Breaking News

Daily Archives: September 16, 2016

మరుగుదొడ్ల నిర్మాణానికి గ్రామ కమిటీలకు రూ. 56.76 కోట్లు విడుదల

  – జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, సెప్టెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా రూపొందించేందుకు లక్ష 6 వేల 965 వ్యక్తిగత మరుగుదొడ్లను మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. ఈ పనులను పర్యవేక్షించి, పూర్తి చేయించేందుకు గ్రామస్థాయి తాగునీరు, పారిశుద్య కమిటీలకు రూ. 56.76 కోట్ల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న 4.92 లక్షల కుటుంబాలలో 3.55 లక్షల కుటుంబాలకు వ్యక్తిగత ...

Read More »

లా కళాశాలలో ప్రపంచ లా దినోత్సవం

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ న్యాయ కళాశాలలో ప్రపంచ లా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జట్లింగ్‌ యెల్లోసా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ ఉండడం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా స్థిరత్వం ఉందని తెలిపారు. ప్రపంచంలో వివిధ దేశాలమధ్య, సంస్థల మధ్య, వ్యక్తుల మధ్య వివాదాలు అన్ని కూడా ప్రపంచంలో లా ఉండడం వల్లనే పరిష్కారమవుతున్నాయని ఆయన వివరించారు. అంతర్జాతీయ చట్టాలు అమల్లోకి వచ్చిన సందర్భాన్ని ...

Read More »

నీరుపోస్తున్నట్టు లెక్కలుంటేనే మొక్కలు ఉన్నట్లు

  – జిల్లాకలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, సెప్టెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు హరితహారం కింద నాటిన మొక్కలకు ఉపాధి హామీ కూలీలతో అనుసంధానం చేసి మొక్కల సంరక్షణకు నీరు పోస్తున్నట్టు జాబ్‌కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితేనే మొక్కలు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తుందని జిల్లాకలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా వివరించారు. శుక్రవారం డిచ్‌పల్లి టిటిడిసిలో అధికారులతో సమావేశమయ్యారు. హరితహారం మొక్కల మనుగడకు చేపట్టిన చర్యలను కలెక్టర్‌ సమీక్షించారు. ఇకనుండి ప్రతి మొక్కకు వారం వారం నీరు పోయాలని ...

Read More »

ఎస్‌పి నూతన భవనాన్ని పరిశీలించిన ఐజి

  కామారెడ్డి, సెప్టెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కాబోతున్న నేపథ్యంలో ఎస్‌పి భవనాన్ని ఏర్పాటు చేసేందుకు కామారెడ్డి గిరిజన బాలుర వసతి గృహంతోపాటు పలు భవనాలను శుక్రవారం ఐజి సంజయ్‌ జైన్‌ పరిశీలించారు. పట్టణ శివారులోగల గురుకుల పాఠశాల వసతి గృహంతోపాటు అక్కడే ఉన్న ఓ ప్రయివేటు భవనాన్ని సైతం పరిశీలించారు. ఎస్‌పి కార్యాలయానికి అనువుగా ఉండేలా భవనాన్ని మరమ్మతులు చేపట్టి త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని సిబ్బందికి ఆదేశించారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని సూచించారు. ఆయన వెంట ...

Read More »

పరీక్షల నియంత్రణ అధికారిగా ఆచార్య కనకయ్య

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌గా ప్రొఫెసర్‌ పి.కనకయ్య నియమితులైనట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్య ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వై.జయప్రకాశ్‌రావు ఈ నియామ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా 2014 ఫిబ్రవరి నుండి విదులు నిర్వహిస్తున్న ఆచార్యకనకయ్య ఇక పరీక్షల విభాగంపై దృష్టి సారించనున్నారు. పరీక్షల నియంత్రణ విభాగాన్ని మరింత సమర్థవంతంగా, తక్కువ ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో ఇంజనీర్లు, లాయర్లకు సన్మానం

  కామారెడ్డి, సెప్టెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌కామారెడ్డి ఆధ్వర్యంలో ఇంజనీర్స్‌డే, లాయర్స్‌ డే పురస్కరించుకొని శుక్రవారం న్యాయవాదులు, ఇంజనీర్లను సన్మానించారు. సీనియర్‌ న్యాయవాదులు వెంకట్‌రాంరెడ్డి, వంగరమేశ్‌తో పాటు సీనియర్‌ ఇంజనీర్లు సంగమేశ్వర్‌, వినోద్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాది రాంచంద్రారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అద్యక్షుడు సిద్దిరాములు, క్లబ్‌ ప్రతినిదులు కాంశెట్టి, రాజన్న, దామోదర్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, నరేశ్‌ చంద్‌, రమేశ్‌ చంద్‌, పాండురంగ శర్మ, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

Read More »

న్యాయవాదులకు సన్మానం

  కామారెడ్డి, సెప్టెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌కామారెడ్డి వివేకానంద ఆధ్వర్యంలో కామారెడ్డిలో శుక్రవారం న్యాయవాదులను ఘనంగా సన్మానించారు. కామారెడ్డి కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదుల గదిలో కామారెడ్డి జిల్లా కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అమృత్‌రావు, అదనపు ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కిషన్‌లను సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్‌ అద్యక్షుడు బి.ప్రవీణ్‌, ప్రతినిధులు శ్రీనివాస్‌, హర్షిత్‌గౌడ్‌, వెంకటేశ్‌గౌడ్‌, కాంశెట్టి, జయప్రకాశ్‌, రాజన్న, బార్‌ అసోసియేషన్‌ అద్యక్షులు క్యాతం సిద్దిరాములు తదితరులు ...

Read More »

సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే సహించం

  – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కామారెడ్డి, సెప్టెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయని, వాటిని మానుకోకపోతే సహించే ప్రసక్తేలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సిపిఐ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి బస్సు యాత్ర శుక్రవారం కామారెడ్డికి చేరుకుంది. సిపిఐ నాయకులు కామారెడ్డిలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సాయుధ పోరాట యోధుడు ...

Read More »

తెలంగాణ విమోచన దినోత్సవం రోజున జాతీయజెండా ఎగురవేస్తాం

  – బిజెపి మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మోతె కృష్ణాగౌడ్‌ కామారెడ్డి, సెప్టెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి బూత్‌ కమిటీలో జాతీయజెండా ఎగురవేయాలని బిజెపి కామారెడ్డి మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మోతె కృష్ణాగౌడ్‌ పిలుపునిచ్చారు. కామారెడ్డిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భారతదేశానికి 1947 ఆగష్టు 15న స్వాతంత్య్రం రాగా, తెలంగాణకు 1948 సెప్టెంబరు 17న స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఏ ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా ప్రకటించకపోవడం ...

Read More »

డివైడర్‌ను ఢీకొన్న పాఠశాల బస్సు

  – పలువురు విద్యార్థులకు గాయాలు కామారెడ్డి, సెప్టెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం లింగాపూర్‌ శివారులోగల ఎస్‌పిఆర్‌ పాఠశాలకు చెందిన బస్సు తాడ్వాయి మండలం నుంచి విద్యార్థులను తీసుకొని వస్తుండగా డివైడర్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో ఇద్దరుఆయలతో పాటు పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. పిల్లలు అల్లరి చేస్తుండగా వారిని అదుపులో పెట్టడం కోసం డ్రైవర్‌ తనవద్ద కర్రను పెట్టుకున్నాడు. ప్రమాదవశాత్తు కర్ర స్టీరింగ్‌కు అడ్డుపడడంతో లాక్‌అయింది. దీంతో బస్సువెళ్ళి డివైడర్‌ను ఢీకొంది. క్షతగాత్రులను కామారెడ్డి ఆసుపత్రికి తరలించి ...

Read More »

మళ్ళీ పొంగుతున్న నల్లవాగు

  నిజాంసాగర్‌ రూరల్‌, సెప్టెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నల్లవాగు మత్తడి పొంగి పొర్లుతోంది. ఆయకట్టును నమ్ముకున్న రైతుల ఆశలు చిగురుతున్నాయి. ఖరీఫ్‌సీజన్‌ ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా వరుణుడు కరుణించకపోవడంతో వర్షాలు కురవలేకపోయాయి. ఆగష్టు చివరి వారంలో మెదక్‌జిల్లాఎగువ భాగంలో కురిసిన వానలకు నల్లవాగు మత్తడిలోకి భారీగా వరదనీరు వచ్చి పొంగుపొర్లుతోంది. అంతేగాకుండా కుడి, ఎడమ కాలువల ద్వారా మాగి, గూర్గుల్‌, మర్పల్లి గ్రామ శివారులోని చెరువులు, కుంటల్లో వరదనీరు పుష్కలంగా వచ్చి చేరుతోంది.

Read More »

రబీకి భరోసా…

  బాన్సువాడ, సెప్టెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కష్టాలతో ఖరీఫ్‌ సాగును గట్టెక్కుతున్న రైతులకు ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాలు రబీకి భరోసా నిస్తున్నాయి. బాన్సువాడ డివిజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక ఖరీఫ్‌ సాగు కష్టసాద్యంగా మారింది. చాలావరకు భూములు పడావుగా ఉన్నాయి. వరిసాగు పూర్తిగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో రైతులు రబీసాగుపైనే ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో అల్పపీడనం కారణంగా ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో ఆశలు కల్పిస్తున్నాయి. నీటి వనరులు పూర్తిగా నిండనప్పటికి భూగర్భజలాలు ...

Read More »

వైద్యవిద్యకే చికిత్స!

ఒకనాడు ఎంతో పవిత్రంగా భావించి ఆరాధించి పూజించిన ‘సరస్వతి రానురాను అంగడి బొ మ్మగా మారిపోయింది. నేడువిద్య ఒక వ్యాపా రంగా రూపుదాల్చింది. విద్యనే కాదు విద్యార్థులతో సహా ఏకంగా విద్యాసంస్థలను అమ్ముకునే దురదృష్టపు రోజు లు దాపురించాయి. విద్యార్థులకు,తల్లిదండ్రులకు ధనభా రం మోయలేనంతగా పెరిగిపోతున్నది.పాలకుల అస మర్థత, అధికారుల చేతకానితనానికి, అవినీతికి నిదర్శ నంగా దేశ వ్యాప్తంగా విద్యావ్యాపారం మూడుపువ్ఞ్వలు, ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నది. లాభసాటిగా ఉన్న ఈ వ్యాపారంలోకి గతంలో సారా వ్యాపారం చేసేవారు, కాంట్రాక్టర్లు,కొందరు రాజకీయనాయకులు నేరుగా పాలు పంచుకుంటున్నారు.ముఖ్యంగా వైద్యవిద్య ...

Read More »

డేటాలోనూ హైదరాబాదే కింగ్‌

తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్‌  డిజిటలైజేషన్‌ దిశగా నాలుగు పాలసీలు  హైదరాబాద్‌ : ఐటి రంగం వలెనే డేటా, అనలిటిక్స్‌ విభాగంలో కూడా హైదరాబాద్‌ను దేశంలో అగ్రస్థానంలో నిలపడమే తమ లక్ష్యమని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు (కెటిఆర్‌) అన్నారు. డేటా, అనలిటిక్స్‌ విభాగాల అభివృద్ధికి దోహదపడే నాలుగు పాలసీలను ఆయన గురువారం విడుదల చేశారు. వాటిలో డేటా అనలిటిక్స్‌ పాలసీ, డేటా సెంటర్స్‌ పాలసీ, ఓపెన్‌ డేటా పాలసీలతో పాటు సైబర్‌సెక్యూరిటీ పాలసీ కూడా ఉంది. ఈ సందర్భంగా ...

Read More »

వారంతా ఇక లేనట్లే!

  ఏఎన్‌-32 విమాన ప్రయాణికులు బతికుండే అవకాశం లేదు   రక్షణ శాఖ కోర్టు ప్రకటన   ఆర్థిక సాయం అందిస్తాం: రక్షణ మంత్రి న్యూఢిల్లీ: సుమారు రెండు నెలల క్రితం చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయల్దేరి వెళ్లిన భారత వాయుసేన విమానం ఏఎన్‌-32 ప్రమాదానికి గురైందని, అందులో ప్రయాణించినవారంతా బతికుండే అవకాశం లేదని రక్షణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆ విమాన ప్రయాణికుల కుటుంబ సభ్యులకు అధికారికంగా సమాచారం అందజేసింది. ఢిల్లీలోని వాయుసేన ప్రధాన కార్యాలయం నుంచి ఆగస్టు 24న లేఖ ద్వారా మృతుల కుటుంబాలకు ...

Read More »

మృత దేహాలను దానంగా ఇచ్చేస్తున్నారు..

మత విశ్వాసాలను సడలించుకుని ఉన్నత భావాలతో ముందుకు వస్తే లక్షలాదిమంది వైద్య విద్యార్థులకు, అవసరార్థులకు మేలు జరుగుతుందని ప్రపంచం నిత్యం ఘోషిస్తూనే ఉంది. ఇప్పుడు అమెరికాలో చాలామంది ఇలా ముందుకు వస్తున్నారట. ప్రత్యేకించి మరణించిన తర్వాత అంత్య క్రియల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఆ ఖర్చులు భరించలేక తమ మృత దేహాలను మెడికల్‌ స్కూల్స్‌కు దానంగా ఇచ్చేందుకు వేలాదిమంది అమెరికన్లు ముందుకు వస్తున్నారట. ఇది గొప్ప పరిణామమని విశ్వవిద్యాలయాలు ఆహ్వానిస్తు న్నాయి. రాబోయేతరం వైద్యులు ఎంతో చక్కగా విద్యా భ్యాసం చేయడానికీ, డిసెక్షన్‌ ప్రాక్టికల్స్‌ ...

Read More »

భార్య శవం మోసినందుకు కురుస్తున్న లక్షలు… గొణుక్కుంటున్న ఊరి ప్రజలు….

కట్టుకున్న భార్య మరణిస్తే ఆమె మృతదేహాన్ని తరలించేందుకు డబ్బు లేక భుజం పైన వేసుకుని 10 కిలోమీటర్లు నడిచిన ఒడిశా కహండి ప్రాంత వాసి దానా మాఝి దశ తిరిగిపోయింది. అతడి దీనావస్థ చూసి దేశవిదేశాల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. బెహరైన్ ప్రధాని అతడికి రూ. 9 లక్షల చెక్కను పంపారు. ఇక సామాన్యులు, స్వచ్ఛంద సంస్థలు పంపుతున్న డబ్బు వస్తూనే ఉంది. అతడికి ఇందిరా ఆవాస్ యోజన కింద ఇంటి నిర్మాణానికి రూ. 75 వేలను ఇచ్చింది ఒడిశా ప్రభుత్వం. ఇక రెడ్ ...

Read More »

నగ్న సన్నివేశాల విషయంలో రాధికను మోసం చేశారట!

రాధికా ఆప్టే.. కొన్నాళ్ల కిందట ‘పర్చేద్‌’ నగ్న సన్నివేశాలతో సంచలనం సృష్టించింది. ఆ సన్నివేశాలు చూస్తుంటే ఈమేనా ‘రక్తచరిత్ర’, ‘లెజెండ్‌’, ‘కబాలి’ వంటి సినిమాల్లో ఎంతో సాంప్రదాయబద్ధమైన పాత్రల్లో కనిపించింది అనే అనుమానం వస్తుంది. అజయ్‌దేవ్‌గన్‌ రూపొందించిన ఆ సినిమాలో అంతలా రెచ్చిపోయింది ఈ అమ్మడు. అయితే ఈ సన్నివేశాల్లో నటించడానికి రాధిక ఓ షరతు విధించిందట. ముందు దానికి అంగీకరించిన సిబ్బంది తర్వాత మాట తప్పారట. మొదట ఆమెకు కథ చెప్పినప్పుడు ‘పర్చేద్‌’ చిత్రాన్ని అసలు భారతదేశంలో విడుదల చేయబోమని చెప్పారట. ఒకవేళ ...

Read More »

లారీ డ్రైవర్‌ కూతురికి 8వ ర్యాంకు

ఆదిలాబాద్‌ : చదువులో ఉన్నతశిఖరాలను అధిరోహించేందుకు కుటుంబ నేపథ్యం, స్థాయితో సంబంధం లేదని నిరూపించిందో అమ్మా యి! టీఎస్‌ ఎంసెట్‌-3లో ఓ లారీ డ్రైవర్‌ కూతురు ఏకంగా టాప్‌టెన్‌ ర్యాంకర్‌గా గుబాళించింది. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్‌లో నివసిస్తున్న లారీ డ్రైవర్‌ సయ్యద్‌ అక్తర్‌ హుస్సేన్‌కు ముగ్గురు కుమార్తెలు. చిన్న కుమార్తె నూజ్‌హత ఫాతిమా ఎంసెట్‌-3లో 8వ ర్యాంకును సాధించింది. గతంలో ఆమెకు ఏపీ ఎంసెట్‌లో 68, ఎంసెట్‌-1లో 51, ఎంసెట్‌-2లో 77వ ర్యాంకు దక్కింది. అక్తర్‌ హుస్సేన్‌ పెద్దమ్మాయి బీటెక్‌ పూర్తి చేయగా, ...

Read More »

హిందూపురంలో 144 సెక్షన్ అమలు

హిందూపురంటౌన్: బాలయ్య నియోజకవర్గమైన హిందూపురం పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఘటనలతో అలర్ట్‌ అయిన జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన పురం చేరుకుని పరిస్థితి చక్కదిద్దే పనిలో పడ్డారు. మంగళవారం ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో రెండు వర్గాలమధ్య చెలరేగిన కవ్వింపు చర్యతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. దీంతో రాత్రి 8గంటలప్రాంతలో ఇరువర్గాలను స్థానిక పోలీస్‌ ఉన్నతాధికారులు చెదరగొట్టారు. అయితే ఈ సమాచారం ఉన్నతాధికారులకు కొంత ఆలస్యంగా తెలియడంతో రాత్రికి రాత్రే జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు పట్టణానికి చేరుకుని శాంతి భద్రతల పరిరక్షణకు ...

Read More »