Breaking News

Daily Archives: October 14, 2016

పిఆర్‌టియు అడ్‌హక్‌ కమిటీ ఎన్నిక

  కామారెడ్డి, అక్టోబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాకు పిఆర్‌టియు అడ్‌హక్‌ కమిటీలో స్థానం కల్పించారు. అడ్‌హక్‌ కమిటీ జిల్లా అధ్యక్షునిగా దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అల్లాపూర్‌ కుషాల్‌లను ఎన్నుకున్నారు. ఈ నియామక పత్రాలను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శంకర్‌, కమలాకర్‌రావులు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. కార్యక్రమంలో పిఆర్‌టియు రాష్ట్ర నాయకులు మదుసూదన్‌రెడ్డి, పోశన్న, భాస్కర్‌రావు, రాజులు, పురుషోత్తం శర్మ, శివరంజని, శ్రీనివాస్‌చారి, సురేశ్‌, సంతోష్‌, సంగారెడ్డి, ...

Read More »

కెసిఆర్‌ చిత్రానికి పాలాభిషేకం

  కామారెడ్డి, అక్టోబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాను ఏర్పాటు చేసిన నేపథ్యంలో తెరాస పట్టణ బిసి సెల్‌ ఆద్వర్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ చిత్రపటాలకు పాలతోఅభిషేకం చేశారు. ఈసందర్భంగా బిసి సెల్‌ ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్‌, పట్టణ మైనార్టీ ఆధ్వర్యంలో షౌకత్‌అలీఖాన్‌ మాట్లాడుతూ కామారెడ్డి ప్రజల చిరకాల వాంచ అయిన జిల్లా ఏర్పాటును గుర్తించి ముఖ్యమంత్రి, స్తానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌లు జిల్లాను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇందుకు సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ...

Read More »

మహాజన పాదయాత్రకు ప్రజాసంఘాల మద్దతు

  కామారెడ్డి, అక్టోబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర సమగ్రఅభివృద్ది సాదనకు సిపిఐ (ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాజన పాదయాత్రకు వివిధ ప్రజాసంఘాలు తమ మద్దతు ప్రకటించాయి. వ్యవసాయ కార్మిక సంఘం ఆద్వర్యంలో కామారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రజా సంఘాల ప్రతినిదులు పాల్గొని పాదయాత్రకు తమసంఘీభావం తెలిపారు. ఈనెల 17వ తేదీ నుంచి 2017 మార్చి 12 వరకు నిర్వహించనున్న తెలంగాణ మహాజన పాదయాత్రకు అన్నివర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు. సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి ...

Read More »

భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు సన్మానం

  కామారెడ్డి, అక్టోబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణను శుక్రవారం భారత్‌స్వాభిమాన్‌ ట్రస్టుయోగా సభ్యులు సన్మానించారు. కలెక్టర్‌కు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. కామారెడ్డి జిల్లా ప్రగతికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో యోగా ప్రతినిదులు గడ్డం రాంరెడ్డి, గరిపల్లి అంజయ్య, ఈశ్వర్‌, లక్ష్మిపతి యాదవ్‌, సిద్దాగౌడ్‌, ఎల్లంకి సుదర్శన్‌, సురేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ట్రస్మా ఆధ్వర్యంలో జిల్లాకలెక్టర్‌కు సన్మానం

  కామారెడ్డి, అక్టోబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం (ట్రస్మా) ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణతో పాటు డిఇవో మదన్‌మోహన్‌, జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్యలను సన్మానించారు. ఈ సందర్భంగా ట్రస్మా ప్రతినిదులు మాట్లాడుతూ కామారెడ్డి నూతన జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో వచ్చిన అధికారులను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు, శాలువాలతో సన్మానించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్మా అధ్యక్షుడు ఆనంద్‌రావు, ఉపాధ్యక్షుడు రమేశ్‌, ప్రతినిదులు రాజశేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌, కృష్ణమూర్తి, హన్మంత్‌రావు, గోవర్ధన్‌రెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు.

Read More »

షబ్బీర్‌ అలీకి సోదర వియోగం

  కామారెడ్డి, అక్టోబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ అన్న మహ్మద్‌ జైన్‌లాబుద్దీన్‌ (68) శుక్రవారం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం మృతదేహాన్ని కామారెడ్డికి తీసుకొచ్చి ఇక్కడే అంత్యక్రియలు చేశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జైన్‌లాబుద్దీన్‌ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన్ను స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి, జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే గంగారాంలతో పాటు పలువురు నాయకులు అంత్యక్రియల్లో పాల్గొని పరామర్శించారు. రాష్ట్ర గవర్నర్‌ నర్సింహన్‌తోపాటు ...

Read More »