Breaking News

క్లిక్‌ చేసే ముందు ఒక్క నిమిషం..

ఒకప్పటిలా మోసం చేయడానికి పరిచయం అక్కర్లేదు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌ వంటివి వచ్చిన తరువాత.. మోసాలు చేసేవాళ్లు ఎక్కడుంటారో మనకు తెలియదు. పొరపాటున వాళ్ల వలలో చిక్కామంటే మోసపోవడం ఖాయం. నెటిజన్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఓ యువకుడు వీడియో తీసి వాట్సప్‌ ద్వారా అందరికీ షేర్‌ చేస్తున్నాడు. అందులోని సలహాలే ఇవి.
వాట్స్‌పలో ఇలాంటి వీడియోలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. అలాంటి వాటిలో ఒకటి – ‘‘ఈ పాప గుండె జబ్బుతో బాధపడుతోంది. ఈ వీడియో లేదా ఫోటో మీరు ఓ పదిమందికి పంపినట్లయితే.. ఒక్కొక్కరి నుంచి రూపాయి చొప్పున పాప అకౌంట్‌లో పడుతుంది. దయచేసి ఈ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసి అమ్మాయి ప్రాణాలు కాపాడండి’’ అని ఉంటుంది. ఇది పూర్తిగా అబద్ధపు మెసేజ్‌. ఇలా మెసేజ్‌లను ఫార్వర్డ్‌ చేస్తే వాట్సప్‌ కానీ, ఏ ఇతర బ్యాంకులు కానీ మన అకౌంట్‌ నుంచి వాళ్ల అకౌంట్‌కు డబ్బులు పంపించవు. ఇవన్నీ ఒట్టి మాటలు. కొందరు ఇతరుల మీద కోపం ఉన్నప్పుడు అలాంటి వాళ్ల ఫోటోలు పెట్టి పరువు తీస్తుంటారని తెలుసుకోండి.

మరికొన్ని మెసేజ్‌లను ఫార్వర్డ్‌ కొడితే – ప్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్ల నుంచి డిస్కౌంట్లు, కూపన్లు వంటివి వస్తాయన్న ప్రచారమూ జరుగుతోంది. కొన్ని మెసేజ్‌లను క్లిక్‌ చేస్తే ఫాం వస్తుంది. దాని తరువాత ఒక వీల్‌ వస్తుంది. ఆ వీల్‌ తిప్పినప్పుడు అది ఎక్కడ ఆగితే అందులో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువును గెలుచుకుంటారని ప్రదర్శిస్తుంటారు. అది పూర్తిగా తప్పుడు మెసేజ్‌.

ఫేస్‌బుక్‌లో అప్పుడప్పుడు అడల్ట్‌పిక్చర్స్‌ వస్తుంటాయి. దాన్ని క్లిక్‌ చేస్తే మరో పేజీ వస్తుంది. మీకు తెలియకుండానే మీ ఎఫ్‌బి అకౌంట్‌లోని ఫ్రెండ్స్‌ మొత్తానికి ఈ వీడియోలింక్‌ వెళ్లిపోతుంది. ‘అదేంటి? ఇలాంటి బూతు పిక్చర్లను పంపిస్తున్నాడు వీడు’ అంటూ అవతలి వాళ్లు అనుకుంటారు. మీకు తెలియకుండానే మీ చేజేతులా మీ పరువు మీరే పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఫేస్‌బుక్‌లో వస్తున్న ఇలాంటి బూతు చిత్రాలను పొరపాటున కూడా మీరు క్లిక్‌ చేయవద్దు. అడల్ట్‌ కంటెంట్‌ పట్ల జాగ్రత్తగా ఉండండి.
కొందరు ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి.. అందులో బోలెడన్ని మొబైల్‌ఫోన్ల చిత్రాలు ప్రదర్శిస్తారు. ఆ పేజ్‌ని ఎంత మందికి షేర్‌ చేస్తే ఆ సంఖ్యను బట్టి మీకు ఖరీదైన మొబైల్‌ను ఇంటికి పంపిస్తామని చెబుతుంటారు. ఉత్తినే ఎవరికీ ఇలాంటి ఫోన్లు పంపరని గుర్తుపెట్టుకోండి. అవన్నీ అబద్ధాలు. వాళ్ల పేజీకి లైక్స్‌ రావడం కోసం ఇలాంటి ఫేక్‌ మెసేజ్‌లను పంపిస్తుంటారు. అందులోను లైకర్స్‌ బాగా పెరిగిపోయి.. ఫాలోవర్స్‌ సంఖ్య ఎక్కువైన తరువాత … ఆ పేజీని ఇతరులకు అమ్మేస్తుంటారు. కొనేవాళ్లు కూడా ఫాలోవర్స్‌, లైక్స్‌ను బట్టి క్రేజీ కోసం, వస్తువుల ప్రచారం కోసం ఇటువంటి పేజీలను కొనేస్తుంటారు.

ఈమెయిల్స్‌ విషయానికి వస్తే – ఫలానాబ్యాంకు మీకు క్రెడిట్‌కార్డు ఇస్తుందంటూ ఒక ఫాం పూర్తి చేయమని వస్తుంటుంది. ఏ బ్యాంకు అలాంటి మెసేజ్‌లను పంపి అకౌంట్‌ హోల్డర్ల డిటైల్స్‌ను అడగదు. మీరు ఒక వేళ పొరపాటున దరఖాస్తులో బ్యాంకు వివరాలు రాసి ఆన్‌లైన్‌లో పంపితే.. మీ అకౌంట్‌ హ్యాక్‌కు గురవుతుంది. ఒకవేళ మీకు అలాంటి మెసేజ్‌లు వస్తే.. నేరుగా బ్యాంకును సంప్రదించండి.

మీ క్రెడిట్‌కార్డు లిమిట్‌ పెంచుతున్నాము అంటూ బ్యాంకు నుంచి మెసేజ్‌లు వచ్చినట్లు వస్తుంటాయి. దాన్ని నమ్మిన కొందరు వినియోగదారులు తమ బ్యాంకు అకౌంట్‌ సమాచారం పంపించేస్తున్నారు. అలా చేస్తే మీ అకౌంట్‌ వాళ్ల చేతుల్లోకి వెళ్లినట్లే. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఈ మెయిల్స్‌లలో ఇటువంటి ఫేక్‌ మెసేజ్‌లను ఎంత మాత్రం విశ్వసించకండి. మెసేజ్‌లు, ఈ మెయిల్స్‌ వచ్చినప్పుడు తొందరపడకండి. ప్రతి విషయాన్ని విచక్షణతో ఆలోచించండి

Check Also

రైతును రాజు చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీసన్‌లో వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *