Breaking News

Daily Archives: October 10, 2016

8 గేట్ల ద్వారా నీటి విడుదల

  నిజాంసాగర్‌, అక్టోబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో నీటి విడుదల కొనసాగుతుంది. సెప్టెంబరు 24వ తేదీ నుంచి ప్రాజెక్టులోకి భారీ స్థాయిలో వరదనీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతం నుంచి సింగూరు ప్రాజెక్టు, పోచారం, హల్దివాగు ద్వారా భారీగా వరదనీరు రావడంతో నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు నీటిమట్టం 1405 అడుగులు కాగా, జలాశయంలోకి 1404 అడుగులతో జలకళ సంతరించుకుంది. వరదనీటిని పూర్తిగా దిగువ మంజీర ద్వారా ...

Read More »

పర్యాటకుల సందడి

  నిజాంసాగర్‌, అక్టోబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మూడేళ్లుగా నిజాంసాగర్‌ ప్రాజెక్టులో నీరులేక పర్యాటకులు ప్రాజెక్టును మరిచిపోయారు. ఊహించని పరిణామంలో సెప్టెంబరు మూడో వారంలో ప్రాజెక్టు ఎగువ భాగంలో కురిసిన భారీ వర్షం వల్ల మూడురోజుల్లో ప్రాజెక్టునిండిపోయి వరదగేట్లు ఎత్తివేయడంతో ప్రాజెక్టు వద్ద మళ్లీ పర్యాటకుల సందడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి ప్రాజెక్టును చూసేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దాదాపు 10 వేల మంది పర్యాటకులు రావడంతో సందడి నెలకొంది. ...

Read More »

ఘనంగా దుర్గా హోమం

  కామారెడ్డి, అక్టోబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డ పట్టణంలోని గంజ్‌ ప్రాంతంలో పట్టణస్వర్ణకారసంఘం దేవీ మండపం వద్ద సోమవారం దుర్గాహోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. దంపతులు హోమంలో పాల్గొన్నారు. 10వ రోజున అమ్మవారు మహిషాసుర మర్థినిగా దర్శనమిచ్చారు. కార్యక్రమంలో స్వర్ణకార సంఘం ప్రతినిధులు బ్రహ్మం, ఎర్ర శ్రీనివాస్‌, మర్కంటి శ్రీనివాస్‌, డి.బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.

Read More »

వైభవంగా చండీ యాగం

  కామారెడ్డి, అక్టోబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హిందూ సేవ దుర్గాసేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం వైభవంగా చండీహోమం నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని దుర్గామాత మండపం వద్ద చండీ హోమం జరిపారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య హోమం జరిగింది. అమ్మవారు మహిషాసుర మర్ధిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో సేవాసమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More »

దుర్గామాత వద్ద అన్నదానం

  కామారెడ్డి, అక్టోబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం దుర్గామాత మండపాల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద బజార్‌ ఆజాద్‌హింద్‌ దుర్గా యువసేన ఆధ్వర్యంలో, అశోక్‌నగర్‌ ఫ్రెండ్స్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆద్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో బక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమంలో ఆయా మండపాల నిర్వాహకులు కుంబాల రవియాదవ్‌, నిట్టు కృష్ణమోహన్‌, ఆనంద్‌, అనిల్‌, రాజేశ్‌, వినయ్‌, శివాజీరావు, రాజేందర్‌, స్వామి, సత్యనారాయణ, అంజి, మహేశ్‌రెడ్డి, గంగాధర్‌, శంకర్‌, శ్రీనివాస్‌, ...

Read More »

కొత్త జిల్లా అధికారులు వీరే…

  కామారెడ్డి, అక్టోబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నూతన జిల్లాగా ఏర్పడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను ప్రభుత్వం ప్రకటించింది. వీటికి సంబందించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మౌఖిక ఆదేశాలిచ్చారు. మంగళవారం ఉదయం 11.13 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు కొత్త కలెక్టర్లు, ఎస్పీలు జిల్లా ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొంటారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా సత్యనారాయణ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. జిల్లా ఎస్పీగా జోయెల్‌ డెవీస్‌ను నియమించినట్టు సమాచారం. వీరు మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

Read More »

మంగళవారం కామారెడ్డి జిల్లాకు శ్రీకారం

  కామారెడ్డి, అక్టోబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దసరా నుంచి కామారెడ్డి కొత్త జిల్లాగా ఆవిర్భవించనుంది. ఇప్పటివరకు నియోజకవర్గ కేంద్రంగా, నిజామాబాద్‌ జిల్లాలో అనుబంధంగా ఉన్న కామారెడ్డి స్వతంత్ర జిల్లాగా మారింది. ప్రభుత్వం ప్రకటించిన 21 కొత్త జిల్లాల్లో కామారెడ్డికి చోటుదక్కింది. మంగళవారం దసర పర్వదినం సందర్బంగా నూతన జిల్లాలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మంత్రులు, ప్రభుత్వ ప్రతినిదులు, అధికారులు జిల్లా ఏర్పాటులో నిమగ్నమయ్యారు. పట్టణ శివారులోని పలు కార్యాలయాల్లో ఈపాటికే జిల్లా కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయంతో పాటు ...

Read More »

బీర్కూర్‌ హనుమాన్‌ ఆలయంలో రుద్రాభిషేకం

  బీర్కూర్‌, అక్టోబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని గాంధీచౌక్‌లోగల హనుమాన్‌ ఆలయంలో హనుమాన్‌ దుర్గా భవాని కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మహా రుద్రాభిషేకం వేద పండితులు శేషు జోషి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి రత్నకంటి ప్రకాశ్‌ ఆధ్వర్యంలో మాలధార స్వాములచే ధూప, దీప, నైవేద్య, తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతంతో అభిషేకం చేసి గ్రామంలోని భక్తులకు పంచిపెట్టారు. బుధవారం అమ్మవారి శోభాయాత్ర ఉంటుందని గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ...

Read More »

గోదావరి పరవళ్ళు…

  నందిపేట, అక్టోబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీ వరదనీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు అధికారులు 12 గేట్లు వదిలి దిగువకు వదులుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాతోపాటు మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల భారీగా వరద నీరు వస్తుందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం వరకు 60 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. దీంతో 12 గేట్లు ఎత్తివేసి దిగువకు వదులుతున్నట్టు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా 1090.31 అడుగుల నీటి మట్టం ఉందన్నారు. ...

Read More »