Breaking News

Daily Archives: September 13, 2016

గణేష్‌ మండలాల్లో సాంస్కృతికప్రదర్శనలు అభినందనీయం

  బీర్కూర్‌, సెప్టెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేష్‌ మండపాల నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని బీర్కూర్‌ ఎస్‌ఐ రాజ్‌భరత్‌ అన్నారు. మండల కేంద్రంలోని 7వ వార్డులో సత్యశోధక్‌ గణేష్‌ మండలి ఆద్వర్యంలో సోమవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజలందరు ఐకమత్యంగా ఉండడానికి బాలగంగాధర్‌ తిలక్‌ స్వాతంత్య్రానికి పూర్వం గణేష్‌ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. బుధవారం నిర్వహించబోయే నిమజ్జన కార్యక్రమంలో మద్యం సేవించకుండా, డిజెలు ఏర్పాటు ...

Read More »

ఘనంగా బక్రీద్‌

  బాన్సువాడ, సెప్టెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ డివిజన్‌లో ముస్లింలు బక్రీద్‌ పండగను భక్తి, శ్రద్దలతో ఘనంగా నిర్వహించుకున్నారు. పెద్దల జ్ఞాపకార్థం చేసుకునే ఈ పండగను భక్తితో నిర్వహించారు. ఆయా ఈద్గాల వద్ద ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బాన్సువాడ ఈద్గా వద్ద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముస్లింలను కలిసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి రేష్మా, ఎజాజ్‌, జడ్పిటసి విజయ, గంగాధర్‌, సొసైటీ అధ్యక్షుడు ఎర్వల ...

Read More »

మంత్రిగారి గ్రామాల దత్తత…

  అంతా ఉత్తుత్తేనా… బీర్కూర్‌, సెప్టెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు గ్రామాల్ని దత్తత తీసుకొని అభివృద్ది చేసి ఆదర్శంగా నిలవాలన్న అంశం పక్కదారి పడుతోంది. బీర్కూర్‌ మండలంలోని బీర్కూర్‌ గ్రామాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దత్తత తీసుకున్నారు. కానీ ఆ గ్రామంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. గ్రామంలో ఇంటర్మీడియట్‌ కళాశాల కోసం గత పది సంవత్సరాలుగా పాలకులకు, అధికారులకు, నాయకులకు ఎన్నోమార్లు చెప్పినా ...

Read More »

ఘనంగా బక్రీద్‌

రెంజల్‌, సెప్టెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పలు గ్రామాల్లో ముస్లింలు ఘనంగా బక్రీద్‌ పండగ జరుపుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్తనలు నిర్వహించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఆనందోత్సాహాల నడుమ బక్రీద్‌ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.  ఈ సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టారు. మండల తహసీల్దార్‌ వెంకటయ్య, డిప్యూటి తహసీల్దార్‌ వినయ్‌ సాగర్‌ మండల ముస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

గ్రేటర్ ఆర్టీసీలో రూపాయి కోసం కోటి రూపాయల నష్టం

8 డిపోల్లో బస్సుల బంద్‌…! యూనియన్‌ మెరుపుసమ్మెతో నిలిచినబస్సులు మహిళా కండక్టర్‌ బదిలీతో వివాదం సమ్మెచేసిన కార్మికుల జీతాలు కట్‌ హైదరాబాద్/బోడుప్పల్‌ : గ్రేటర్‌ ఆర్టీసీలో ఓ మహిళా కండక్టర్‌ బదిలీ ఉద్యోగుల మెరుపు సమ్మెకు దారితీసింది. సోమవారం 8 డిపోల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీకి రూ.కోటి నష్టం వాటిల్లింది. అధికారులు, యూనియన్‌ నాయకుల తీరుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్‌, హయతనగర్‌ 1, 2, బండ్లగూడ, మహేశ్వరం, మిధాని, ఇబ్రహీంపట్నం, ...

Read More »

మనుషుల్ని నరికి పండుగ చేసుకున్నారు!

మోసూల్: ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్(ఈదుల్ అజ్ హా) వేడుకులు జరుపుకొంటున్న తరుణాన ఐసిస్ ఉగ్రవాద సంస్థ దారుణానికి ఒడిగట్టింది. గొర్రెలకు బదులు బందీల పీకలు తెగకోసి ఆ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఈశాన్య సిరియాలోని దెయిర్ అల్ జోర్ పట్టణంలోని ఒక జంతువధ శాలలో చిత్రీకరించినట్లుగా ఐసిస్ చెబుతోన్న వీడియోలో భారీ కాయుడైన జిహాదీ ఒకడు.. బందీలను దారుణంగా హతమార్చాడు. ఈ బందీలంతా సిరియాలో అమెరికా సైన్యాల కోసం గూఢచర్యం చేసి పట్టుబడ్డవారని, అందుకే ఈ ...

Read More »

అభిమానుల కోసం రష్మీ హాట్ కామెంట్

‘‘నాకున్న అందాన్ని చూపిస్తే తప్పేంటి’’ అని హాట్‌ యాంకర్‌ కమ్‌ నటి రష్మీ గౌతమ్‌ అంటోంది. సినిమాలంటేనే గ్లామర్‌ ప్రపంచం. ఆ గ్లామర్‌ ప్రపంచంలో అందం కాకుండా వేరేదైనా ఉంటుందా? కాకపోతే హీరోయిన్లను అందంగా చూపిస్తేనే ప్రేక్షకులు ధియేటర్లకు వస్తారు. అందంగా చూపించడం, కనిపించడం తప్పంటే ఎలా? అంటూ చిర్రుబుర్రులాడుతోంది. తన అందాన్ని తెర మీద చూపించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ, కొందరు దీన్ని మిస్‌ యూజ్‌ చేస్తున్నారని వాపోతోంది. అందానికీ, అసభ్యతకీ చిన్న గీత మాత్రమే అడ్డు, ఈ విషయం నాకు ...

Read More »

పెంపుడు కుక్క ఇష్టం లేదన్న వ్యక్తితో.. పెళ్ళి రద్దు చేసుకున్న యువతి

బెంగళూరు: కుక్కలంటే అమితమైన ప్రేమను చూపించే ఆ యువతి.. తనకు కాబోయే భర్త కూడా అలాగే ఉండాలని కోరుకుంది. అయితే ఇందుకు విరుద్ధమైన మనస్తత్వం అతనికుండటంతో ఏకంగా పెళ్లికి నిరాకరించింది ఆ బెంగళూరు యువతి. వివరాలు ఇలా ఉన్నాయి.. బెంగళూరుకు చెందిన కరిష్మా వాలియా గుడ్‌గావ్‌లో డిలైట్‌ ఇండియా కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు ఇటీవలే దిల్లీకి చెందిన ఓ కుటుంబం నుంచి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు పెళ్లికి అంగీకరించారు. అప్పటి నుంచి వీరి ఇద్దరి మధ్య ఫొన్‌ సంభాషణలు, ...

Read More »

‘పవన్ …! హైదరాబాద్‌ వదిలి వస్తావా?’

పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రా వాదా? సమైక్య వాదా? తెలంగాణా వాదా అనే విషయాన్ని ముందు తేల్చాలని విజయవాడ నగర బీజేపీ శాఖ డిమాండ్‌ చేసింది. ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరేవాడైతే హైదరాబాద్‌ నుంచి తరలి వచ్చి, విశాఖపట్నంలో సినీ పరిశ్రమ పెట్టడానికి ముందుకు రావాలని సవాల్‌ విసిరింది. సోమవారం బీజేపీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్‌ నాయకులు నేషనల్‌, స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యులు ఎల్‌.ఆర్‌.కె.ప్రసాద్‌, మాలకొండయ్య, సిటీ నాయకులు అర్ముగం, రవీంద్రారెడ్డి, శ్రీరామ్‌, చిన్నపురెడ్డి శివనాగేశ్వరరావు, శిరీష్‌ కుమార్‌, రఘు, ...

Read More »

ట్రస్ట్ నడుపుతున్నానని నమ్మించిన ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఏం చేశాడంటే…

ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి నుంచి సొమ్ము స్వాహా చేసి మాయమైన వ్యక్తిపై పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరి నితీష కానూరు సూపర్‌వీజ్‌ అకాడమీ వద్ద ఉంటుంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వంశీమనోహర్‌ తాను ఏపీ క్రికెట్‌ టీమ్‌ ఫ్లైయర్స్‌ ట్రస్ట్‌ నిర్వహిస్తున్నానని, క్రీడల్లో రాణించాలన్నా తన ట్రస్ట్‌ నుంచి పంపిస్తామని చెప్పి యువతి నుంచి రూ.60 వేలు తీసుకున్నాడు. ఆ తరువాత వంశీమనోహర్‌ ఆచూకీ లభించక పోవడంతో ఆ యువతి మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ...

Read More »

సెక్స్‌కు షెడ్యూల్ వేస్కుంటున్న తెలుగు జంటలు… పిల్లల్లేక సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ….

ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులోనే జరగాలి అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్లు చెప్పినట్లు మాత్రం జరగడంలేదు. చదవు, కెరీర్, ఉద్యోగం, ఉన్నతస్థానం… ఆర్థికంగా నిలదొక్కుకోవడం… ఇలా అన్నీ సమకూర్చుకునేసరికి అబ్బాయికి 40 ఏళ్లు, అమ్మాయికి 30 ఏళ్లు. అప్పుడు చాలా లేటుగా పెళ్లి. ఆ తర్వాత రెండేళ్ల తర్వాత… అయ్యో పిల్లలు కలగడంలేదే అంటూ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ చక్కెర్లు. ఇదీ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి. ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయనం నిర్వహించిన సర్వేలో ...

Read More »

పవన్‌ కళ్యాణ్‌ను వదలొద్దు… రంగంలోకి కావూరి సాంబశివరావు

‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వలేం… హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నిటినీ కలిపి ప్రత్యేక ప్యాకేజీగా ఇచ్చాం… ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని మెప్పించే ప్రయత్నం చేయండి.. ప్రతిపక్షాల దుష్పచారాన్ని అడ్డుకోండి.. జనసేనతో పాటు ఇతర ప్రతిపక్షాలకు దీటైన సమాధానం ఇవ్వండి’ అని బీజేపీ కేంద్ర నాయకత్వం పార్టీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసింది. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావును కూడా రంగంలోకి దించనుంది. విభజన బిల్లు సమయంలో కాంగ్రెస్‌ నేతలు ఆడిన నాటకాలను బయటపెట్టాలని ఆయన్ను ...

Read More »

బటర్‌ చికెన్‌

  కావల్సినవి: ఎముకల్లేని చికెన్‌ – అరకేజీ, చిక్కని పెరుగు – పావుకప్పు, వెన్న – అరకప్పు, వెల్లుల్లి రెబ్బలు – ఆరు, అల్లం – పెద్ద ముక్క, నూనె – టేబుల్‌స్పూను, ఉప్పు – తగినంత, గరంమసాలా – చెంచా, టొమాటోలు – నాలుగు, యాలకులు – ఏడు, దాల్చినచెక్క – చిన్నముక్క, లవంగాలు – నాలుగు, మెంతిపొడి – చెంచా, పచ్చిమిర్చి – రెండు, జీడిపప్పు – పావుకప్పు (నానబెట్టుకుని ముద్దలా చేసుకోవాలి), కసూరీమేథీ – చెంచా, క్రీం – పావుకప్పు. ...

Read More »