Breaking News

గ్రూప్‌-2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

 

డిచ్‌పల్లి, నవంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రూప్‌-2 పరీక్షలు విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణ జిల్లా కన్వీనర్‌ ప్రొఫెసర్‌ టి.సత్యనారాయణ చారి తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవడం, ఎలాంటి ఆభరణాలు లేకపోవడం, ఎలక్ట్రానిక్స్‌ గాడ్జెట్స్‌ లేకపోవడం కీలకమని ఆయన తెలిపారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీలో ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ సభ్యులనుద్దేశించి ఆయన మాట్లాడారు. వారు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను నిశితంగా పరిశీలించాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆచార్య సత్యనారాయణ చారి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి భద్రత ఉంటుందని అందరూ పరీక్షల సక్రమ నిర్వహణకు సహకరించాలని కోరారు. నిజామాబాద్‌ జోన్‌ పరిధిలో 59 పరీక్షా కేంద్రాలుంటాయని, ఆర్మూర్‌ పరిదిలో 28, బోధన్‌ పరిదిలొ 14, కామారెడ్డి పరిధిలో 21 సెంటర్లుంటాయని చారి వివరించారు. సమావేశంలో జిల్లా కో కన్వీనర్‌ డాక్టర్‌ జి.చంద్రశేఖర్‌, ఇతర ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *