Breaking News

Daily Archives: October 4, 2016

ఘనంగా బతుకమ్మ సంబరాలు

  బీర్కూర్‌, అక్టోబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎపిఎం గంగాధర్‌ ఆధ్వర్యంలో ఇందిరా క్రాంతిపథం మహిళలు ఉదయం నుంచే బతుకమ్మను వివిధ పూలతో అందంగా ముస్తాబుచేశారు. పట్టు చీరలు ధరించి స్థానిక జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలలో బతుకమ్మలు ఆడి పాడారు. అనంతరం స్థానిక బాజన్‌ చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా బీర్కూర్‌ మార్కట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రపంచంలో పూలతో ...

Read More »

కామారెడ్డిలో ఒకరికి డెంగ్యూ

  కామారెడ్డి, అక్టోబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంటలో నివసిస్తున్న అరవింద్‌ (11) అనే బాలుడికి డెంగ్యూ వ్యాధి సోకినట్లు వార్డు కౌన్సిలర్‌ పద్మ రాంకుమార్‌గౌడ్‌ తెలిపారు. గతంలో సైతం బాలుడికి డెంగ్యూ వ్యాధి సోకగా ఆయన కుటుంబం వేల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. ప్రస్తుతం సైతం డబ్బు ఖర్చుపెట్టి చికిత్సలు చేయిస్తున్నట్టు తెలిపారు. వైద్యాధికారులు డెంగ్యూ నివారణకు చర్యలు చేపట్టాలని, అరవింద్‌కు చికిత్సలు అందించాలని కోరారు. బల్దియా సిబ్బంది సైతం పారిశుద్యంపై ప్రత్యేక దృష్టి ...

Read More »

కళాశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

  కామారెడ్డి, అక్టోబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని వివిధ కళాశాలల్లో బతుకమ్మ పండగ సంబరాలను విద్యార్థులు, అధ్యాపకులు కలిసి ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం పట్టణంలోని శిశుమందిర్‌ పాఠశాలతో పాటు పలు కళాశాలలు, పాఠశాలల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. రంగు రంగుల పూలతో అందంగా ముస్తాబు చేసిన బతుకమ్మలను విద్యార్తులు చేతబట్టి బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ వేడుకలు జరుపుకున్నారు. పట్టణంలో సైతం బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళలు వివిధ ఆలయాల వద్దకు చేరుకొని బతుకమ్మ ఆటలు ...

Read More »

రాకపోకలు బంద్‌

  నిజాంసాగర్‌, అక్టోబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నాగమడుగులోకి నీరు వచ్చి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత పదిరోజులుగా నీటి విడుదల కొనసాగడంతో ప్రజలు నిజాంసాగర్‌, అచ్చంపేట మీదుగా నిజాంపేట్‌, నారాయణఖేడ్‌, సంగారెడ్డి, హైదరాబాద్‌ వెళ్లేందుకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ప్రాజెక్టు దిగువ భాగంలోగల సింగూరు జలాశయంలోకి 33 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని డిఇలు తెలిపారు. నిజాంసాగర్‌ నుంచి అచ్చంపేట వెళ్లే రహదారికి అంతరాయం కలగడంతో ప్రజలు ఆవేదన ...

Read More »

పర్యాటకుల సందడితో నిజాంసాగర్‌

  నిజాంసాగర్‌, అక్టోబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాగర్‌ వద్ద 16 గేట్ల వద్ద నీటివిడుదల కొనసాగుతుండడంతో భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. అలాగే హైదరాబాద్‌, మహరాష్ట్ర, కర్ణాటక, మెదక్‌, సంగారెడ్డి, తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు రావడంతో ప్రాజెక్టు వద్ద సందడి నెలకొంది. అలాగే 16, 12 గేట్లను చూస్తూ ఆనందంగా గడుపుతూ, విందు భోజనాలు చేస్తూ సందడి చేస్తున్నారు.

Read More »

సాగర్‌ 16 గేట్లు ఎత్తివేత

  నిజాంసాగర్‌, అక్టోబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోకి 90 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని ప్రాజెక్టు డిఇ సురేశ్‌బాబు తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి మెదక్‌, సింగూరు, పోచారం, హల్దివాగు తదితర ప్రాంతాల నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వరదవచ్చి చేరుతుంది. కాగా 16 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు 12, 16 గేట్లనుంచి మొత్తం 16 గేట్లను ఎత్తివేయడంతో ...

Read More »

ఇళ్లు కూలిపోయాయని 258 మంది దరఖాస్తులు

  నిజాంసాగర్‌, అక్టోబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్ళు కూలిపోయాయని 258 మంది బాధితులు దరఖాస్తులు చేసుకున్నారని డిప్యూటి తహసీల్దార్‌ సయ్యద్‌ అహ్మద్‌ మస్రూద్‌ అన్నారు. వీటిలో 133 మంది ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయని, వీటికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించిన నివేదికలు జిల్లా కలెక్టర్‌కు పంపించడం జరుగుతుందన్నారు. కూలిపోయిన బాధితులకు ప్రభుత్వం చేత నష్టపరిహారం అందేలా చర్యలు ...

Read More »

బతుకమ్మ పండగ కోసం గునుగపువ్వు సేకరణ

  నిజాంసాగర్‌, అక్టోబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దసరా పండగకు ముందు వచ్చే బతుకమ్మ పండగ వేడుకల కోసం మహిళలు గునుక పువ్వు సేకరణలో నిమగ్నమయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండగ సంబరాలను ఆడపడుచులు ఘనంగా జరుపుకోవడం కోసం ముందుగా గునుక పువ్వు, తంగేడు పువ్వులను సేకరించి సిద్దం చేసుకుంటున్నారు. బతుకమ్మను పేర్చడంలో మహిళలు పోటీపడుతున్నారు. ఇందుకోసం ఇప్పటినుంచే పువ్వు సేకరణలో నిమగ్నమయ్యారు.

Read More »

మునిసిపాలిటీలలో నాటిన మొక్కలకు ట్రీ గార్డులకై రూ. 27 లక్షలు కావాలి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, అక్టోబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు హరితహారం కింద జిల్లాలోని మునిసిపాలిటీలలో రోడ్ల పక్కన నాటిన 34 వేల మొక్కలకు ట్రీ గార్డుల ఏర్పాటుకై రూ. 27 లక్షల నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా కోరారు. హరితహారం అమలుపై మంగళవారం అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్‌.మీనా, అటవీశాఖ పిసిసిఎఫ్‌ పి.కె. జా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్పరెన్సులో జిల్లా కలెక్టర్‌ ...

Read More »

మూడు గ్రామాల్లో గ్రామసభలు

  రెంజల్‌, అక్టోబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మూడు గ్రామాల్లో మంగళవారం గ్రామ సభలు నిర్వహించారు. రెంజల్‌, నీలా, కూనేపల్లి గ్రామాల సర్పంచ్‌లు చందూరు సవిత, బండారు పోశెట్టి, లక్ష్మణ్‌ల అధ్యక్షతన సభలు జరిగాయి. స్థానికంగా పారిశుద్య సమస్యలను ప్రజలు సభదృష్టికి తెచ్చారు. గ్రామంలో మురికికాలువలు, రోడ్ల వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని ఇందిరమ్మ కాలనీ వాసులు అధికారుల దృష్టికి తెచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, కూలిపోయిన నివాసపు ఇళ్ల విషయం ఏమిటని బాధితులు ...

Read More »

ఎన్‌ఎస్‌ఎఫ్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలి

  రెంజల్‌, అక్టోబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని అఖిల భారత రైతుకూలీసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగుమ్ముల గంగాధర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిలో రైతుల రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేసి నూతన రుణాలు అందించాలని గంగాధర్‌ కోరారు. ఉపాధి హామీ కూలీలకు వెంటనే డబ్బులు చెల్లించాలన్నారు. అలాగే దళితులకు మూడెకరాల భూమితోపాటు కార్పొరేషన్‌రుణాలు అందించాలని కోరారు. నష్టపోయిన సోయా పంటకు ...

Read More »

రైతాంగాన్ని ఆదుకోవాలి

  రెంజల్‌, అక్టోబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల తహసీల్‌ కార్యాలయం ముందు మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ మండల యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల కురిసిన బారీ వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం అందజేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. వర్షం తాకిడికి నేలమట్టమైన పేదల ఇళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అధికారులు పంట నష్టంపై సమగ్ర సర్వే చేపట్టి ప్రభుత్వానికి ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

  బీర్కూర్‌, అక్టోబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి సంబంధిత వ్యాధులు గలవారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. మోతిబిందు గలవారికి బోదన్‌, నిజామాబాద్‌ ఆసుపత్రులకు రిఫర్‌చేశారు. ప్రతి మంగళవారం మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని మండల వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read More »