Breaking News

Daily Archives: September 17, 2016

డివిజనల్‌ కార్యాలయాలకు కొత్త లాగిన్‌ సంఖ్య

  నిజామాబాద్‌, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా డివిజనల్‌ కార్యాలయాలపై కొత్త లాగిన్‌ సంఖ్య కేటాయిస్తున్నట్టు నిజామాబాద్‌ ఆర్డీవో యాదిరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో పలు జిల్లా అధికారులతో డివిజనల్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఫర్నిచర్‌, ఇతర వివరాలు వేరుగా నమోదు చేయాలని, ఇందుకు డివిజనల్‌వారిగా ఆయా శాఖలకు కొత్త లాగిన్‌ సంఖ్యను కేటాయించడం జరిగిందని తెలిపారు. అధికారులు డివిజనల్‌ వారిగా సిబ్బంది, ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆయన ...

Read More »

తెయు ప్రజాసంబంధాల అధికారిగా డాక్టర్‌ రాజారాం

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రజా సంబంధాల అధికారిగా మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగాధిపతి డాక్టర్‌ కె.రాజారాం నియమితులయ్యారు. తెయు వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ వై.జయప్రకాశ్‌రావు ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఈ పదవిలో డాక్టర్‌ రాజారాం సంవత్సరం పాటు ఉంటారన్నారు. గతంలో కూడా పిఆర్‌వోగా పనిచేశారన్నారు. తనపై నమ్మకంతో తన పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చిన విసి, రిజిస్ట్రార్‌లకు రాజారాం కృతజ్ఞతలు తెలిపారు. పలువురు అధ్యాపకులు, సిబ్బంది ఆయనను అభినందించారు.

Read More »

తెయులో ముగ్గురు కొత్త డీన్లు

  డిచ్‌పల్లి, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మూడు ఫాకల్టీలకు కొత్త డీన్లు నియామకమయ్యారు. ఈ మేరకు వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ జయప్రకాశ్‌రావు ఉత్తర్వులు అందజేశారు. పాకల్టీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ డీన్‌గా ప్రొఫెసర్‌ ఎస్‌.మహేందర్‌రెడ్డి, సోషల్‌ సైన్సెస్‌ ఫాకల్టీ డీన్‌గా ప్రొఫెసర్‌ టి.యాదగిరిరావు, లా ఫాకల్టీ డీన్‌గా ప్రొఫెసర్‌ ఎం.వి.రంగారావులు నియమితులయ్యారు. వీరంతా కాకతీయ యూనివర్సిటీలో వివిధ ఉన్నత పదవులు నిర్వహించి అపార అనుభవం ఉన్నవారే. ఈ నియామకాలతో వివిధ ఫాకల్టీలు బలోపేతమవుతాయని, ...

Read More »

భవిష్యత్‌లో తెలుగుకు మంచిరోజులు

  – ఆచార్య ఎల్లూరి శివారెడ్డి డిచ్‌పల్లి, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగుకు ప్రాచీన భాష హోదా దక్కడంతో తెలుగుకు భవిష్యత్‌లో మంచిరోజులు వస్తాయని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నారు. తెలుగు జాతీయస్థాయిలో ప్రాచీన భాష హోదా దక్కడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషియే ప్రధానకారణమని, తెలంగాణ సాంస్కృతిక సంచాలకుడు మామిడి హరికృష్ణ అభినందనీయుడన్నారు. ప్రొఫెసర్‌ శివారెడ్డి శనివారం తెయు తెలుగు అధ్యయనశాఖ ఆధ్వర్యంలో జరిగిన అధ్యాపకుల సమావేశంలో ముఖ్య అతిథిగా ...

Read More »

మాదిగ చైతన్య పాదయాత్ర గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నల్గొండ జిల్లానుంచి ఈనెల 18న నిర్వహించనున్న మాదిగ చైతన్య పాదయాత్రకు సంబంధించిన గోడప్రతులను శనివారం కామారెడ్డి ఎంఆర్‌పిఎస్‌ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వేముల బలరాం మాదిగ ఆవిష్కరించారు. చెప్పులు కుట్టే ప్రతిమాదిగకు రూ.2 వేల పింఛన్‌, డప్పు కొట్టే ప్రతి మాదిగకు రూ. 2 వేలు పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గతంలో మంత్రులు కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్‌లు పించన్ల విషయంలో హామీలిచ్చి ఇంతవరకు దాన్ని అమలుచేయలేదని పేర్కొన్నారు. ...

Read More »

వృద్దులకు అన్నదానం

  కామారెడ్డి, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అక్షర టెక్నో పాఠశాల ఆధ్వర్యంలో వృద్ద మహిళ సంక్షేమ నిలయంలో వృద్దులకు శనివారం అన్నదానం చేశారు. విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్‌ అశోక్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ హేమలత మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, నిమజ్జనం రోజు లడ్డు వేలం వేయగా వచ్చిన డబ్బుతో వృద్దులకు అన్నదానం చేసినట్టు తెలిపారు. పాఠశాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

Read More »

బల్దియా ముట్టడించిన ట్యాంకర్ల నిర్వాహకులు

  కామారెడ్డి, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రయివేటు ట్యాంకర్లను వాడుతున్న బల్దియా సిబ్బంది వారికి బిల్లులు చెల్లించకపోవడంతో శనివారం ట్యాంకర్ల నిర్వాహకులు కామారెడ్డి బల్దియాను ముట్టడించారు. ట్యాంకర్‌లు నిలిపివేసి బల్దియా వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు మునిసిపల్‌ అధికారులు, పాలకవర్గం ఒక ట్రిప్పుకు 350 చొప్పున రోజుకు 6 ట్రిప్పులు నడిపేలా తమతో ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. మూడునెలల ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ...

Read More »

మహాశిల్పి విశ్వకర్మ

  కామారెడ్డి, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అద్బుత కట్టడాలు నిర్మించిన మహాశిల్పి విశ్వకర్మ అని దేవునిపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం, కామారెడ్డి సువర్ణ, రజత, రత్న, ఆభరణ వర్తకసంఘం, స్వర్ణకార సంఘం ప్రతినిదులు అన్నారు. శనివారం కామారెడ్డిలో, మండలంలో విశ్వకర్మ జయంతి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలువేసి పూజలు చేశారు. విశ్వకర్మ భజన కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులకు ఆరాధ్యుడు, ప్రపంచాన్ని మలిచిన శిల్పి విశ్వకర్మ అన్నారు. పురాతన కాలంలోనే ద్వారకా నగరాన్ని, ...

Read More »

కొత్త కలెక్టరేట్‌ కోసం భవన పరిశీలన

  కామారెడ్డి, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నూతన జిల్లాగా ఏర్పడనున్న నేపథ్యంలో కలెక్టరేట్‌ ఏర్పాటు కోసం భవనాన్ని శనివారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా, జిల్లా ఎస్‌పి విశ్వప్రసాద్‌లు పరిశీలించారు. కామారెడ్డి పట్టణ శివారులోని గురుకుల వసతి గృహంతోపాటు ఇతర భవనాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ భవనం ఏర్పాటు కోసం చేపట్టాల్సిన చర్యలు, మార్పులు, చేర్పుల గురించి అధికారులతో చర్చించారు. త్వరితగతిన కలెక్టరేట్‌ భవనానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేయాలని, దసరా నుంచి కార్యాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ...

Read More »

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

  కామారెడ్డి, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ స్వర్ణకార సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, స్వర్ణకార యువజన సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలువేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిదులు కృష్ణయ్య, సుదర్శన్‌, పోశాద్రి, చంద్రమౌళి, మారుతి, శ్రీనివాస్‌, ఉపేశ్‌, ఈశ్వర్‌, ప్రవీణ్‌, బ్రహ్మం, చక్రపాణి, కృష్ణమూర్తి తదితరులున్నారు.

Read More »

మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వెటర్నరి శిబిరం

  బీర్కూర్‌, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ ఆద్వర్యంలో మండలంలోని అన్నారం గ్రామంలో శనివారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌ ప్రారంభించారు. గ్రామంలో పశువులకు, పెంపుడు జంతువులకు వైద్య శిబిరంలో పరీక్షలు జరిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ అంజవ్వ, మార్కెట్‌కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

బీర్కూర్‌ తడిసి ముద్దయింది

  బీర్కూర్‌, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత ఐదారురోజులుగా కురుస్తున్న వర్సాలకు గాను మండలంలోని ఆయా గ్రామాల ఊరచెరువులు, ప్రధాన చెరువుల్లో వర్షపు నీరు చేరి నిండుకుండల్ని తలపిస్తున్నాయి. గత రెండు మూడు సంవత్సరాలుగా వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంటలు వేయలేకపోయిన రైతులు ఈయేడు వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఆయా గ్రామాల ప్రధాన రహదారుల్లో వర్షపు నీరుచేరి డ్రైనేజీ వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైంది. కొన్ని గ్రామాల్లో వర్షపు నీటితో మట్టిరోడ్లు గుంతలుగా ఏర్పడి ప్రయాణీకులకు అసౌకర్యాన్ని ...

Read More »

బీర్కూర్‌లో 24 మి.మీల వర్షపాతం నమోదు

  బీర్కూర్‌, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షం 24 మి.మీలుగా నమోదైనట్లు తహసీల్దార్‌ కృష్ణానాయక్‌ తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల దృష్ట్యా మండలంలోని ఆయా గ్రామాల్లో డ్రైనేజీలను పరిశుభ్రంగా ఉంచాలని, వర్షపు నీరంతా పల్లపు ప్రాంతాలకు వెళ్లేవిధంగా గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండాయని అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో మండలంలోని ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More »

డొంకేశ్వర్‌ గ్రామాన్ని మండల కేంద్రం చేయాలి

  నందిపేట, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డొంకేశ్వర్‌ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని డిమాండ్‌ చేస్తూ మండల సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం నందిపేట మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ముంపునకు గురైన 14 గ్రామాల ప్రజలు, సర్పంచ్‌లు, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు కలిసి 40 ట్రాక్టర్లలో మండల కేంద్రానికి చేరుకొని డొంకేశ్వర్‌ను మండల కేంద్రంగా చేయాలని నినాదాలు చేశారు. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా చేసేందుకు ...

Read More »

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

  కామారెడ్డి, సెప్టెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని న్యాయవాదులు, బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు. కోర్టు ఆవరణలో జాతీయ జెండా ఎగురవేశారు. బిజెపి నాయకులు మునిసిపల్‌ ఆవరణలో, అదేవిధంగా పార్శి రాములు కళ్యాణమండపం వద్ద జాతీయజెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆందోళన చేసిన తెరాస అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవం ఊసెత్తకపోవడం గర్హణీయమన్నారు. నిజాం నిరంకుశ పాలన ...

Read More »

నెల రోజులలో గర్భవతి అవ్వాలంటే?

గర్భవతి అవ్వాలనుకుంటే, సాధారణంగా నెలల తరబడి వేచి వుండటానికి అసహనం అనిపిస్తుంది. ఎంత త్వరగా గర్భవతి అయిపోదామా? అనిపిస్తుంది. మరి త్వరగా గర్భం ధరించటమెలా? పరిశీలించండి. మీ పిరియడ్ ఎపుడు మొదలవుతోంది? ఎపుడు ముగుస్తోంది వంటివి పరిశీలించండి. గర్భం ధరించాలంటే పిరీయడ్ సరిగా రావాలి. పిరియడ్ సక్రమంగా వచ్చే బలమైన ఆరోగ్యకర ఆహారాలు తినండి. అండోత్సర్గం మీలో ఎలా జరుగుతోందనేది బాగా పరిశీలించండి. అండం విడుదలయ్యే రోజులు గుర్తించండి. ఇది సరిగ్గా మీకు 14వరోజున అవుతుంది. మీరు తినే ఆహారంలో తగినంత ఫోలిక్ యాసిడ్ ...

Read More »

ఉల్లిరైతుల కష్టాలు

అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లుగా ఉంది రైతులు పరిస్థితి. రైతుల వద్ద ఉత్ప త్తులు ఉన్నప్పుడు ధరలు పాతాళలోకానికి పడిపోతున్నాయి. అదే ఉత్పత్తులు దళారుల వద్దకో, వ్యాపారుల గోదాములకో చేరిన తర్వాత ధరలు ఆకా శాన్ని అంటుతున్నాయి. ఏ పంటల ధరలు తీసుకున్నా ఇదే పరిస్థితి. రైతులు అమ్ముకుంటున్న ధరలకు విని యోగదారులు కొంటున్న ధరలకు ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. దేశవ్యాప్తంగా లెక్కకడితే ఈ వ్యత్యాసం కొన్ని వేలకోట్ల రూపాయలకు పెరుగుతుంది. దళారు లను, ఈ దగాను నియంత్రించేందుకు, నిరోధించేందుకు ...

Read More »

గల్ఫ్‌ బాధితులకు ఉచిత ప్రయాణం

గల్ఫ్‌ దేశాల్లో సంక్షోభిత నిర్మాణ సంస్థల్లో పనిచేస్తూ స్వదేశానికి తిరిగి వెళ్తున్న ప్రవాసీయులను విమానాశ్రయాల నుంచి ఇళ్లకు చేర్చేందుకు ప్రభుత్వాలు ప్రయాణ ఖర్చులను సమకూరుస్తున్నాయి. జీతాలు లేక.. కనీసం ప్రయాణ టికెట్లు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో బాధితులు ఉండడంతో న్యూఢిల్లీ, హైదరాబాద్‌ విమానాశ్రయాల నుంచి వారి స్వస్ధలాలకు వెళ్లడానికి ప్రభుత్వాలు ఈ ఏర్పాట్లు చేస్తున్నాయి. బాధితుల గురించి హైదరాబాద్‌లోని అధికారులు ముందుగా విదేశీ వ్యవహారాల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. వారిని విమానాశ్రయంలో కలుసుకొని స్వస్ధలాలకు వెళ్లే బస్సుల వరకు తీసుకెళ్లడంతోపాటు టికెట్లకు డబ్బు కూడా ...

Read More »

మరో రేపిస్టుకు తప్పిన ఉరి!

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: కేరళలో ‘నిర్భయ’ లాంటి కేసులో దోషికి పడిన ఉరిశిక్షను సుప్రీం గురువారం రద్దుచేయగా.. శుక్రవారం చిన్నారి కేసులో కరుడుగట్టిన నేరగాడికి ఉరిని రద్దుచేసింది. మధ్యప్రదేశ్‌లో ఐదేళ్ల క్రితం ఏడేళ్ల చిన్నారిని రేప్‌చేసి దారుణంగా హత్యచేసిన కేసులో దోషికి కింది కోర్టులు విధించిన ఉరిశిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. అతనికి 25 ఏళ్లపాటు కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. దోషి తట్టు లోధీ అలియాస్‌ పంచమ్‌ లోధీ చేసిన నేరం అత్యంత అరుదైన నేరాల కోవలోకి రాదు ...

Read More »

జిఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ రేసులో అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌

 30 శాతం వాటాల కొనుగోలుకు సన్నాహాలు  డీల్‌ విలువ రూ.2,000 కోట్లు !  హైదరాబాద్‌ : జిఎంఆర్‌ గ్రూప్‌ సారథ్యంలోని జిఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జిహెచ్‌ఐఎఎల్‌)లో 30 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ సన్నాహాలు చేస్తోంది. సుమారు 2,000 కోట్ల రూపాయలు వెచ్చించటం ద్వారా ఈ వాటాలను తీసుకోవాలని లియోన్‌ బ్లాక్‌ ఆధ్వర్యంలోని అపోలో గ్లోబల్‌ భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాటాల విక్రయానికి సంబంధించి జిఎంఆర్‌ ఇన్‌ఫ్రా ఇప్పటికే అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌, అబుదాబి ...

Read More »