Breaking News

Daily Archives: September 12, 2016

జిల్లాకు భారీ వర్షసూచన

  – అధికారుల అప్రమత్తం నిజామాబాద్‌, సెప్టెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే మూడురోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపార. ప్రజలకు అత్యవసర సేవలను అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టోల్‌ ప్రీ నెంబరు 18004256644 కు తెలియజేయాలని ప్రజలకు, ఉద్యోగులకు సూచించారు. సోమవారం తన చాంబరులో అధికారులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు మండల, ...

Read More »

ఖరీఫ్‌లో 3 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యం

  – సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి నిజామాబాద్‌, సెప్టెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ సీజన్‌లో 5,48,307 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసనట్లుజిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి తెలిపారు. రైతుల అవసరాలు, వినియోగానికి ఉంచుకునే ధాన్యం మినహాయించి దాదాపు 3.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం విక్రయానికి వస్తుందని, అందులో 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. ఐకెపి గ్రూపుల ద్వారా 22 కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ ...

Read More »

మందుబాబులకు పట్టపగలే మైకం…

  కామారెడ్డి, సెప్టెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి… ఇక ఇల్లేల ఓ సోదరా…! మందుబాబులకు పట్టపగలే మైకం కమ్ముతోంది. పట్టపగలే మద్యం సేవించి రోడ్లపై వీరంగం సృష్టిస్తున్నారు. మద్యం మత్తులో రోడ్లే ఇళ్లనుకొని నడిరోడ్లపైనే చిందులేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రోజూ ఏదోఒకచోట నిత్యకృత్యమైంది. ఇలాంటి ఫోటోలనే నిజామాబాద్‌ న్యూస్‌ క్లిక్‌ మనిపించింది.

Read More »

విద్యుత్‌ శాఖ దాడులు ఆపాలని విహెచ్‌పి ఆందోళన

  కామారెడ్డి, సెప్టెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యుత్‌ శాఖ అధికారులు గణేష్‌ మండపాలపై చేస్తున్న దాడులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డిలో ఆందోళన చేపట్టారు. విద్యుత్‌శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరెంటు బిల్లుల పేరిట ఆంక్షలు విదిస్తూ విద్యుత్‌ అధికారులు గణేష్‌ మండపాల నిర్వాహకులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారన్నారు. డిజెల అనుమతి, మైక్‌ల అనుమతి, విద్యుత్తు బిల్లుల పేరుతో ఆంక్షలు విధించడం ఏంటని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ నుంచి సొమ్ముకోట్ల రూపాయలు వాడుకుంటున్న ప్రభుత్వం హిందువుల ...

Read More »

వసతి గృహ సమస్యలు పరిష్కరించాలి

  కామారెడ్డి, సెప్టెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని బిసి బాలికల వసతి గృహంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. వసతి గృహంలో కనీసం తాగునీరు లేదని, నీటి సమస్యతో కళాశాలలకు వెళ్ళలేని పరిస్తితి నెలకొందన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సౌకర్యం కల్పించాలని కోరారు. స్నానపు గదులు, మరుగుదొడ్లు మరమ్మతులు చేయించాలని, సొంత భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓనుకోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి అరుణ్‌కుమార్‌, ...

Read More »

వైభవంగా సామూహిక కుంకుమార్చన

  కామారెడ్డి, సెప్టెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని షేర్‌ గల్లిలోగల యువసేన షేర్‌ ఫెడరేషన్‌ గణేష్‌ మండపం వద్ద సోమవారం సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనలు చేశారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో యువసేన ప్రతినిధులు ప్రణీత్‌, నవీన్‌, మధు, హరి, భాస్కర్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

గణేష్‌ మండపాల వద్ద అన్నదానం

  కామారెడ్డి, సెప్టెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేష్‌ నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని స్వర్ణకార యువజనసంఘం, రజకసంఘం, భగత్‌సింగ్‌ నగర్‌లోని హిందూ యూత్‌ క్లబ్‌, ముదాంగల్లిలోని భగత్‌సింగ్‌ యూత్‌ ఫెడరేషన్‌, షేర్‌గల్లిలోని యువసేన షేర్‌ ఫెడరేషన్‌, మున్నూరు కాపు సంఘం, పెద్దమ్మగల్లిలోని శివవినాయక హిందూ యూత్‌ క్లబ్‌తోపాటు మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలో హనుమాన్‌ యూత్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, కమిటీల ...

Read More »

కరెంటు బిల్లులు అధికంగా వస్తే కట్టేదెలా…?

  నిజాంసాగర్‌ రూరల్‌, సెప్టెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో గృహ అవసరాలకు వినియోగిస్తున్న విద్యుత్‌ బిల్లుల మోతతో గృహ యజమానులు బెంబేలెత్తుతున్నారు. మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో బిల్లులు వసూలు చేసేందుకు వచ్చిన ట్రాన్స్‌కో బిల్‌ కలెక్టర్‌ ప్రసాద్‌, జూనియర్‌ లైన్‌మెన్‌ శ్రీనివాస్‌పై ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ అవసరాల నిమిత్తం వాడుకునే విద్యుత్తు బిల్లులు అధికంగా రావడం ఏంటని అధికారులను నిలదీశారు. కరువు కాలంలో విద్యుత్తు బిల్లులు వందలాది రూపాయల్లో చార్జిలు ప్రజలపై వేస్తే ...

Read More »

హెచ్‌ఓడి వారిగా పునర్విభజన పనులు పూర్తిచేయాలి

  నిజామాబాద్‌, సెప్టెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన జిల్లాలు మనుగడలోకి తీసుకురావడానికి నెలరోజులు సమయం ఉన్నందున జిల్లా అధికారులు శాఖాపరమైన అన్ని వివరాలు పొందుపరచడానికి పనుల వేగం పెంచాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. సోమవారం ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ పునర్విభజన కార్యక్రమాలలో భాగంగా అసంపూర్తిగా ఉన్న వ్యవసాయ శాఖ, ఇంటర్‌ విద్య, పాఠశాల విద్య, తూనికల, కొలతల శాఖ, జిల్లా ట్రెజరీల శాఖలు శాఖాపరమైన కార్యకలాపాలను పూర్తిచేయడానికి ఈనెల 13న ...

Read More »

బక్రీద్‌ పర్వదినంకోసం ఏర్పాట్లు పూర్తి

  నిజాంసాగర్‌ రూరల్‌, సెప్టెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని 17 గ్రామ పంచాయతీల పరిదిలో ఈద్గాలు ముస్తాబు చేస్తున్నారు. ముస్లింలు ఎంతో ఘనంగా బక్రీద్‌ పండగ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రంజాన్‌ తర్వాత అతిపెద్ద పండుగ బక్రీద్‌ను ఘనంగా జరుపుకుంటారు. అలాగే నిజాంసాగర్‌, సుల్తాన్‌నగర్‌, కోమలంచ గ్రామాల్లోని ఈద్గాలకు రంగులువేసి అందంగా ముస్తాబు చేశారు.

Read More »

శివుడిని చెవిటి మల్లన్నఅని ఎందుకు పిలుస్తారు..?

పూర్వం ఒక రాకుమారి శివున్ని పెండ్లాడాలనుకొని, శివున్ని మల్లె పూవ్వులతోనూ, అర్జున పుష్పాలతోనూ పూజించేది. ఒక రోజు శివుడు ఆమెకు కలలో కనిపించి ఒక తుమ్మేదను చూపించి, అది వాలిన చోట వేచి ఉండాలని , తాను వచ్చి పెళ్లాడతానని చెప్పాడు ఆమెకి మెలుకువచ్చి, కళ్ళూ తెరువగానే ఒక భ్రమరం ఎగురుతూ కనిపించింది. ఆ తుమ్మెదను అనుసరిస్తూ, శ్రీశైల ప్రాంతములోని అడవిలో ఒక పొదమీద వాలడం చేత అక్కడ శివున్ని ధ్యానిస్తూ నిరీక్షించ సాగింది. ఆ అడవిలోని చెంచులు పాలు, పండ్లు తేనె మొదలగునవి ...

Read More »