Breaking News

Daily Archives: September 30, 2016

ఘనంగా శ్రీనవదుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు

  బీర్కూర్‌, సెప్టెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో నవదుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని దుర్గామాత విగ్రహాలను శనివారం ప్రతిష్టించనున్నారు. బీర్కూర్‌గ్రామంలో హనుమాన్‌ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు దేవి ప్రతిష్టాపన జరుగుతుందని అధ్యక్షుడు గంగాదాస్‌ తెలిపారు. ఉదయం 6 గంటలకు స్వాములకు మాలధారణ, అమ్మవారికి అభిషేకం దీక్షా స్వాముల చేత నిర్వహించడం జరుగుతుందన్నారు. 11 సంవత్సరాల నుండి ఉత్సవాలు సందర్బంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.

Read More »

భారీ వర్షం… జనం అతలా కుతలం….

  బాన్సువాడ, సెప్టెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అల్ప పీడనం వల్ల కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్థంభించింది. బాన్సువాడ డివిజన్‌లో భారీ వర్షాలకు జలసిరులు ఆవిష్కృత మవుతున్నాయి. నిన్నటి వరకు నోళ్లు తెరిచిన బీళ్ళు నీటితో కళకళలాడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చిన్ననీటి వనరులు నిండిపోయి రబీకి భరోసా కల్పిస్తున్నాయి. మంజీర, లెండి వాగులు వరదలతో ఉప్పొంగుతున్నాయి. దీంతో బిచ్కుంద, మద్నూర్‌, జుక్కల్‌ మండలాల్లో పరివాహక గ్రామాలు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కౌలాస్‌ ప్రాజెక్టు నీటిని ...

Read More »

నిజాంసాగర్‌ ప్రాజెక్టు రెండుగేట్లు ఎత్తివేత

  నిజాంసాగర్‌ రూరల్‌, సెప్టెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా రైతుల వరప్రదాయిని అయిన నిజాంసాగర్‌ ప్రాజెక్టులో రెండు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం వరకు ఇన్‌ఫ్లో తగ్గడంతో ప్రాజెక్టు ద్వారా రెండుగేట్ల ద్వారా మాత్రమే నీటి విడుదల కొనసాగుతుంది. నిజాంసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుపై పర్యాటకుల సందడి ఆరురోజుల నుండి నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి కొనసాగుతూనే ...

Read More »

పంట రుణాలు మాఫీ చేయాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, సెప్టెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గడిచిన మూడు సంవత్సరాల నుంచి వర్సాల జాడ లేకపోవడం వల్ల రైతులు కరువు ఎదుర్కొన్నారని, అందుకే సహకార సంఘంలో తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని రైతుల కోరిక మేరకు తీర్మానం చేశారు. సింగూరు సహకార సంఘం ఆధ్వర్యంలో గున్కుల్‌లో మోహిదుద్దీన్‌ అధ్యక్షతన శుక్రవారం మహాజనసభ నిర్వహించారు. ముందుగా సిఇవో విఠల్‌రెడ్డి మాట్లాడుతూ ఆరునెలల జమ, ఖర్చులు నివేదిక చదివి వినిపించారు. రైతులకు సంఘం ద్వారా స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు ...

Read More »

వరద తాకిడికి కొట్టుకు పోయిన రహదారి

  నిజాంసాగర్‌ రూరల్‌, సెప్టెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టు 16,12 గేట్లు నీటిప్రవాహం వల్ల అచ్చంపేట రహదారి కొట్టుకుపోయిపెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. దాదాపు 60 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన చిన్నదిగా ఉండడంతో 16 వరద గేట్లు నీటి ప్రవాహం ఈ రోడ్డు గుండా వస్తుంది. ఈ రోడ్డుకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణీకులకు ప్రమాదకరంగా మారింది. అచ్చంపేట, ఆరేపల్లి వెళ్లాలంటే ఈ రహదారి ...

Read More »

శనివారం నుంచి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు

  కామారెడ్డి, సెప్టెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని తూర్పు హౌజింగ్‌బోర్డు కాలనీలోగల శ్రీ శారదా మందిరంలో అక్టోబరు 1వ తేదీ నుంచి 11 వరకు దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు శనివారం ప్రముఖ పండితులు అయాచితం నటేశ్వరశర్మ రచించిన శ్రీశారదా అష్టోత్తర శతనామా స్తోత్రం అనే గ్రంథాన్ని ప్రముఖ వేదపండితులు గంగవరం ఆంజనేయశర్మ ఆవిష్కరిస్తారన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయం 6.30 గంటల నుంచి సుప్రభాతం, ...

Read More »

ఆర్యక్షత్రియ శంఖారావాన్ని విజయవంతం చేయాలి

కామారెడ్డి, సెప్టెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో అక్టోబరు 5న నిర్వహించనున్న రాష్ట్ర ఆర్యక్షత్రియ శంఖారావం బహిరంగ సభ విజయవంతం చేయాలని ఆర్యక్షత్రియ ప్రతినిదులు కోరారు. కామారెడ్డిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని క్షత్రియ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆర్యక్షత్రియులపై ఉందన్నారు. బహిరంగసభకు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తోపాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవిందర్‌రెడ్డి, చీప్‌ విప్‌ సుధాకర్‌రెడ్డి, ఇతర నాయకులు హాజరు కానున్నట్టు తెలిపారు. ఆర్యక్షత్రియులు సభ విజయవంతం ...

Read More »

ఛలో హైదరాబాద్‌ విజయవంతం చేయండి

  కామారెడ్డి, సెప్టెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అక్టోబరు 3న తలపెట్టిన ఛలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జేఏసి నాయకులు కోరారు. శుక్రవారం కామారెడ్డిలో వారికి సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10వ పిఆర్‌సి ప్రకారం కనీస వేతనం, ఐచ్చిక సెలవుల పెంపు, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరించాలని ...

Read More »