Breaking News

Daily Archives: October 9, 2016

దేవసేన దుర్గామండలి వద్ద అన్నదానం

  కామారెడ్డి, అక్టోబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని దేవసేన దుర్గామండలి ఆధ్వర్యంలో మండపం వద్ద ఆదివారం అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదానంచేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మండలి ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ వెంకట్‌, నాయకులు జమునా రాథోడ్‌, ప్రతినిధులు మోహన్‌, ఐలయ్య, రాజేశ్వర్‌రావు, శ్రీనివాస్‌, శివకుమార్‌, రాజు, జనార్దన్‌, భాస్కర్‌, నరేందర్‌, మహేశ్‌ ...

Read More »

మెహెర్‌బాబా భక్తుల అన్నదానం

  కామారెడ్డి, అక్టోబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సుభాష్‌ విగ్రహం వద్ద ఆదివారం అవతార్‌ మెహెర్‌బాబా భక్త మండలి ఆద్వర్యంలో ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బాబా భక్తులు ప్రతి రెండవ ఆదివారం ప్రజలకు అన్నదానంచేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం అన్నదానం చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో భక్తమండలి ప్రతినిధులు రాజేశం, రమేశ్‌, లక్ష్మిపతి, శ్రీనివాస్‌, గంగాధర్‌, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా సద్దుల బతుకమ్మ

  బీర్కూర్‌, అక్టోబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సద్దుల బతుకమ్మను గ్రామంలోని ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే మహిళలు వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన పువ్వులతో బతుకమ్మను పేర్చి అందంగా ముస్తాబుచేశారు. అనంతరం గ్రామాల ప్రధాన వీధుల గుండా కూడళ్ల వద్ద ఆట, పాటలు ఆడారు. రెవెన్యూ అదికారుల ఆద్వర్యంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల ఊర చెరువుల్లో నిమజ్జనం ...

Read More »

బతుకమ్మ పోయిరావమ్మా…సల్లంగ దీవించమ్మా….

  కామారెడ్డి, అక్టోబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఎనిమిదిరోజుల పాటు మహిళలు భక్తిశ్రద్దలతో వైభవంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలతో ముగిశాయి. ఆదివారం వేలాదిగా తరలివచ్చిన మహిళలు ప్రకృతి సిద్దంగా లభించినగునుగ, తంగేడు పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి వివిధ ఆలయాలకు, ప్రధాన కూడళ్లకు తరలించి బతుకమ్మలను ఒకచోట చేర్చి చుట్టు తిరుగుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పోయిరావమ్మా బతుకమ్మ…. మమ్ములను సల్లంగ దీవించమ్మా అంటూ ...

Read More »

సోమవారం హనుమాన్‌ భవాని కమిటీ ఆద్వర్యంలో అమ్మవారి పడిపూజ

  బీర్కూర్‌, అక్టోబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ హనుమాన్‌ భవాని కమిటీ ఆధ్వర్యంలో సోమవారం శేషు జోషి వేద పండితుల ఆద్వర్యంలో పడిపూజ నిర్వహించనున్నట్టు అధ్యక్షుడు అవారి గంగారాం తెలిపారు. రత్నకంటి ప్రకాశ్‌ గురుస్వామి ఆధ్వర్యంలో మాల స్వాములచే దూప, దీప, నైవేద్యాల సమర్పణ ఉంటుందని, పంచామృతాభిషేకం నిర్వహించనున్నట్టు వారు తెలిపారు. గ్రామస్తులు, పరిసర గ్రామాల ప్రజలు అదిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Read More »

అయిలాపూర్‌లో బతుకమ్మ సంబరాలు

  నందిపేట, అక్టోబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ఆద్వర్యంలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలు మండలంలోని అయిలాపూర్‌ గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల స్తాయిలో నాలుగురోజుల నుంచి జరుగుతున్న సంబరాలు ముగిశాయి. అందమైన పూలతో పేర్చిన బతుకమ్మలను నెత్తినెత్తుకొని వాడవాడలా బతుకమ్మలు ఆడుతూ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పిటిసి డాంగే స్వాతి, ఎంపిపి యమున, సర్పంచ్‌ మీసాల సుదర్శన్‌, సొసైటీ ఛైర్మన్‌ లక్ష్మినారాయణ, తెలంగాణ జాగృతి మండల అధ్యక్షుడు రాంరెడ్డి, మహిళలు, అధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ...

Read More »

విఠలేశ్వరాలయంలో రుద్రాభిషేకం

  బీర్కూర్‌, అక్టోబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలోగల పురాతన ఆలయమైన విఠలేశ్వరాలయంలో సార్వజనిక్‌ భవాని కమిటీ ఆద్వర్యంలో శనివారం రాత్రి భవానిమాత శాకాంబరీ దర్శనం తర్వాత అర్చకులు నాని అప్పాగారి ఆద్వర్యంలో చండీ యాగం, రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. గురుస్వాములు శివకుమార్‌ ఆధ్వర్యంలో మాలధారులు, స్వాములు చండీయాగంలో పాల్గొన్నారు. అమ్మవారికి దూప, దీప, కర్పూర, పంచామృతంతో అభిషేకం గావించి నైవేద్యం సమర్పించారు. ఆదివారం ఉదయం మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గత ఐదేళ్ళుగా సరస్వతి ...

Read More »

దుర్గామాతకు ప్రత్యేక పూజలు

  నిజాంసాగర్‌, అక్టోబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని మాజీ జడ్పిటిసి సభ్యులు వినయ్‌ కుమార్‌ ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత వద్ద అన్నదాన కార్యక్రమంలో వారు భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అలాగే మండలంలోని మహ్మద్‌నగర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గా మండపం వద్ద ఎమ్మెల్యే, జడ్పి ఛైర్మన్‌ హాజరయ్యారు. వారి ...

Read More »

విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి

  నిజాంసాగర్‌, అక్టోబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో ఆదివారం వ్యవసాయ పొలంలో విద్యుత్‌ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. నిజాంసాగర్‌ ఎస్‌ఐ అంతిరెడ్డి కథనం ప్రకారం.. హసన్‌పల్లి గ్రామానికి చెందిన సాలె సాయిలు (35) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన సాలె బాలమణి వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకొని పంట సాగుచేస్తున్నాడు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా తంగేడు పువ్వు కోసం గ్రామ శివారులోనికి వెళ్లి తంగేడు ...

Read More »

కొనసాగుతున్న జిల్లాస్థాయి వాలీబాల్‌ క్రీడలు

  కామారెడ్డి, అక్టోబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో నిర్వహిస్తున్న రెండవ తెలంగాణ యూత్‌ ఇంటర్‌ డిస్ట్రిక్‌ వాలీబాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు కొనసాగుతున్నాయి. పోటీల్లో జిల్లా నుంచి వివిధ పాఠశాలల నుంచి వచ్చిన జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. విజేతలుగా నిలిచిన వారికి త్వరలో బహుమతులు అందజేయనున్నారు. బాలురు, బాలికల జట్లు వేరువేరు విభాగాల్లో తలపడుతున్నాయి. ఆటలు తిలకిచేందుకు క్రీడాభిమానులు భారీగా తరలివస్తున్నారు.

Read More »

మాందాపూర్‌ దోమకొండలో కొనసాగించాలి

  కామారెడ్డి, అక్టోబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండలంలోని మాందాపూర్‌ గ్రామాన్ని ఇటీవల జరిగిన జిల్లాల పునర్‌విభజనలో భాగంగా భిక్కనూరులో చేర్చడాన్ని నిరసిస్తూ మాందాపూర్‌ గ్రామ జేఏసి నాయకులు శనివారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమకొండలో మాందాపూర్‌ గ్రామం తరాలుగా ఉందన్నారు. పునర్‌ విబజనలో భాగంగా దాన్ని మరో మండలంలో చేర్చడం సమంజసం కాదన్నారు. ఏరకంగా చూసినా తమకు దోమకొండ ...

Read More »

ఘనంగా బతుకమ్మ సంబరాలు

  కామారెడ్డి, అక్టోబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం మహిళలు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బంగారు బతుకమ్మ వేడుకల్లో భాగంగా ప్రభుత్వం, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పట్టణంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకొని వచ్చి బతుకమ్మలను ఒకచోట చేర్చి చుట్టు తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన నీటి తొట్టెలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రతినిదులు, అధికారులు ...

Read More »