Breaking News

రైతుల్ని విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

డిచ్‌పల్లి:

కొత్త రుణాలు ఇవ్వకుండా, పాత బకాయిలకు వడ్డీ మీద వడ్డీ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరిస్తోందని భాజపా రాష్ట్ర కార్యదర్శి మురళీగౌడ్‌ అన్నారు. డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లిలో గురువారం భాజపా మండల కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. పార్టీ పటిష్ఠతకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణకు కేంద్రం రూ.38 వేల కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇప్పటికీ పెట్టుబడి రాయితీ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు కేపీ రెడ్డి, నాయకులు ముత్యంరెడ్డి, లక్ష్మణ్‌, జీవన్‌రెడ్డి, సర్ధార్‌, దరిసింగ్‌, వెంకట్‌రెడ్డి, భూపతిరెడ్డి, మహేందర్‌, ఆనంద్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద అన్నదానం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెల్ప్‌ టు అదర్స్‌ సంస్థ ఆద్వర్యంలో ఇందల్వాయి టోల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *