నెల రోజులలో గర్భవతి అవ్వాలంటే?

గర్భవతి అవ్వాలనుకుంటే, సాధారణంగా నెలల తరబడి వేచి వుండటానికి అసహనం అనిపిస్తుంది. ఎంత త్వరగా గర్భవతి అయిపోదామా? అనిపిస్తుంది. మరి త్వరగా గర్భం ధరించటమెలా? పరిశీలించండి. మీ పిరియడ్ ఎపుడు మొదలవుతోంది? ఎపుడు ముగుస్తోంది వంటివి పరిశీలించండి. గర్భం ధరించాలంటే పిరీయడ్ సరిగా రావాలి. పిరియడ్ సక్రమంగా వచ్చే బలమైన ఆరోగ్యకర ఆహారాలు తినండి. అండోత్సర్గం మీలో ఎలా జరుగుతోందనేది బాగా పరిశీలించండి. అండం విడుదలయ్యే రోజులు గుర్తించండి. ఇది సరిగ్గా మీకు 14వరోజున అవుతుంది. మీరు తినే ఆహారంలో తగినంత ఫోలిక్ యాసిడ్ వుండేలా చూడండి. ఫోలిక్ యాసిడ్ గర్భ విచ్ఛిన్నం కాకుండా, బిడ్డకు అవక తవకలు లేకుండా చేస్తుంది. పచ్చని ఆకు కూరలు, కాయ ధాన్యాలు, నిమ్మజాతి పండ్లు, కిడ్నీ బీన్స్, బ్రక్కోలి, గింజధాన్యాలు, చిరు ధాన్యాలు వంటివి మీ ఆహారంలో చేర్చండి. ప్రతిరోజూ రతి చేస్తే వీర్యం నాణ్యత, పరిమాణం తగ్గిపోతుంది. అందుకని ప్రతి రెండు రోజులకొకసారి రతి ఆచరించండి. వీర్యం లోతుగా గర్భ ద్వారం వద్ద పడేలా స్కలనం చేయమని పురుషుడిని కోరండి. వీర్యం బాగా లోపలికి ప్రవేశించే రతి భంగిమలు ఆచరించండి. అంగం లోపలకంటా చొచ్చుకుపోతే గర్భం ధరించటం తేలికవుతుంది. వ్యాయామాలు చేయండి. మీ శరీర బరువు కూడా గర్భానికి సహకరించాలి. కనుక అధిక బరువు లేకుండా, శరీరంలో మంచి రక్త ప్రసరణ జరిగితే త్వరగా గర్భం ధరించే అవకాశం వుంది. ఈ చర్యలు చేపడితే, ఒక నెల రోజులలో గర్భం ధరించటం తేలికకాగలదని భావించండి.

Check Also

నెలాఖరులోగా పత్తిరైతులకు గుర్తింపు కార్డులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెలాఖరులోగా పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *