Breaking News

Daily Archives: November 6, 2016

అభివృద్ద నేతలకు పాలాభిషేకం

  మోర్తాడ్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తున్న సిఎం కెసిఆర్‌, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు ఆదివారం పాలాభిషేకం చేశారు. రామన్నపేట్‌ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఎమ్మెల్యే అభివృద్ది పరుస్తున్నారని అంతేకాకుండా వేల్పూర్‌, రామన్నపేట్‌ మధ్యగల పెదవాగుపై వంతెనతోపాటు చెక్‌డ్యాం నిర్మాణానికి నిదులు మంజూరుచేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఈర్ల లక్ష్మి, ఉపసర్పంచ్‌ ...

Read More »

సోమవారం నుంచి డిజిటల్‌ తరగతుల శిక్షణ

  మోర్తాడ్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని చేపూర్‌ జాతీయ రహదారి పక్కనగల క్షత్రియ ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం నుంచి 11వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాద్యాయులకు 10వ తరగతి సబ్జెక్టులు బోదిస్తున్న ఉపాధ్యాయులకు డిజిటల్‌ తరగతులపై శిక్షణ ఇస్తున్నట్టు మోర్తాడ్‌ ఎంఇవో రాజేశ్వర్‌ తెలిపారు. 10 తరగతి సబ్జెక్టుల ఉపాధ్యాయులు శిక్షణకు సకాలంలో హాజరుకావాలని సూచించారు. సోమవారం గణితం, 8వ తేదీన సైన్స్‌, 9వ తేదీన సోషల్‌, 10వ తేదీన ఇంగ్లీష్‌, 11వ తేదీన ...

Read More »

నేడు ప్రజావాణి

  బీర్కూర్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తహసీల్దార్‌ క్రిష్ణనాయక్‌ తెలిపారు. మండలంలో ప్రభుత్వ రంగ సమస్యలు నెలకొన్న లబ్దిదారులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని, సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతామని ఆయన అన్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోనే కాకుండా మండల తహసీల్‌ కార్యాలయంలో ప్రజావాణి ఉంటుందని ఆయన సూచించారు. దీన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Read More »

గ్రూప్‌-2 పరీక్షలకు బస్సు సౌకర్యం కల్పించండి

  బీర్కూర్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం నుంచి గ్రూప్‌-2 రాసే అభ్యర్థులు వందల్లో ఉన్నారని, వారికి కామారెడ్డి జిల్లా కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించే విధంగా ఆర్టీసి అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రూప్‌- 2 అభ్యర్థులు కోరుతున్నారు. గతంలో బీర్కూర్‌ మండలం నుంచి నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి బాన్సువాడ డిపో నుంచి అనేక బస్సులున్నాయని, కామారెడ్డి జిల్లాకు వెళ్లాలంటే అభ్యర్థుల పరిస్తితి అయోమయంగా ఉందని వాపోతున్నారు. గ్రూప్‌-2 ఉదయం 10 గంటలకు ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల ...

Read More »

కొత్త రూ.2,000 నోట్లు ఇవేనా?

న్యూఢిల్లీ: పెరుగుతున్న ధరలను  దృష్టిలో ఉంచుకుని అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లకు డిమాండ్ పెరుగుతుండటంతో రూ.2,000 నోట్లను విడుదల చేయాలని ఆర్‌బీఐ ఇటీవల నిర్ణయించినట్టు కథనాలు వచ్చాయి. ఇప్పటికే మైసూరులోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లో ఆ నోట్ల ముద్రణ పూర్తయి కరెన్సీ చెస్ట్‌లకు పంపిణీ చేసినట్టు కూడా చెబుతున్నారు. అయితే ఈ కొత్త నోట్ల విషయమై అటు ప్రభుత్వం గానీ, ఇటు రిజర్వ్ బ్యాంక్ గానీ అధికారికంగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. అతి త్వరలోనే ఈ నోట్లు మార్కెట్లోకి రావడం ...

Read More »

ఆ విగ్రహాలు మాయమవుతాయి!

ఇంగ్లాండ్‌ దేశానికే అందం థేమ్స్‌ నది. అక్కడ నదిలో ఓ వింత జరుగుతుంది. ఆ నదిలో ఉండే గుర్రపు బొమ్మలు థేమ్స్‌ అలల తాకిడికి కనిపించకుండా మాయమవుతాయి. ఈ వింత చూసేందుకు అనేక దేశాలనుంచి యాత్రికులు వస్తుంటారు. థేమ్స్‌నది ఒడ్డున నాలుగు గుర్రపు బొమ్మలుంటాయి. ఇవన్నీ నదిలో వేగం పెరిగే కొద్దీ నీటమునిగి పోతుంటాయట. అసలేంటీ గుర్రాలు అనుకుంటున్నారా? 41 ఏళ్ళ జాసన డికేరియస్‌ టైలర్‌ అనే అతను నదిలో ఈ గుర్రం విగ్రహాలు నిర్మించాడు. ఈ గుర్రాలను నిర్మించడం వెనక ప్రధాన రహస్యం ...

Read More »

టాయ్‌లెట్‌లో హీరో-హీరోయిన్ సెల్ఫీ!

మురికి మరుగుదొడ్డి చూస్తే.. ఎవరైనా ఆ కంపునకు ముక్కు మూసుకుంటారు. కానీ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ మాత్రం ఏకంగా హీరోయిన్‌ను వెంటపెట్టుకొని మరుగుదొడ్డిలో సెల్ఫీ దిగాడు. ఎందుకంటే.. ఆయన మరో క్రేజీ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మానసపుత్రిక అయిన ‘స్వచ్ఛ భారత్‌’  పథకం ఆధారంగా తెరకెక్కుతున్న ‘టాయ్‌లెట్‌- ఎక్‌ ప్రేమ్‌కథ’ సినిమాలో అక్షయ్‌ నటిస్తున్నాడు. సినిమా పేరులోనే టాయ్‌లెట్‌ ఉంది కాబట్టి.. తొలిరోజు మధురలో షూటింగ్‌ ప్రారంభమైన సందర్భంగా ఇదిగో ఇలా భూమి పడ్నేకర్‌తో కలిసి మరుగుదొడ్డిలో సెల్ఫీ ...

Read More »

పిల్లలు పుట్టలేదని వెళితే…

డెన్వర్‌: అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో గల డెన్వర్‌ నగరంలో ఓ జంట తమకు పిల్లలు పుట్టలేదని డాక్టర్‌ వద్దకు వెళ్లారు. కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా వారికి సంతాన భాగ్యం కలిగించే ప్రయత్నంలో డాక్టర్‌ వారికి డీఎన్‌ఏ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో వారి డీఎన్‌ఏ నమూనాలను పరీక్షించిన ల్యాబ్‌ అసిస్టెంట్‌ ఆశ్చర్యపోయాడు. వారిద్దరి డీఎన్‌ఏలూ దాదాపు ఒకేలా ఉన్నాయి. దీంతో అతడు ఈ విషయాన్ని డాక్టర్‌ దృష్టికి తీసుకువచ్చాడు. డాక్టర్‌ వెంటనే వారిద్దరి రికార్డుల్ని క్షుణ్నంగా పరిశీలించగా ఆ భార్యాభర్తలిద్దరి పుట్టిన తేదీలు ...

Read More »

ముఖ్యమంత్రిగా మహేష్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఓ ఇంట్రస్టింగ్ క్యారెక్టర్కు ఓకె చెప్పాడన్నా వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు మహేష్. దాదాపు 90 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాను 2017  సమ్మర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత తనకు శ్రీమంతుడు లాంటి భారీ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకె చెప్పాడు. కమర్షియల్ ...

Read More »

ఏసుక్రీస్తు బిడ్డకు తల్లిని కాబోతున్నా…

వాషింగ్టన్‌: తాను గర్భవతినని, ఏసుక్రీస్తు బిడ్డ తన కడుపులో పెరుగుతున్నాడని చెప్పి సంచలనం సృష్టిస్తోంది ఓ అమెరికా అమ్మాయి. హేలీ అనే ఈ అమ్మాయి తానిప్పుడు 8 నెలల గర్భవతినని, అతి త్వరలో తాను ఏసుక్రీస్తు బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ఒక టీవీ షోలో చెప్పింది. గత రెండు మూడు నెలలుగా ఆమె పదేపదే ఇలా చెబుతోందట! 19 ఏళ్ల ఈ యువతకి అసలు పెళ్లే కాలేదు. పైగా వైద్యులు ఆమెకు మూడుసార్లు అన్ని పరీక్షలూ చేసి ఆమె గర్భవతి కానే కాదని తేల్చారు. అయినా ...

Read More »

మహేష్‌బాబు దత్తత గ్రామంలో …

సిద్ధాపూర్(కొత్తూరు): సినీహీరో మహేష్‌బాబు దత్తత తీసుకున్న సిద్ధాపూర్ గ్రామంలోని ప్రభు త్వ పాఠశాలలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మహేశ్‌బాబు ప్రచారకర్తగా ఉన్న హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగి న ఈ శిబిరాన్ని ఎంపీడీఓ జ్యోతి ప్రారంభించా రు. విద్యార్థులతోపాటు, గ్రామస్తులకు పలురకా ల వైద్య పరీక్షలు చేశారు. ఉచితంగా మందులు ఇచ్చారు. లోపాలు ఉన్నవారిని శస్త్రచికిత్స చేరుుం చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శర్వానీ, ఈఓ పీఆర్‌డీ సాధన, అని ల్, సర్పంచ్ నర్సమ్మ, ఎంపీటీసీ ...

Read More »