Breaking News

Daily Archives: November 5, 2016

విద్యార్థులకు వితరణ

  కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం ఉప్పలవాయి జడ్పిహెచ్‌ఎస్‌ విద్యార్థులకు కామారెడ్డి లయన్స్‌క్లబ్‌, రోటరీ క్లబ్‌ ఆద్వర్యంలో పలు వితరణలు చేశారు. వాసవి క్లబ్‌ అధ్యక్షుడు మహేశ్‌గుప్త వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు 66 వేల విలువగల ప్రొజెక్టర్‌ను అందజేశారు. మండలంలో 10వ తరగతిలో ప్రతిబ కనబరిచిన విద్యార్థులకు వెయ్యి రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు అందజేశారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిదులు కైలాష్‌ శ్రీనివాస్‌రావు, కాంశెట్టి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రైతుల భూములు అభివృద్ది చేయాలి

  నిజాంసాగర్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లోని రైతుల భూములను అభివృద్ది చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపివో సుదర్శన్‌ అన్నారు. ఉపాది హామీ శిక్షణ తరగతులు శనివారం నిర్వహించారు. ఎపిఎం మాట్లాడుతూ 2016-17 ఆర్థికసంవత్సరానికి గాను ఉపాధి హామీ పనులకు సంబంధించిన సూచనలు గ్రామస్తులకు అర్థమయ్యేలా సూచించారు. ఈనెలాఖరులోగా పనులను గుర్తించి రైతుల, ప్రభుత్వ భూముల్లో పనులు చేపట్టాలని ఎపివో అన్నారు. సేంద్రీయ ఎరువులతో తయారయ్యే ఎరువులను పంటపొలాలలో వాడితే రైతులు అధిక దిగుబడులు ...

Read More »

మరమ్మతుకు నోచుకోని నాగమడుగు

  నిజాంసాగర్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌-అచ్చంపేట రహదారిలోగల నాగమడుగు లోలెవల్‌ వంతెన వరదనీటికి సిసి రోడ్డు కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయంలోకి సెప్టెంబరు నెలాఖరులో కురిసిన భారీ వర్షాలకు భారీగా వరదనీరు రావడంతో వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడంతో నాగమడుగు లోలెవల్‌ వంతెన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి గుంతల మయంగా మారి ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్లు అక్టోబరు 13న నీటిపారుదల ...

Read More »

లారీ బోల్తా – డ్రైవర్‌కు గాయాలు

  నిజాంసాగర్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌- నర్సింగ్‌రావుపల్లి రహదారిపై ఒడ్డేపల్లి శివారులోగల దర్గా సమీపంలో శుక్రవారం రాత్రి లారీ బోల్తాపడిన సంఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి మద్యప్రదేశ్‌ వైపు ప్రయాణిస్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. నిజాంసాగర్‌-నర్సింగ్‌రావుపల్లి రహదారి విస్తరణ పనులు 8 నెలలుగా నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం మొరం పనులు చేస్తున్నారు. అదే ప్రాంతంలో గురువారం కూడా లారీ బోల్తాపడింది. రహదారులు గుంతల మయంగా మారడంతో లారీలు బోల్తాపడి ప్రమాదాలు జరుగుతున్నాయి.

Read More »

ఆటో, బస్సు ఢీ – పలువురికి గాయాలు

  కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామ శివారులో శనివారం ఆర్టీసి బస్సు – ఆటో ఢీకొన్న సంఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసి బస్సు, ఆటో ను ఢీకొనడంతో ఆటో బోల్తాపడింది. దీంతోఆటోలోని ప్రయాణీకులు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు రూరల్‌ పోలీసులు తెలిపారు.

Read More »

మోడి, కెసిఆర్‌లు ద్వంద్వవైఖరి మానుకోవాలి

  సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ ప్రధాని మోడి, ముఖ్యమంత్రి కెసిఆర్‌లు అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరి మానుకోవాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన సిపిఐ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బిజెపి అధికారంలోకి రాగానే మత చాందస వాదాన్ని పెంపొందిస్తు దళితులపైన, మైనార్టీలపైన దాడులు చేస్తుందన్నారు. రాష్ట్రంలో కెసిఆర్‌ దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ...

Read More »

టిడిపి సభ్యత్వ నమోదు ప్రారంభం

  కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.డి.ఉస్మాన్‌, పట్టణ అధ్యక్షుడు నజీరుద్దీన్‌, జిల్లా ఉపాధ్యక్షుడు చీల ప్రభాకర్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలు రూ. 100 చెల్లించి సభ్యత్వ నమోదు చేయించుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల కార్యకర్తలు సభ్యత్వం తీసుకోవాలని నాయకులు కోరారు. సభ్యత్వం తీసుకున్న అందరికి రూ. 2 లక్షల భీమా వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు షేర్లరాములు, రాజమౌళి, మాణిక్యరెడ్డి, ...

Read More »

ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలకు సిబిసిఎస్‌ విధానం

  – విసి ప్రొఫెసర్‌ సాంబయ్య డిచ్‌పల్లి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నత విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలు ఏర్పరచడానికి ఛాయిస్‌ బేస్‌డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ తోడ్పడుతుందని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య అన్నారు. సంప్రదాయవిద్యా విధానంలో దిగజారుతున్న విలువల కట్టడికి, విద్యార్థులను అన్ని రంగాల్లో సుశిక్షితులను చేయడానికి ఈ సిబిసిఎస్‌ పద్ధతి ఉపయుక్తమవుతుందని ఆయన తెలిపారు. ‘చాయిస్‌ బేస్‌డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ – పద్ధతులు, మూల్యాంకనం’ అనే అంశంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆర్తిక సహకారంతో ఒకరోజు ...

Read More »

పోలీసుల నిర్లక్ష్యంతో దొంగ పరారీ

  – విమర్శలకు తావిచ్చిన పోలీసుల నిర్వాకం కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు అధికారుల నిర్లక్ష్యంతో ఓ దొంగ ఏకంగా పోలీసు స్టేషన్‌ నుంచే పారిపోయిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీసుస్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల ధోరణి, పనితీరు మరోసారి తేటతెల్లమైంది. వివరాల్లోకి వెళితే దొంగతనం విసయంలో విచారణ కోసం నిజామాబాద్‌ జిల్లా నాగారం కు చెందిన షేక్‌ రంజాన్‌ అనే పాత నేరస్తున్ని కామారెడ్డి పోలీసుస్టేషన్‌కు శుక్రవారం తీసుకొచ్చారు. కాళ్లకు బేడీలు వేసి ...

Read More »

పంటలు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరుగాలం కష్టపడి వివిద రకాల పంటలు పండించిన రైతు శ్రమను చేతులు మార్చి కమీషన్‌ ఏజెంట్లు కూర్చున్న చోటే లక్షాధికారులు అవుతున్న తీరు అమానుషమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. అహర్నిశలు ఎండనక, వాననక కష్టించే రైతులు ప్రకృతి వైపరీత్యాలతో పాటు మద్య దళారుల ...

Read More »

రుణం పొందని రైతులకు అందించాలి

  మోర్తాడ్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లోగల బ్యాంకుల్లో, సహకార బ్యాంకుల్లో ఇప్పటివరకు రుణాలు పొందని రైతులను గుర్తించి పంట రుణాలు అందించాలని వ్యవసాయాధికారి లావణ్య, గిర్దావరి మంజులారాణిలు అన్నారు. శనివారం తహసీల్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు క్లస్టర్‌ కో ఆర్డినేటర్ల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండల ఐకెపి సిసిలు, మండల విఆర్వోలు, గ్రామాల్లోని రుణాలు పొందని రైతులను, రుణాలు పొందని కౌలు రైతులను గుర్తించి వారికి రుణాలు అందించాలని సూచించారు. డిసెంబరు ...

Read More »

నీళ్లున్నాయి… పంటలకు ఢోకా లేదు…

  నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌లోని తక్కువ నీటితో ఎక్కువ పంట పండించి జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల రైతాంగానికి మాసంగి పంట వేసుకోవడానికి ఆటా ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయడానికై సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిజాంసాగర్‌లో 17.8 టిఎంసిల నీరు ...

Read More »

మహిళలు ఆదిశక్తిగా రాణించాలి

  మోర్తాడ్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో సమస్యలు సహజమేనని, సమస్యలకు ఎదురొడ్డి ఆదిశక్తిగా రాణించాలని పాలెం సర్పంచ్‌ తోగేటి అనితా శ్రీనివాస్‌, ఎంపిటిసి ఎనుగందుల అశోక్‌, మాజీ జడ్పిటిసి శారద, మాజీ సర్పంచ్‌లు జగడం పల్లి గణేస్‌, బావన్నలు అన్నారు. శనివారం మండలంలోని పాలెం గ్రామంలో పలిగిరి బాలహంస రెండవ వర్ధంతిని దళితులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆమె చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అతిచిన్న ...

Read More »

7న తిరునక్షత్రం

  – 108 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయి మోర్తాడ్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 7వ తేదీన సోమవారం కలియుగ దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవెంకటేశ్వర స్వామివారి తిరునక్షత్రం, జన్మదినం, శ్రవణ నక్షత్రం జరుగుతుందని ఆలయ పూజారి దంపూరి ప్రవీణాచారి శనివారం తెలిపారు. భక్తులు ఆలయం చుట్టు 108 ప్రదక్షిణలు చేస్తే కోరిలు నెరవేరుతాయని అన్నారు. భక్తులు మనసులో కోరుకొని సోమవారం ఉదయం 5.15 గంటలకు ఆలయ ప్రదక్షినలు చేయాలన్నారు. అభిషేకం జరుగుతుందని, ఇట్టి అవకాశాన్ని భక్తులు ...

Read More »

మత్య్స సంపద అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం

  బీర్కూర్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్స్య సంపదను పెంచి గంగపుత్రులను అభివృద్ది దిశలో నడిపించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కుమారుడు పోచారం సురేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని బాజాన్‌ చెరువులో శనివారం చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో 6 లక్షల వ్యయంతో చేప పిల్లలను కొనుగోలుచేసి హాజీపూర్‌, దుర్కి, మిర్జాపూర్‌, బీర్కూర్‌ మండలంలో కిష్టాపూర్‌ పెద్ద చెరువు, అంకుశ్‌ చెరువులో చేప పిల్లలు వదిలినట్టు ఆయన ...

Read More »

చుక్కాపూర్‌ ఆలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్‌

  కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ అటవీ ప్రాంతంలోని లక్ష్మినర్సింహస్వామి ఆలయాన్ని శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కుటుంబసమేతంగా సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ది కోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. అర్చకులు కలెక్టర్‌కు శాలువాతో సన్మానించారు. ఆలయ ఇవో ప్రభు వెంట ఉన్నారు.

Read More »

భవన నిర్మాణ కార్మికులకు బోర్డు పెన్షన్‌ను అమలు చేయాలి

  కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం భవన నిర్మాణ రంగంలోని కార్మికులకు వెల్పేర్‌ బోర్డులో జమ ఉన్న 900 కోట్ల నుంచి 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు 3 వేల చొప్పున పింఛన్‌ అమలు చేయాలని బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అద్యక్షుడు ఎం.డి. షకీల్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతనంగా ఏర్పడ్డ కామారెడ్డి జిల్లాలో లక్షకుపైగా కార్మికులు ఉన్నారన్నారు. సంక్షేమ బోర్డు నిదులు ఖర్చు చేసేందుకు చనిపోయిన ...

Read More »

మృతుని కుటుంబానికి న్యాయం చేయాలి

  కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం గుండారం గ్రామం లేత్యామామిడి తాండాలో గురువారం రాత్రి విద్యుత్‌ ఘాతంతో మృతి చెందిన గుగులోత్‌ దూప్‌సింగ్‌ కుటుంబానికి న్యాయం చేయాలని శుక్రవారం ఎల్‌హెచ్‌పిఎస్‌, గిరిజన సంఘాల ఆద్వర్యంలో కామారెడ్డి ఏరియా ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుడు దూప్‌సింగ్‌కు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారన్నారు. రాత్రి సమయంలో విద్యుత్‌ లేకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకెళ్లి సరిచేస్తుండగా విద్యుత్‌ఘాతంతో మృతి చెందాడన్నారు. గతంలో సైతం ...

Read More »

ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌

  కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్తులు శుక్రవారం స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కళాశాల చుట్టు పేరుకుపోయిన చెత్త, పిచ్చిమొక్కలను తొలగించారు. కార్యక్రమంలో కళాశాల సిఇవో హరిస్మరణ్‌రెడ్డి, డైరెక్టర్‌ బాలాజీరావు, అడ్మినిస్ట్రేటివ్‌ ప్రిన్సిపాల్‌ సాయిబాబు, ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

బోరుమోటారు ప్రారంభం

  కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 20వ వార్డు ఇస్లాంపురలో శుక్రవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరిసుష్మ బోరుమోటారును ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు లక్ష రూపాయలతో బోరుమోటారు బిగించినట్టు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ అంజద్‌, ప్రతినిధులు మసూద్‌, హైమద్‌, హైమద్‌ జాని, గులాం అహ్మద్‌, ఇమామ్‌, అబీద్‌ అలీ, జమీల్‌, గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »