Breaking News

Daily Archives: October 21, 2016

200 కి.మీ. చేరిన అయ్యప్పల పాదయాత్ర

  కామారెడ్డి, అక్టోబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అయ్యప్ప దీక్షాపరులు చేపట్టిన మహాపాదయాత్ర శుక్రవారం నాటికి 200 కి.మీ. చేరింది. శుక్రవారం వారు కొత్తూరుకు చేరుకున్నారు. కామారెడ్డి నుంచి శబరిమలై వరకు అయ్యప్పదీక్షా పరులు మహాపాదయాత్రగా తరలివెళ్లారు. అయ్యప్పస్వామిని నెలకొల్పిన ప్రత్యేక రథాన్ని వారి వెంట తీసుకెళుతున్నారు. అందులో ప్రతినిత్యం పూజలు చేస్తు దీక్ష చేపడుతున్నారు. కొత్తూరులోని అయ్యప్ప ఆలయంలో స్వామివారికి పూజలు చేసి భిక్ష చేసినట్టు స్వాములు ఉదయ్‌, రమేశ్‌, వేణుగోపాల్‌,బాలు, రాజేందర్‌, రాకేశ్‌ స్వాములు తెలిపారు.

Read More »

మొట్టమొదటి విద్యుదుత్పాదన కేంద్రం కామారెడ్డి జిల్లాలోనే

  నిజాంసాగర్‌, అక్టోబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొట్టమొదటి జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోనే ఉంది. నిజాంసాగర్‌ మండలం హసన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని హెడ్స్‌లూస్‌ గ్రామంలో నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు అనుసంధానంగా 1954లో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. మూడు టర్బయిన్‌ల ద్వారా 15 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగేలా దీన్ని నిర్మించారు. నిజాంసాగర్‌ నీటిని ఆయకట్టుకు, ప్రధానకాలువ ద్వారా విడుదల చేసే నీటితో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుంటారు. ఒక్కో టర్బయిన్‌ ద్వారా ...

Read More »

పోలీసు అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ ర్యాలీ

  కామారెడ్డి, అక్టోబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని కామారెడ్డి ఆర్‌.కె.డిగ్రీ, పిజి కళాశాలల విద్యార్థులు శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ జైపాల్‌రెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ సంతోష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

జిల్లా విద్యాధికారికి సన్మానం

  కామారెడ్డి, అక్టోబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా విద్యాధికారి మదన్‌మోహన్‌కు శుక్రవారం తపస్‌ ప్రతినిధులు సన్మానించారు. డిఇవోను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కారానికి, విద్యా బలోపేతానికి కృషి చేయాలన్నారు. డిఇవో స్పందిస్తూ విద్యారంగ సమస్యల పరిస్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో రమేశ్‌గౌడ్‌, రాఘవరెడ్డి, లక్ష్మణ్‌రావు, నాగరాజు, రాంచంద్రం, లక్ష్మిపతి, అనిల్‌, శివరాజు, రాజశేఖర్‌, వెంకట్‌రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

  కామారెడ్డి, అక్టోబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని టిఎస్‌యుటిఎఫ్‌ ప్రతినిధులు శుక్రవారం కామారెడ్డి జిల్లా డిఇఓ మదన్‌మోహన్‌రావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004 సెప్టెంబరు నుంచి నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు పరిచి పాత పెన్షన్‌ విధానాన్నే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. టిఎస్‌యుటిఎఫ్‌ ఆద్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ...

Read More »

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

  కామారెడ్డి, అక్టోబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం తెలంగాణా రాష్ట్ర పోలీసు అభిమాన సంఘం ఆద్వర్యంలో కామారెడ్డి ప్రబుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కామారెడ్డి పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథిగా హాజరై రోగులకు అరటి, సేపు పండ్లను అందజేశారు. పోలీసు అమరవీరులను స్మరిస్తూ వారి పేరిట పోలీసు అభిమాన సంఘం ప్రతినిదులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు శోభన్‌, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు వినోద్‌, ...

Read More »

బ్యాంకు రుణాలు సక్రమంగా చెల్లించాలి

  భీమ్‌గల్‌, అక్టోబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాబాపూర్‌ గ్రామ సంఘం పరిధిలో బ్యాంకు నుండి తీసుకున్న రుణాలు నెలనెల చెల్లించి వడ్డిలేని రుణం పొందాలని ఐకెపి, టి సెర్ప్‌ అధికారి బి.శ్రీనివాస్‌, బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌ సతీష్‌రెడ్డి, సర్పంచ్‌ పాతెరు అప్సర్‌ సూచించారు. ఈ సందర్భంగా గ్రామ సంఘం సభ్యులు, ఐకెపి, ఎస్‌బిహెచ్‌ అధికారులు బాబాపూర్‌ బాబాపూర్‌ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ బ్యాంకు రుణాలు సక్రమంగా చెల్లించాలని తద్వారా ప్రభుత్వం ఇచ్చే స్త్రీనిది రుణాలు, బ్యాంకు రుణాలు వడ్డి ...

Read More »

జిల్లా కలెక్టర్‌కు ముస్లిం మతపెద్దల వినతి

  – పట్టణంలో భారీ ర్యాలీ కామారెడ్డి, అక్టోబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ముస్లిం మతపెద్దలు, మైనార్టీ నాయకులు శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకొని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీయే ప్రబుత్వం మైనార్టీల హక్కుల విషయంలో జోక్యం చేసుకోవడం తగదన్నారు. అనాదిగా వస్తున్న తలాక్‌ ఆచారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించడమేంటని అన్నారు. మైనార్టీల ఆచారాలు, కట్టుబాట్లు తరతరాలుగా వస్తున్నాయని వాటిని మార్చాలని కేంద్రప్రభుత్వం ...

Read More »

ప్రమాదపు అంచుల్లో చిన్న పూల్‌

  నిజాంకాలం నాటి వంతెన శిథిలావస్థకు చేరుకుంటుంది. మరమ్మతులకు నోచుకోని వంతెన నిజాంసాగర్‌, అక్టోబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్ల నుంచి విడుదల చేసిన నీటి ప్రవాహానికి మండల కేంద్రంలోని చిన్న పూల్‌ వంతెన ప్రస్తుతం ప్రమాదపు అంచుకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉండడంతో నిత్యం వంతెనమీదుగా ప్రయాణించే వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. 1932-35 కాలంనాటి నిజాంప్రభువు ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత మంజీరా ప్రాంతంలో ...

Read More »

మహ్మద్‌నగర్‌ను మండలం చేయాలి

  నిజాంసాగర్‌, అక్టోబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిన్నటివరకు దశాబ్దాలుగా ఉన్న జుక్కల్‌ నియోజకవర్గంలో మహ్మద్‌నగర్‌ను మండలం చేయాలనే డిమాండ్‌ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. మహ్మద్‌నగర్‌ను మండలం చేయాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. పాలనా సౌకర్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లు, మండలాలు చేయడం జరిగిందన్నారు. సింగీతం, గాలిపూర్‌, బూర్గుల్‌, గున్కుల్‌, నర్వా, హసన్‌పల్లి గ్రామాలకు అనుగుణంగా ఉన్న మహ్మద్‌నగర్‌ను మండలం చేయాలన్నారు. ఈ విషయమై సిఎంకు, మంత్రికి విన్నవించినట్టు తెలిపారు. సింగీతం ఎంపిటిసి ...

Read More »

24న ఇంటర్‌ కాలేజ్‌ క్రాస్‌ కంట్రీ 12 కి.మీ. మెన్‌ చాంపియన్‌షిప్‌-2016

  డిచ్‌పల్లి, అక్టోబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 24న ఇంటర్‌ కాలేజ్‌ క్రాస్‌ కంట్రీ 12 కి.మీ. మెన్‌ చాంపియన్‌షిప్‌-2016 నిర్వహిస్తున్నట్టు స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ సెక్రెటరీ డాక్టర్‌ ఎం.డి.జమీల్‌ అహ్మద్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ బి.ఆర్‌.నేత తెలిపారు. చాంపియన్‌షిప్‌ తెలంగాణ యూనివర్సిటీ కళాశాలలు, అపిలియేటెడ్‌ డిగ్రీ, పిజి చదువుతున్న విద్యార్థులకు యూనివర్సిటీ గ్రౌండ్‌లో నిర్వహించబడుతుందని చెప్పారు. ముఖ్య అతిథిగా వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య, రిజిస్ట్రార్‌ ఆచార్య జయప్రకాశ్‌రావు, కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కనకయ్య పాల్గొంటారని తెలిపారు. పాల్గొనే అభ్యర్థులు ...

Read More »

ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

  బీర్కూర్‌, అక్టోబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో ఎస్‌ఐ రాజ్‌భరత్‌ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో గ్రామ ప్రధాన వీధుల గుండా పోలీసు అమరవీరులకు జోహార్లు అని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక జడ్పిహెచ్‌ఎస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌ఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో అవిచ్చిన్నకర శక్తులతో పోరాటాల్లో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు కొనియాడారు. చట్టం ...

Read More »

ప్రజావాణికి అధికారులు హాజరుకావాలి

  నందిపేట, అక్టోబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట తహసీల్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో మండల స్థాయి అధికారులందరు తప్పక హాజరుకావాలని తహసీల్దార్‌ ఉమాకాంత్‌ సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కొరకు ప్రజావాణికి వచ్చినపుడు సంబంధిత శాఖల మండల అధికారులు అందుబాటులో లేనపుడు ప్రజల సమస్యలు కావన్నారు. కావున అధికారులందరు హాజరుకావాలని పేర్కొన్నారు. ప్రజావాణి సమస్యల నమోదు కోసం రిజిష్టర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తద్వారా వచ్చిన వినతులు, సమస్యలు పరిష్కారం అయిన వివరాలు ...

Read More »