Breaking News

Daily Archives: November 11, 2016

ప్రశాంతంగా గ్రూప్‌-2 రాత పరీక్షలు

  కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో గ్రూప్‌-2 రాత పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. 21 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలు రాశారు. మొత్తం 9,152 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 6,163 అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 2,989 మంది గైర్హాజరయ్యారు. 67.35 శాతం అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్టు అధికారులు తెలిపారు. పరీక్షల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఉన్నతాధికారులు పరీక్షలను పర్యవేక్షించారు.

Read More »

మునిసిపల్‌ కార్మికుల నూతన కార్యవర్గం ఎన్నిక

  కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో శుక్రవారం మునిసిపల్‌ కార్మికుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సిఐటియు అనుబంధంగా ఉన్న మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ కామారెడ్డి మునిసిపాలిటి అధ్యక్షునిగా బొట్టు నర్సింగ్‌రావు, ప్రధాన కార్యదర్శిగా రాజనర్సులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్దతులను రద్దుచేసి కార్మికులందరిని క్రమబద్దీకరించాలని కోరారు. కనీస వేతనం రూ. 18 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. గ్రూప్‌ ఇన్సురెన్సు, ప్రమాద బీమాలను వర్తింపజేయాలని డిమాండ్లు వెల్లడించారు. ...

Read More »

ముగ్గురు దొంగల అరెస్టు

  కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గొర్రెల దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురు దొంగలను శుక్రవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్టు కామారెడ్డి రూరల్‌ సిఐ కోటేశ్వర్‌రావు తెలిపారు. అన్నారం గ్రామానికి చెందిన ఉప్పు వెంకటి, ఎల్లంపేటకు చెందిన బుక్యా, మోహన్‌, ఎల్లంపేటకు చెందిన బుక్య పంతులులు గొర్రెల దొంగతనానికి పాల్పడ్డారన్నారు. ఎల్లారెడ్డి పోలీసులు వీరిని అరెస్టు చేసి కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్టు సిఐ తెలిపారు.

Read More »

రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూడాలి

  – వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి పరిస్థితిలో నష్టం వాటిల్లకుండా వారికి గిట్టుబాటు ధర అందేలా చూడాలని రైస్‌మిల్లర్లను, కమీషన్‌ ఏజెంట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్‌ సమావేశంలో రైస్‌మిల్లర్లు, ట్రేడర్లు, కమీషన్‌ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిపిటి వరి దాన్యం ధర మార్కెట్లో రూ. 1900 ...

Read More »

ఘనంగా మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి

  కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జాతీయ తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ 128వ జయంతి వేడుకలను శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌ కాంప్లెక్సులోని సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆద్వర్యంలో మైనార్టీ వెల్పేర్‌ డే జరిపారు. మైనార్టీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద కూడా మౌలానా అబుల్‌ కలాం జయంతి వేడుకలు జరిపారు. ...

Read More »

రాష్ట్రస్తాయి బ్యాడ్మింటన్‌కు తిమ్మాపూర్‌ విద్యార్థుల ఎంపిక

  మోర్తాడ్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రణయ్‌, శ్రీవాణి, మమత, గణేష్‌లు రాష్ట్రస్తాయిలో జరిగే బ్యాడ్మింటన్‌ టోర్నికి ఎంపికయ్యారని పిఇడి నగేశ్‌ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు. నల్గొండ జిల్లాలో ఈనెల 13 నుంచి 15 వరకు జరిగే టోర్నికి విద్యార్థులు వెళ్లి ప్రతిభ చాటుతారని వారు పేర్కొన్నారు.

Read More »

నోట్ల మార్పిడి కోసం ప్రజలు బ్యాంకుల వద్ద పడిగాపులు

  నందిపేట, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధాని నరేంద్ర మోడి 500,1000 పాత నోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా పాత వాటిని రద్దుచేస్తున్నట్టు ప్రకటించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. పాత వాటి స్థానంలో కొత్తవాటిని తీసుకోవాలని ప్రభుత్వం నిబంధనలు విధించడంతో జనం బ్యాంకుల వద్ద గురువారం నుండి బారులు తీరుతున్నారు. రెండో రోజు అయిన శుక్రవారం నందిపేట మండలంలోని ఐఓబి, ఆంధ్రాబ్యాంకు, దక్కన్‌ గ్రామీణ బ్యాంకు, డొంకేశ్వర్‌లోని సిండికేట్‌ బ్యాంకు, ...

Read More »

ట్రైనీ అధికారుల స్వచ్చభారత్‌

  మోర్తాడ్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ధర్మోరా గ్రామంలో స్వచ్చభారత్‌ పథకం కింద ఐఏఎస్‌ శిక్షణ అధికారులు అభిషేక్‌ కుమార్‌, నేహసింగ్‌, ఐఇఎస్‌ మోహియుద్దీన్‌, ఐపిఎస్‌ శ్రియాదేవి, మాన్‌సింగ్‌, ఐఎస్‌ఎస్‌ అధికారులు స్థానిక సర్పంచ్‌ దుగ్గెర రాజేందర్‌, ఎంపిటిసి లత, రాజేశ్వర్‌, ఏపిఎం నర్సయ్య, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌, మహిళా సంఘాల సభ్యులు, ఉపాధి హామీ కూలీలు, గ్రామ కమిటీ సభ్యులు, విద్యార్థులతో కలిసి శుక్రవారం స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లోగల రోడ్లను శుభ్రం ...

Read More »

మత్స్యకారుల అభివృద్దే ధ్యేయం

  మోర్తాడ్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్స్యకారుల అభివృద్దే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని సర్పంచ్‌లు ఉగ్గెర భూమేశ్వర్‌, అనిత, శ్రీనివాస్‌, ఈర్ల లక్ష్మి, కిషన్‌లు అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామ విజయలక్ష్మి చెరువులో 56 వేలు చేపపిల్లలను, పాలెం బురుగు చెరువులో 73 వేల చేప పిల్లలు, రామన్నపేట్‌లో ఎర్రచెరువులో, కొత్త చెరువులో, బర్లకుంటల్లో 2 లక్షల చేప పిల్లలను మత్స్యశాఖ అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు అధికారులు ...

Read More »