Breaking News

న్యాయ విద్యార్థుల ఇంటింటి సర్వే

 

డిచ్‌పల్లి, నవంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ న్యాయ కళాశాల విద్యార్థులు ఈనెల 2,3 తేదీల్లో సమాజంలోని న్యాయ సమస్యలను గుర్తించి పరిశీలించడానికి నడిపల్లి, సుద్దపల్లి తాండా, గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సర్వే చేసినట్టు న్యాయ విభాగం ఆచార్యులు తెలిపారు. సర్వేను న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ జట్లింగ్‌ ఎల్లోసా ప్రారంభించి మాట్లాడారు. న్యాయ విద్యార్థులకు సమాజంలోని సమస్యలే పెద్ద క్లాస్‌ రూం అని ఈ సర్వే ద్వారా గిరిజన తాండాల్లోగల సమస్యలు తలెత్తడానికి గల కారణాలు, వాటి నివారణ, ప్రభుత్వ పరమైన చట్టాలు, జివోలు రూపొందించడానికి ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. సర్వేలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ శోభారాణి, డాక్టర్‌ ప్రసన్నరాణి, న్యాయ కళాశాల విద్యార్థులు శేకర్‌, సుస్మిత, కృష్ణకాంత్‌, విశాలక్ష్మి, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *