప్రాజెక్టులో రిసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు సెప్టెంబరు 16న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ కెమిస్ట్రి విభాగంలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రి చదివి 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత కనీస అర్హతగా పేర్కొన్నారు. ఏదైనా ...

Read More »

రిజిస్ట్రార్‌ను సన్మానించిన టూటా కార్యవర్గం

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వై.జయప్రకాశ్‌ రావును శాలువాతో సత్కరించారు. అధ్యక్షుడు డాక్టర్‌ ప్రవీణ్‌, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జి.చంద్రశేఖర్‌, జాయింట్‌ సెక్రెటరీ, నందిని, ఈసి మెంబర్‌ అతర్‌ సుల్తానా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అధ్యాపకులు డాక్టర్‌ ఎం.మమత, డాక్టర్‌ కె.రాజారాం తదితరులు పాల్గొన్నారు.

Read More »

కాళోజీ తెలంగాణ భాష గొప్పతనాన్ని చాటిన మహనీయుడు

  – రిజిస్ట్రార్‌ జయప్రకాశ్‌రావు డిచ్‌పల్లి, సెప్టెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాకవి కాళోజి నారాయణరావు తెలంగాణ భాష, యాస గొప్పతనాన్ని చాటిన మహనీయుడని తెయు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వై.జయప్రకాశ్‌రావు అన్నారు. తెలుగు అధ్యయన విభాగం అధిపతి ప్రొఫెసర్‌ పి.కనకయ్య ఆధ్వర్యంలో శుక్రవారం కాలోజీ జయంతిని తెలంగాణ భాషాదినోత్సవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ కాళోజి జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. సభకు అధ్యక్షత వహించిన ...

Read More »

గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన జిల్లాకలెక్టర్‌, ఎస్పీ

  నిజామాబాద్‌, సెప్టెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 15న నిర్వహించే గణేష్‌ నిమజ్జనానికి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. ప్రతి విగ్రహాన్ని సంప్రదాయకంగా, ఆనందోత్సాహాల మధ్య ప్రశాంతంగా నిమజ్జనం చేసేందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం నగరమేయర్‌ ఆకుల సుజాత, జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్‌, జిల్లా సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి శోభాయాత్ర ప్రారంబమయ్యే నగరంలోని దుబ్బ వద్ద నెలకొల్పిన వినాయక విగ్రహానికి కలెక్టర్‌ పూజలు చేశారు. ...

Read More »

పునర్‌ వ్యవస్థీకరణ పనులను 12 లోపు పూర్తి చేయాలి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, సెప్టెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పునర్‌ వ్యవస్తీకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు కానున్న కామారెడ్డి జిల్లా కార్యాలయం, బాన్సువాడ రెవెన్యూ కార్యాలయం, 9 మండల కార్యాలయాలకు సంబంధించిన ఫైళ్ళ విభజన, స్కానింగ్‌, పరికరాలు, వాహనాల వివరాలు, ఉద్యోగుల సమాచారాన్ని ఈనెల 12 తేదీ లోపు పోర్టల్‌లో నమోదు చేయాలని ...

Read More »

మీడియాతో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

లోకేష్ చెప్పడంతో ప్రధాని అయ్యే అవకాశం వదులుకున్నా ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రమ్మని చెప్పింది నేనే అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసేందుకు చాలా కష్టపడ్డా 23 ఏళ్లకే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ప్రయత్నించా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదిలేసుకున్నానని ఆయన అన్నారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన తర్వాత మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటిస్తూ ఈ విషయం చెప్పారు. ముఖ్యమంత్రి పదవి అయితే శాశ్వతంగా ఉంటుందని.. ప్రధానమంత్రి పదవి తాత్కాలికమేనని అప్పట్లో ...

Read More »

ప్రాణం తీసిన చాటింగ్‌

 భర్తతో గొడవ… గృహిణి ఆత్మహత్య  వరంగల్‌ క్రైం: ఫేస్‌బుక్‌ చాటింగ్‌ పచ్చని కాపురంలో చిచ్చుపెట్టి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వరంగల్‌ జిల్లా హన్మకొండలోని ఎస్‌బీహెచ్‌ కాలనీలో నివసించే భరత్‌కుమార్‌, గద్దల సంగీత (23)ది ప్రేమ వివాహం. భరత్‌ కాజీపేటలోని విద్యుత్‌ కార్యాలయంలో సబ్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఫేస్‌బుక్‌లో భర్త అమ్మాయిలతో చాటింగ్‌ చేయడం చూసిన సంగీత గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నావంటూ గొడవకు దిగింది. అటుపైన శనివారం భర్త ఆఫీసుకు వెళ్లాక బెడ్‌రూంలో ఉరివేసుకుంది. పోలీసులు భరతకుమార్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ...

Read More »

పవన్ కళ్యాణ్… కారం ఎవరికి పెట్టాలో తెలుసా..? పవన్‌కి రోజా సూచన

వైకాపా ఎమ్మెల్యే రోజా మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన మండిపడ్డారు. ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న ఎంపీలు కారం పూసుకుని కారం ముద్దలు తినాలని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు దండగ అని అన్నారామె. ఎంపీలకు కారం పూస్తే ఏమీ ప్రయోజనం ఉండదనీ, ఎందుకంటే వాళ్లకు నరేంద్ర మోదీ, చంద్రబాబు మాటల ఘాటు ముందు ఈ కారం ఘాటు ఓ లెక్క కాదన్నారు. అందువల్ల ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కారం పెట్టాలని సూచన చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ఒత్తిడి ...

Read More »

‘జనసేన’ మరో ‘ప్రజారాజ్యం’ కాదుకదా.. అభిమానుల్లో సందేహం

జనసేన పార్టీ మరో ప్రజారాజ్యం కాదుకదా అనే సందేహం హీరో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ప్రస్తుతం ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం పవన్‌ కళ్యాణ్‌ కాకినాడలో శుక్రవారం నిర్వహించనున్న బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం బుధవారం చేసిన ప్రకటనకు నిరసనగా శనివారం రాష్ట్ర బంద్‌కు విపక్షాలు పిలుపునిచ్చాయి. ప్యాకేజీపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన, విపక్షాల ఆందోళనల నడుమ ఇదే అంశంపై పవన్‌కల్యాణ్‌ నిర్వహించే ...

Read More »

ఫేస్‌‌బుక్ లవ్ రొమాన్స్: ప్రేయసి తండ్రికే లైవ్ వీడియో.. 33 మంది చూశారట

ఫేస్‌బుక్‌ను యువతరం తెగ వాడేసుకుంటున్నారు. వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఫోటోలకు లైక్స్ కొట్టేస్తున్నారు. అయితే ఓ యువకుడు మాత్రం తన ప్రేమకు ప్రియురాలి తండ్రి అడ్డుగా ఉన్నాడనే కోపంతో ఫేస్‌బుక్‌ను అస్త్రంగా వాడుకున్నాడు. ఎలాగంటే.. తన ప్రేయసితో చేసిన రొమాన్స్ వీడియోను లైవ్‌గా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా ప్రేయసి తండ్రికి కూడా ఆ వీడియోను పంపాడు. అంతే ఆ యువతి కుటుంబం షాక్ తింది. ప్రేమకు అడ్డు చెప్తున్నారని.. వారికి షాకివ్వాలని ఆ ప్రేమ జంట వింతగా ప్రవర్తించింది. ప్రేయసితో ...

Read More »

ఓవర్ వెయిట్ తగ్గించుకోవడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!

బరువు తగ్గించుకోవాలంటే మొదట గుర్తొచ్చేది డైట్ . డైలీ డైట్ లో ఫ్యాటీఫుడ్స్ ఉండటం, ఈ ఫుడ్స్ లో క్యాలరీలు అధికంగా ఉండటం మరియు కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల ఎక్స్ ట్రా పౌండ్ బరువు తగ్గడానికి ఎలాంటి చాన్సెస్ ఉండవు . వ్యాయామం ఎంత చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు . హెల్తీగా మరియు ఎఫెక్టివ్ గా బరువు తగ్గాలంటే మొదట డైట్ విషయంలో చాలా కఠినంగా ఉండాలి. పోషకాహార నిపుణుల సలహా మేరకు మంచి బ్యాలెన్సింగ్ డైట్ ను అనుసరిస్తున్నట్లైతే శరీరం ...

Read More »