Breaking News

Daily Archives: November 7, 2016

ఈ- హాస్పిటల్‌పై సాప్ట్‌వేర్‌ రూపకల్పన

  నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు సేవలందించడానికి ఎల్లవేళలా వైద్యులు అందుబాటులో ఉంటూ వారి బాగోగులను చూసేవి సాప్ట్‌వేర్‌ అమలు చేయనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి సమావేశ హాలులో ఆసుపత్రి పర్యవేక్షకులు రాములుతో పటు వైద్యులకు, ఫార్మాసిస్టులకు, ఒపిడి, ఐపిడి సిబ్బందికి, స్టాప్‌ నర్సులకు, పరిపాలనా విభాగాలకు చెందిన వారికి ఇ-హాస్పిటల్‌ అనే సాప్ట్‌వేర్‌తో అవగాహన కల్పించారు. ఈ సాప్ట్‌వేర్‌ఉ ఎన్‌ఐసి డిల్లి అభివృద్ది ...

Read More »

14న ఆకాశంలో అద్భుతం!

ఇప్పుడు చూడకపోతే మళ్లీ 2034లోనే… ఈ నెల 14న ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది. ఆరోజున గత 70 ఏళ్లలో ఎప్పుడూ లేనంత దగ్గరగా భూమి వైపునకు చంద్రుడు రానున్నాడు. 14 శాతం పెద్దదిగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది చందమామ. సాయంత్రం 5.45 గంటల నుంచి రెండు గంటల పాటు ఈ అద్భుతం ఆకాశంలో ఆవిష్కృతమవుతుంది. అదేరోజున కార్తీక పౌర్ణమి కూడా కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు తప్పితే మళ్లీ 2034 వరకు చంద్రుడిని ఇలా చూసే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read More »

మేజర్ అమ్మాయిని తల్లిని చేసిన మైనర్ బాలుడు.!

తిరువనంతపురం (కేరళ): రెండు రోజులు క్రితం కేరళలో ఓ అమ్మాయి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన కలకం రేపుతోంది. 18 ఏళ్ల అమ్మాయి 12ఏళ్ల బాలుడు కారణంగా గర్భం దాల్చిందని పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆమె ప్రసవం చేసిన ఆసుపత్రి యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జనాలు అవాక్కవుతున్నారు. అసలు ఇది సాధ్యమేనా.. నమ్మలా వద్దా అనే డైలామాలో పడ్డారు. వివరాల్లోకెళితే.. ఈ ఘటన కేరళలోని కొచ్చి కలమసెరిలో జరిగింది. రెండు నెలల క్రితం 18 ఏళ్లు ...

Read More »

పురుషుల్లారా బహుపరాక్! ఈ వార్త మీకోసమే..

బీజింగ్: పురుషుల్లారా బహుపరాక్. నైట్ షిప్టులు చేసేవారు, పగటి పూట కాస్త కునుకు తీయనివారు, రోజుకు పది గంటలకు పైగా నిద్రపోయేవారు ఇక నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే. వీరిలో కేన్సర్ రిక్స్ ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. చైనాలోని హౌఝాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు మధ్య, వయసు మళ్లిన 27వేల మందిని ఇంటర్వ్యూలు చేయడం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. నైట్ షిప్ట్‌ల్లో పనిచేసేవారు, పగటిపూట కునుకు తీసేవారు, రాత్రిపూట నిద్రించే పురుషులను ఇందుకు ఎంచుకున్నారు. శాస్త్రవేత్తలు ఎంచుకున్న ...

Read More »

దత్తాత్రేయ క్షేత్రంలో వైభవంగా పూజలు

  కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి శివారులోని దత్తాత్రేయ క్షేత్రంలో కార్తీక మాసం తొలి ఆదివారం పురస్కరించుకొని వైభవంగా పూజలు నిర్వహించారు. గణపతి హోమం, స్వామీజీ పాదుక పూజా, సత్యనారాయణ స్వామివారి వ్రతం, తైలాభిషేకం, సామూహిక లలితా సహస్రనామ పారాయణం, దత్తభిక్ష, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు లక్ష్మణ్‌రావు, ఆంజనేయులు, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Read More »

టగ్‌ ఆఫ్‌ వార్‌ జాతీయజట్టుకు కోమల్‌ ఎంపిక

  కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టగ్‌ ఆఫ్‌ వార్‌ జాతీయజట్టుకు కామారెడ్డికి చెందిన ఎల్‌. కోమల్‌ ఎంపికైనట్టు లయోలా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.బి.చారి తెలిపారు. గత నెల హైదరాబాద్‌లో జరిగిన టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలో లయోలా పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఎల్‌.కోమల్‌ పాల్గొని ప్రతిభ కనబరిచిందన్నారు. కోమల్‌ జాతీయ జట్టుకు ఎంపిక కావడం పట్ల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, విద్యార్తుళు అభినందించారు. మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Read More »

సిపిఐ జిల్లా కార్యవర్గం ఎన్నిక

  కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సిపిఐ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు నాయకులు తెలిపారు. శనివారం కామారెడ్డిలో జరిగిన మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని నియమించినట్టు చెప్పారు. కార్యవర్గ సభ్యులుగా చెలిమెల భానుప్రసాద్‌, దశరథ్‌, పూసల బాల్‌రాజ్‌లు ఎన్నికైనట్టు తెలిపారు. పార్టీని పటిష్టం చేయనున్నట్టు, ప్రజా సమస్యల్లో పాలుపంచుకొని వాటిని పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.

Read More »

హెల్మెట్లపై అవగాహన

  కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఆదివారం హెల్మెట్‌ ధారణపై పోలీసులు వాహనచోదకులకు అవగాహన కల్పించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనచోదకులకు హెల్మెట్ల వినియోగంపై వివరించారు. ఈనెల 7వ తేదీ నుంచి జిల్లాలో హెల్మెట్‌ తప్పకుండా ధరించాలని లేనిపక్షంలో జరిమానాలు విధించడం జరుగుతుందని చెప్పారు. హెల్మెట్‌ ధరించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐ శోభన్‌, సిబ్బంది ఉన్నారు.

Read More »

సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శిగా నర్సింహారెడ్డి

  కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సిపిఐ కార్యదర్శిగా సీనియర్‌ నాయకుడు వి.ఎల్‌.నర్సింహారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. శనివారం కామారెడ్డిలో జరిగిన సిపిఐ జిల్లా మహాసభల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సీనియర్‌ నాయకుడిని కార్యదర్శిగా నియమించడం పట్ల పార్టీశ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Read More »

తెరాస బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి

  మోర్తాడ్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రశంసలు పొందుతున్న సిఎం కెసిఆర్‌ చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మోర్తాడ్‌ మండల పార్టీ ప్రత్యేక ఇన్‌చార్జి ముస్కు భూమేశ్వర్‌ అన్నారు. ఆదివారం మోర్తాడ్‌ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు కల్లడ ఏలియా అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిదులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »