Breaking News

Daily Archives: September 14, 2016

అట్టహాసంగా ప్రారంభమైన గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర

  కామారెడ్డి, సెప్టెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో గణేష్‌నిమజ్జన శోభాయాత్ర బుధవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమైంది. తొమ్మిది రోజులు పట్టణంలో కొలువుదీరి పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలారు. గణేష్‌ మండపాల నిర్వాహకులు ట్రాక్టర్లను విద్యుత్‌ దీపాల కాంతులు, అందమైన డెకోరేషన్‌ చేసి శోభాయాత్రలో పాల్గొన్నారు. బుధవారంరాత్రి ప్రారంభమైన శోభాయాత్ర గురువారం రాత్రి వరకు సాగుతుంది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కామారెడ్డిలో 24 గంటలపాటు నిమజ్జన శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ యేడు కూడా శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు. డోలు ...

Read More »

టగ్‌ ఆఫ్‌వార్‌లో క్రీడాకారుల ప్రతిభ

  కామారెడ్డి, సెప్టెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి టగ్‌ ఆఫ్‌ వార్‌పోటీల్లో అండర్‌-19 బాలికలు, అండర్‌- 15 బాలుర విభాగాల్లో 3వ స్తానంలో నిలిచిన నిజామాబాద్‌ జిల్లా జట్లను బుధవారం కామారెడ్డిలో సన్మానించారు. జిల్లా టగ్‌ ఆఫ్‌ వార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నిట్టు కృష్ణమోహన్‌రావు, దామోదర్‌రెడ్డిలు క్రీడాకారులను, మేనేజర్‌, కోచ్‌లు గులాం హుస్సేన్‌, భాస్కర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వీణ, వెంకట్‌రెడ్డిలను అభినందించి జ్ఞాపికలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరిగిన టగ్‌ ఆఫ్‌ వార్‌ ...

Read More »

భూ ఆక్రమణలు అరికట్టాలి

  కామారెడ్డి, సెప్టెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :కామారెడ్డి మండలం పాతరాజంపేట, నర్సన్నపల్లి గ్రామ శివారుల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని అరికట్టాలని సిపిఎం మండల కార్యదర్శి రాజలింగం మంగళవారం తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డ మండలం నర్సన్నపల్లి గ్రామ శివారు సర్వేనెంబరు 114 భూమి ప్రభుత్వం ప్రజలకు ఇళ్ళ స్థలాలు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కొందరు ప్రభుత్వ అధికారులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్ముక్కై భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులు ...

Read More »

గణేష్‌ మండపాల వద్ద అన్నదానం

  కామారెడ్డి, సెప్టెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని గణేష్‌ మండపాల వద్ద నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డెయిలీ మార్కెట్‌లో యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో, భారత్‌ రోడ్డులోని యాదవ యూత్‌ ఫెడరేషన్‌ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గణేష్‌నవరాత్రి వేడుకల్లో భాగంగా భక్తులకు అన్నదానం చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గణేషునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Read More »

ఎప్పుడైనా కూలొచ్చు….

  నందిపేట పాఠశాల బాగయ్యేదెన్నడో… నందిపేట, సెప్టెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వపాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ది చేసి గ్రామాల్లోని పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించి ప్రయివేటు పాఠశాలలకు వెళ్లకుండా చూస్తామని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా ఆచరణలో మాత్రం శూన్యంగా ఉంది. మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా స్పందించే అధికారులు, నాయకులు మాత్రం లేరని ప్రజలు వాపోతున్నారు. ఉన్నత పాఠశాల భవనాన్ని దాదాపు 50 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ...

Read More »

కొనసాగుతున్న క్రీడా పోటీలు

  – వాలీబాల్‌ ప్రథమస్థానంలో అయిలాపూర్‌ విద్యార్థుల నందిపేట, సెప్టెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అయిలాపూర్‌ గ్రామంలో జరుగుతున్న మండల స్థాయి అంతర్‌ పాఠశాలల క్రీడా పోటీల్లో భాగంగా బుధవారం వాలీబాల్‌ జూనియర్‌లో అయిలాపూర్‌ పాఠశాల విద్యార్థులు మొదటి స్థానం సాదించారు. రెండవ స్తానంలో కొండాపూర్‌ పాఠశాల విద్యార్థులు నిలిచారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఏసిఎస్‌ ఛైర్మన్‌ లక్ష్మినారాయణ కరచాలనం చేసి పోటీలు ప్రారంభించారు. ఆయనతోపాటు గ్రామ సర్పంచ్‌ మీసాల సుదర్శన్‌ ఉన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ...

Read More »

ప్రశాంతంగా గణేష్‌ నిమజ్జనాలు

  రెంజల్‌, సెప్టెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కూనేపల్లి, బాగేపల్లి, బోర్గాం, దండిగుట్ట, కందకుర్తి గ్రామాల్లో మంగళవారం రాత్రి గణేష్‌ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం ప్రారంభమైన శోభయాత్ర అర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగింది. అనంతరం మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమంలో భక్తి శ్రద్దలతో భక్తులు నిమజ్జనాలు చేశారు. ఈ సందర్భంగా ముందస్తు చర్యగా బోధన్‌ రూరల్‌ సిఐ శ్రీనివాసులు ఆద్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. తహసీల్దార్‌ వెంకటయ్య, స్తానిక ఎస్‌ఐ రవికుమార్‌ ఆద్వర్యంలో అన్నిగ్రామాల్లో ...

Read More »

బొర్గాం చెరువుకు జలకళ

  రెంజల్‌, సెప్టెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. బోర్గాం, రెంజల్‌, సాటాపూర్‌, నీలా, దూపల్లి, తాడ్‌బిలోలి గ్రామాల్లోని చెరువుల్లో వర్షపు నీరు చేరడంతో చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. దశల వారిగా కురుస్తున్న వర్షాల వల్ల రైతాంగం పెద్ద మొత్తంలో నాట్లు వేశారు. డివిజన్‌ పరిధిలో ఎక్కడ కురవని వర్షాలు రెంజల్‌ మండలంలో కురిశాయని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఒకడుగు ముందుకేసి నాట్లు ముమ్మరం చేశారు.

Read More »

కొనసాగుతున్న గణపయ్య పూజలు

  రెంజల్‌, సెప్టెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని ధూపల్లి, తాడ్‌బిలోలి, రెంజల్‌ గ్రామాల్లో గణపయ్యలు విశేషపూజలందుకుంటున్నాయి. గణేష్‌ మండపాల వద్ద నిత్యం వేదమంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలునిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఆట, పాటలు, నృత్యాలు, భజనలు, కీర్తనలు ఆలపిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయా మండపాల వద్ద విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్నారు. పోటాపోటీగా అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు.

Read More »

ఫార్చూన్‌ 50లో అరుంధతీ, కొచ్చార్‌, శిఖా శర్మ

న్యూయార్క్‌: భారతకు చెందిన బ్యాంకింగ్‌ దిగ్గజాలకు సారథ్యం వహిస్తున్న అరుంధతీ భట్టాచార్య (ఎస్‌బిఐ), చందా కొచ్చార్‌ (ఐసిఐసిఐ), శిఖా శర్మ (యాక్సిస్‌ బ్యాంక్‌) ఫార్చూన్‌ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో తొలి 50 స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతులైన మహిళల ఫార్చూన్‌ జాబితాలో అరుంధతీ భట్టాచార్యకు రెండో స్థానం, కొచ్చార్‌కు ఐదో స్థానం దక్కగా శిఖాశర్మ 19 వ స్థానం పొందారు. మార్కెట్‌ విలువపరంగా యూరో జోన్‌లోనే అత్యంత పెద్ద బ్యాంకు అయిన బాంకో సంతాదర్‌ సారథి అనా బోతిన్‌ ...

Read More »

రేపు, ఎల్లుండి భారీ వాహనాలు, లారీలకు నో ఎంట్రీ

 రంగంలోకి 35వేలమంది పోలీసులు   సోషల్‌ మీడియా పోస్టులపై సైబర్‌కన్ను   నేటి అర్థరాత్రి వరకే ఖైరతాబాద్‌ గణేశ్‌ దర్శనం   ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు శివారువరకే   వినియోగంలోకి 12వేల సీసీ కెమెరాలు   నిమజ్జన ఘట్టానికి భారీ భద్రత  హైదరాబాద్‌ సిటీ/ఖైరతాబాద్‌: హైదరాబాద్‌లో మహానిమజ్జన ముగింపు ఘట్టానికి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్స్‌ పరిధిలో భారీఎత్తున అదనపు బలగాలను రంగంలోకి దింపారు. నిఘావర్గాల హెచ్చరికలు, పొరుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సోషల్‌మీడియాలో చేసే పోస్టులపై ...

Read More »

కావేరి కార్చిచ్చు

కర్ణాటకను కావేరి వివాదం కుదిపేస్తున్నది. సోమవారం పతాకస్థాయికి చేరిన హింస కాస్తంత తగ్గుముఖం పట్టినప్పటికీ, అడపాదడపా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బెంగుళూరు కర్ఫ్యూలో కొనసాగుతుంటే, మాండ్య, మైసూరు జిల్లాలు ఉద్రిక్తంగానే ఉన్నాయి. కేంద్రబలగాలు, రాష్ట్ర పోలీసు బృందాలు కలగలసి శాంతి స్థాపనకు కృషిచేస్తున్నాయి. తీవ్రహింస, విధ్వంసాలకు చలించిపోతూ ప్రధానమంత్రి చెప్పిన మంచిమాటలు, శాంతిభద్రతలను కాపాడే విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం ప్రకటించిన సంకల్పం ఈ కీలకదశలో అత్యంత అవశ్యమైనవి, ప్రశంసనీయమైనవి. దీనితోపాటుగానే, నీటి విషయంలో చేసిన రాద్ధాంతమూ, రేగిన విధ్వంసమూ పాతికవేలకోట్ల ...

Read More »

కొట్టుకుంటున్న మహిళలను పెంపుడు కుక్క రఫ్ఫాడించింది

కుక్క విశ్వాసముగల జంతువు అని అంటూ ఉంటారు. ఆ మాట నిజమేననిపిస్తుంది. ఒకే చోట ఉంటున్న వాళ్ళ మధ్య గొడవలు జరగడం మామూలే. ఓ అమ్మాయి ఎదురింటివాళ్ళతో గొడవకు వెళ్ళింది. తిరిగి వచ్చేసింది. ఆమె వెనుకనే మరో ఇద్దరు వచ్చి మరొకామెను జుత్తుపట్టుకుని కొట్టారు. ఇంతలో ఆ మొదటి అమ్మాయి మళ్ళీ విరుచుకుపడింది. అందరూ కొట్టుకుంటూ ఉంటే పెంపుడు కుక్క వచ్చి తన యజమానిని కొడుతున్నవాళ్ళమీద విరుచుకుపడింది. ఎగురుతూ కరిచేసింది. దానికి భయపడి అందరూ ఎక్కడివాళ్ళక్కడే పారిపోయారు.

Read More »

నాకు ధోనీ అంటే ఇష్టం లేదు.. సచినంటేనే అభిమానం’

తాను ధోనీ అభిమానిని కాదని, సచిన్ టెండూల్కర్ అంటేనే ఇష్టమని ‘ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ’ చిత్ర దర్శకుడు నీరజ్ పాండే పేర్కొన్నారు. ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నీరజ్ మాట్లాడుతూ తాను ధోనీ అభిమానని కాదని తేల్చి చెప్పారు. సినిమా తీయాలంటే అభిమానే అయి ఉండక్కర్లేదని పేర్కొన్నారు. అభిమాని అయితే సినిమా చిత్రీకరణలో కొంత వివక్ష ఉండేదని, లేదు కాబట్టే స్వేచ్ఛగా ఈ ...

Read More »

ఓయో ప్రైవసీ రూమ్స్… ప్రేమ జంట‌లు… పెళ్ళికాని వారి కోసం కూడానా…?

హైద‌రాబాద్: పెళ్లి కాని వాళ్ళు… ప్రేమ జంట‌లు ప్రైవ‌సీ కోసం పాట్లు ప‌డుతుంటారు. పార్కుల్లో చెట్టులు, పుట్ట‌ల చాటున రొమాన్స్ చేస్తుంటారు. అలాంటి వారి కష్టాలు ఇక తీరినట్టే. పార్కులు ఇతరత్రా ప్రాంతాలకు ప్రైవసీ కోసం వెళ్లనవసరం లేదు. పోలీసు రైడింగుల ఆందోళన లేదు. ఎంచక్కా ఓయో హోటళ్లను బుక్ చేసుకోవచ్చు. రొమాన్స్‌కు ఓయో అన్ని సదుపాయాల్ని కల్పిస్తోంద‌ట‌. ఇప్పటివరకు కొన్ని మెట్రో నగరాల్లో మాత్రమే ప‌రిమిత‌మైన ఓయో సేవ‌లు ఇపుడు దేశ వ్యాప్తంగా 200 నగరాలకు విస్తరించారు. ఓయో 70 వేల హోటళ్లను ...

Read More »

పడక గదిలో మహిళల కోర్కె తీర్చలేక మగాళ్లు చస్తున్నారు… స్త్రీలకు అది చేస్తేనే బెటర్… ఎంపీ కామెంట్స్

ఈమధ్య కాలంలో శృంగారం గురించి ఓపెన్‌గా మాట్లాడుకోవడం ఎక్కువవుతోంది. ఇదివరకు పడకగదిలో శృంగారం గురించి మాట్లాడాలంటే కాస్త ఆగి గుసగుసలా మాట్లాడుకునేవారు. ఇప్పుడదంతా ఏమీ లేదు. చాలా ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే… ఈజిప్ట్ దేశ మహిళలు శృంగార కోరికలతో రెచ్చిపోతున్నారట. ఐతే ఆ స్త్రీల శృంగార కోర్కెలను తీర్చలేక పురుషులు తోటకూర కాడల్లా వేలాడిపోతున్నారట. తమ కోర్కెలను తీర్చలేని పురుషులను చూసి అసహనం ఒకవైపు, తమ కోర్కెలు చల్లారక సతమతం అవుతూ పిచ్చెక్కిపోతున్నారట. దీనిపై ఆ దేశం ఎంపీ ...

Read More »