Breaking News

Daily Archives: November 1, 2016

నేడు టిపిసిసి అధ్యక్షుని రాక

  కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో నిర్వహించనున్న రైతు రుణమాఫీపై సమావేశానికి టిపిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్‌ రెడ్డి రానున్నట్టు పార్టీ నాయకులు కైలాష్‌ శ్రీనివాస్‌రావు, లక్కపత్రి గంగాధర్‌లు తెలిపారు. శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆద్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని సత్యగార్డెన్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఉదయం 10.30 గంటలకు రైతు రుణమాఫీపై సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనికి శాసన సభ్యుల ప్రతిపక్షనేత జానారెడ్డితోపాటు ఇతర రాష్ట్ర నాయకులు, పార్టీ ...

Read More »

రిజర్వేషన్లు పెంచితే సహించేది లేదు

  కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచితే సహించేది లేదని ఓసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్‌రెడ్డి అన్నారు. కామారెడ్డలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఓట్లు, అధికారం కోసమే బిసి, ముస్లింలను మభ్యపెట్టడానికి రిజర్వేషన్ల అంశాన్ని ప్రబుత్వం తెరపైకి తెచ్చిందన్నారు. 9వ షెడ్యూల్‌లోకి చేర్చిన అంశం ప్రశ్నించే అధికారం ఉందని న్యాయస్థానం చెప్పినా తెరాస ప్రభుత్వం ఓటు బ్యాంకు ...

Read More »

వృద్దులకు పండ్ల పంపిణీ

  కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంటు సభ్యుడు బి.బి.పాటిల్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కామారెడ్డి వృద్దాశ్రమంలో వృద్దులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెరాస నాయకులు చాట్ల రాజేశ్వర్‌, రమేశ్‌ గుప్తలు మాట్లాడుతూ ఎంపి బి.బి.పాటిల్‌ జన్మదినం సందర్భంగా వృద్దాశ్రమంలో వృద్దులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశామన్నారు. ఎంపి నూతన జిల్లాను మరింత అభివృద్ది చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పంతులు శ్రీనివాస్‌, వెంకట రత్నం, పద్మ చంద్రశేఖర్‌, తదితరులున్నారు.

Read More »

జిల్లా కలెక్టర్‌ను సన్మానించిన రెవెన్యూ అసోసియేషన్‌ ప్రతినిదులు

  కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ ప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణను కలిసి సన్మానించారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు మోతిసింగ్‌ ఆద్వర్యంలో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పరీక్ష ప్యాడ్‌లను కలెక్టర్‌కు అందజేశారు. జిల్లా నూతన కార్యవర్గం గురించి కలెక్టర్‌కు తెలిపారు.ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచిపేరు తేవాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిదులు శ్రీనివాస్‌, బాల్‌రాజు, బాసిద్‌, కిష్టయ్య, ప్రతాప్‌రెడ్డి, వెంకట్రావు, ...

Read More »

రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచాలి

  -కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రబీ పంట కాలానికి సంబంధించి సబ్సిడీ విత్తనాలను రైతులకు సరిపడా అందుబాటులో ఉంచాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌ బవనంలో వ్యవసాయాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 17 వేల 435 హెక్టార్లలో మొక్కజొన్న సాగుచేయనుండగా ఇందుకు 3 వేల 480 క్వింటాల్ల విత్తనాలు అవసరముంటాయన్నారు. ఇప్పటికే 2 వేల క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలు అందుబాటులో ...

Read More »

ఆక్రమణలపై బల్దియా అధికారుల కొరడా

  కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆక్రమణలపై బల్దియా అధికారులు ఎట్టకేలకు కొరడా ఝళిపించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లను ఆక్రమిస్తూ నిర్మించిన నిర్మాణాలపై చర్యలకు ఉపక్రమించారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్‌ వద్ద మురికి కాలువలు ఆక్రమిస్తూ నిర్మించిన కట్టడాలను పట్టణ ప్రణాళిక అధికారులు గుర్తించి వాటిని జేసిబి సహాయంతో తొలగించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ఆక్రమణలను ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆక్రమణలు స్వచ్చందంగా తొలగించుకోవాలని లేనిపక్షంలో కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ...

Read More »

డిఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఐజి

  కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిఎస్పీ కార్యాలయాన్ని మంగళవారం ఐజి నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డిఎస్పీ కార్యాలయానికి వెళ్లి కేసులకు సంబందించిన రికార్డులను పరిశీలించారు. కామారెడ్డి జిల్లా పరిధిలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని కేసులు పరిష్కారం లబించాయి, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి తదితర అంశాలపై ఆరాతీశారు. పోలీసులు ప్రజలతో మమేకమై పనిచేయాలని పోలీసులకు సూచించారు. ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ ముందుకు సాగాలని ...

Read More »

రైలుకింద పడి యువకుని మృతి

  కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిక్కనూరు మండలం బిక్కనూరు రైల్వేస్టేషన్‌ వద్ద మంగళవారం రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. బిక్కనూరు మండలం కాచాపూర్‌ గ్రామానికి చెందిన పరశురాములు రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియలేదని, కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు వివరించారు.

Read More »

నిజాంసాగర్‌కు ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నడిపించాలి

  నిజాంసాగర్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రం నుంచి నూతన జిల్లా కామారెడ్డికి ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నడపాలని మండల ప్రజలు కోరుతున్నారు. కామారెడ్డి నుంచి నిజాంసాగర్‌కు ఆర్డీనరి బస్సులే నడుస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బస్సులు నడుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే కామారెడ్డి డిపో ఏర్పాటు చేశారు. అప్పటినుంచి నిజాంసాగర్‌కు బస్సు సర్వీసులు కొనసాగుతున్నాయి. నాటి నుంచి నేటి దాకా ఆర్డీనరి బస్సులు తప్ప ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నడపడం లేదు. కామారెడ్డి ...

Read More »

ప్రయాణ ప్రాంగణంలో వసతులు కల్పించాలి

  నిజాంసాగర్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రయాణ ప్రాంగణంలో సమస్యలు ప్రయాణీకులకు ఇబ్బందులు పెడుతున్నాయి. తాగునీరు, విద్యుత్‌ దీపాలు, ప్రయాణీకులకు కుర్చీలు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినిత్యం రద్దీగా ఉండే ప్రయాణ ప్రాంగణానికి వందలాది బస్సులు వస్తు, పోతుంటాయి. కనీసం మరుగుదొడ్ల నిర్వహణ కూడా సక్రమంగా లేకపోవడంతో దుర్వాసన వెలువడుతుంది. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించి ప్రయాణీకులకు వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Read More »

ఇసుక తీసేవిధానంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇసుక అందజేసే విధానంలో సంబంధిత రెవెన్యూ డివిజనల్‌ అధికారులు కచ్చితంగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. మంగళవారం కలెక్టర్‌ చాంబరులో స్యాండ్‌ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మండలవారిగా విద్యాశాఖలకు, సంక్షేమ శాఖలకు చెందిన ప్రభుత్వ పనుల నిమిత్తం కావల్సిన ఇసుక వివరాలను అందించాలని వాటర్‌ గ్రిడ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ వారిగా సమీక్షిస్తూ, శాఖల ...

Read More »

విత్తనాల కోసం రైతు ఎదురుచూపు

  బాన్సువాడ, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగట్లో అన్నీ ఉన్నా… అల్లుడినోట్లో శని అన్న చందంగా మారింది రైతుల పరిస్థితి. నీటి వనరుల్లో పుష్కలంగా నీరున్నా బోరుబావుల్లో నీరు ఎగిసి పడుతున్నా రైతులు సాగుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నీటి కొరత లేకున్నప్పటికి రబీ సాగు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఆశించిన స్థాయిలో సాగు ముందుకు సాగడం లేదు. ఓవైపు విత్తనాల కొరత రైతులను వేధిస్తోంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా ...

Read More »

2017-18 హరితహారానికి పూర్వసన్నద్దం కావాలి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా ఎక్సైజ్‌ శాఖ ద్వారా ఏర్పాటు చేసే మొక్కలను ఒక మాడల్‌గా తయారుచేసి తెలంగాణ రాష్ట్ర జిల్లాలు నిజామాబాదు జిల్లాపై దృష్టి సారించేలా ఉండాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా సూచించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో నీటి పారుదల శాఖాధికారులతో, ఎక్సైజ్‌ శాఖాధికారులతో తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్సైజ్‌శాఖ ద్వారా 2016-17 సంవత్సరానికి, 2017-18 సంవత్సరానికి గాను ...

Read More »

డబుల్‌ బెడ్‌రూం శిలాఫలకానికి క్షీరాభిషేకం

  రెంజల్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని డబుల్‌బెడ్‌ రూం పనుల శంకుస్తాపన శిలాఫలకానికి మంగళవారం తెరాస నాయకులు పాలాభిషేకం చేశారు. మండల జడ్పిటిసి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు సోమవారం డబుల్‌ బెడ్‌ రూం పనులకు శంకుస్థాపన చేసి ఏడాది పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడాన్ని నిరసిస్తూ పిండప్రదానం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండించిన తెరాస నాయకులు అదే శిలాఫలకం వద్దకు చేరుకొని పాలతో కడిగారు. జడ్పిటిసి నాగభూషణంరెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి ...

Read More »

మోర్తాడ్‌ నుంచి మునిపల్లికి పరుగెత్తిన గూడ్సు రైలు

  మోర్తాడ్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్దపల్లి- నిజామాబాద్‌ రైల్వే లైన్‌ నిర్మాణంలో భాగంగా మంగళవారం పెద్దపల్లి నుంచి గూడ్సు రైలు మధ్యాహ్నం 4 గంటలకు మోర్తాడ్‌ కు చేరుకుంది. మోర్తాడ్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న గూడ్సు రైలును తిలకించేందుకు విద్యార్థులు, గ్రామస్తులు ఉత్సాహపడ్డారు. మోర్తాడ్‌ నుంచి మునిపల్లి వరకు గూడ్సు రైలు వెళ్ళింది. ఇందులో రైలు పట్టాల నిర్మాణాలకు సంబంధించిన యంత్రపరికరాలు తరలిస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు.

Read More »

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

  రెంజల్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం తాడ్‌బిలోలి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం… ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన రేవంత్‌ దీపావళి పండగకు తాడ్‌బిలోలిలోని అమ్మమ్మ ఇంటికివచ్చారు. సోమవారం రాత్రి రేవంత్‌ తన స్నేహితుడు శేఖర్‌తో కలిసి ద్విచక్రవాహనంపై ఫకీరాబాద్‌వైపు వెళ్తుండగా సబ్‌స్టేషన్‌ ప్రాంతంలో తాడ్‌బిలోలికి చెందిన అరుణ్‌రెడ్డి రోడ్డుపక్కన మూత్ర విసర్జన చేస్తుండగా ద్విచక్ర వాహనం ఆయన్ను ఢీకొంది. దీంతో వాహనచోదకుడు ...

Read More »

రైతుల, మహిళల, సొసైటీల అభివృద్దే తెరాస లక్ష్యం

  మోర్తాడ్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల, మహిళల, సొసైటీల అభివృద్దే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని మోర్తాడ్‌ సొసైటీ ఛైర్మన్‌ ఎలాల రాజేందర్‌ అన్నారు. మంగళవారం మోర్తాడ్‌లోని సంతలోగల మండపం వద్ద సొసైటీ ఛైర్మన్‌ రాజేందర్‌రెడ్డి వరికొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఒడ్యాట్‌ గ్రామంలో ఐకెపి ఆద్వర్యంలో సర్పంచ్‌ నాగం పోశన్న, ఎంపిపి కల్లడ చిన్నయ్యలు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సుంకెట్‌లో రామన్నపేట్‌ సొసైటీ ఛైర్మన్‌ పిప్పెర లింబాద్రి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ...

Read More »

కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సంయుక్త కలెక్టర్‌

  నందిపేట, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం అయిలాపూర్‌ గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ దళారుల వ్యవస్థ తొలగించడం కోసం ప్రభుత్వం నేరుగా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తుందన్నారు. ఇందుకు మద్దతు దరగా క్వింటాలుకు రూ. 1510 చెల్లిస్తుందన్నారు. జిల్లా మొత్తం 173 కొనుగోలు కేంద్రాలు లక్ష్యం కాగా ...

Read More »

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరగాలి

  – డాక్టర్‌ నస్రీన్‌ ఫాతిమా రెంజల్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే గర్భిణీ స్త్రీల ప్రసవాలు జరగాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి నస్రీన్‌ ఫాతిమా తెలిపారు. మంగళవారం ఆసుపత్రిలో ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడి, ఆశ వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గర్భిణీలు ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే విధంగా చూడాల్సిన బాధ్యత ఎఎన్‌ఎం, అంగన్‌వాడి కార్యకర్తలపై వుందన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా అందించే ఒక పూట భోజనం అంగన్‌వాడి కేంద్రాల్లోనే ...

Read More »

అర్జంట్‌గా వెళ్లాల్సి వస్తోందా?

మూత్రవిసర్జనను కొంత సమయం వరకు అపుకోవచ్చు. కానీ కొందరిలో మాత్రం అత్యవసరంగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రివేళ ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు యూరిన్‌ బ్లాడర్‌ ఓవర్‌ యాక్టివ్‌నెస్‌ కారణమని అంటున్నారు వైద్యులు. వయసు పైబడిన వారు ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడాన్ని చూస్తుంటాం. సాధారణంగా బ్లాడర్‌ ఫుల్‌ అయినా మూత్రాన్ని ఆపుకునే శక్తి ఉంటుంది. కానీ బ్లాడర్‌ ఓవర్‌ యాక్టివ్‌నెస్‌ సమస్య ఉన్న వారు ఏ మాత్రం ఆపుకోలేకపోతారు. బ్లాడర్‌ కొద్దిగా నిండగానే అత్యవసరంగా వెళ్లాల్సి వస్తుంది. ...

Read More »