శాస్త్రసాంకేతికరంగాల నూతన ఆవిష్కరణలతో మానవుడు రోజురోజుకూ తన సహజత్వాన్ని కోల్పొతున్నాడు. గర్భనిరోధానికి ఆడవారు, మగవారూ పడేపాట్లకు శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఓ టాబ్లెట్ కొంత ఉపశమనాన్ని కలిగించనుంది.
మగవారి శరీరంలో శుక్రకణాల చలనాన్ని (కదిలికను) కొంతకాలంపాటు నిస్సత్తువుగా ఉంచే ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. కొత్తగా తయారు చేసిన ఈ కాంపౌండ్‌కి ‘సెల్-పెనెట్రెటింగ్ పెప్టైడ్’గా పేరు పెట్టారు. కొత్తగా రూపొందించిన ఈ టాబ్లెట్లతో గర్భాన్నినిరోధించడంలో ఆడవారికి మగవారు సహకరించవచ్చు. ఈఆవిష్కరణతో మానవజీవితంలో అనూహ్యమైన మార్పులు రావడం ఖాయమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇంతకాలం గర్భాన్ని నిరోధించడానికి కేవలం ఆడవారు మాత్రమే కొన్ని రకాల టాబ్లెట్లను ఉపయోగిస్తూ వచ్చారు. దీంతో ఆడవారికి టాబ్లెట్ల బాధలు తీరినట్లేనని శాస్త్రవేత్తలు తేల్చేశారు. ఓల్వర్హంప్టన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫేసర్ జాన్ హాల్ మాట్లాడుతూ టాబ్లెట్లు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయని తెలిపారు. అంతేకాదు శుక్రకణా ఉత్పత్తి కావాలనుకుంటే కొన్ని నిమిషాలలోనే ఉత్పత్తి జరిగేలా పనిచేసే టాబ్లెట్ తయారుచేశామని తెలిపారు.
ఈ టాబ్లెట్లకు సంబంధించిన మరికొన్ని విశేషాలు…
- సెక్స్‌లో పాల్గొవడానికి కొన్ని నిమిషాలు, లేదా గంటలు మగవారు ఈ టాబ్లెట్స్ తీసుకోవాలి.
- గర్భనిరోధక టాబ్లెట్స్ ఇకపై మహిళలు వాడాల్సిన అవసరం ఏమాత్రం లేదు.
- కండోమ్స్ ఉపయోగించడం ఇబ్బందికరంగా భావిస్తున్న వారికి టాబ్లెట్స్ మంచి పరిష్కారమార్గం.
The following two tabs change content below.

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018