Breaking News

జాతీయ సమగ్ర క్యాంప్‌లో తెయు విద్యార్థుల ప్రతిభ

 

డిచ్‌పల్లి, అక్టోబరు 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ యూనివర్సిటీలో జరిగిన 7 రోజుల జాతీయ సమైక్యత సమగ్రత శిబిరంలో తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు ప్రత్యేక ప్రతిభచూపి ప్రథమ బహుమతి పొందారు. అక్టోబరు 15 నుండి 21 వరకు శిబిరం జరిగింది. కళా, సాంస్కృతిక ప్రదర్శనలో తెయు విద్యార్థులు బతుకమ్మ ఆట, పాటలతో హోరెత్తించారు. వారి కళా ప్రదర్శన జాతీయసమగ్రత క్యాంప్‌లో హైలెట్‌గా నిలిచింది. మొత్తం 10 రాష్ట్రాల నుంచి 187 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు పాల్గొన్న ఈ శిబిరంలో తెలంగాణ రాష్ట్రం నుండి మొత్తం 20 మంది అందులో నలుగురు తెలంగాణ యూనివర్సిటీ ప్రతినిధులుగా పాల్గొన్నారు. కాంజింజెంట్‌ టీం లీడర్‌గా ప్రోగ్రాం ఆఫీసర్‌ ఎం.సునీత వ్యవహరించారు. టీం వాలంటీర్లు శనివారం విసి ప్రొఫెసర్‌ సాంబయ్యను కలిశారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ జాతీయ సమగ్రత శిబిరంలో తెయు విద్యార్థులు ప్రతిభ చాటడం బతుకమ్మకు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడం అభినందనీయమన్నారు. బతుకమ్మ, పోతురాజు, ఇతర తెలంగాణ జానపద గేయాలు ఇతర రాష్ట్రాల వాలంటీర్లను ఎంతగానో ఆకట్టుకోవడం వీరి ప్రతిభకు నిదర్శనమన్నారు. శిబిరంలో స్రవంతి, శ్రీలత, ప్రశాంత్‌, సందీప్‌, టీం లీడర్‌ సునీత పాల్గొన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సి.హెచ్‌.ఆర్తి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ ప్రవీణాబాయి, డాక్టర్‌ లావణ్యలను విసి అభినందించారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *