Breaking News

Daily Archives: November 12, 2016

చేప పిల్లల విడుదల

  నందిపేట, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని వివిధ గ్రామాల్లోని చెరువుల్లో శనివారం చేప పిల్లలను విడుదల చేశారు.తల్వేదలోని ఊర చెరువులో 45 వేల చేప పిల్లలు, అదేవిధంగా గుడిచెరవులో 56 వేల చేప పిల్లలు, దత్తాపూర్‌లోని పెద్ద చెరువులో 84 వేల చేపపిల్లలు, నికాల్‌పూర్‌లోని కాలువకుంటలో 23 వేల చేపపిల్లలు, జంగం చెరువులో 5 వేల చేప పిల్లలు, ఖుదావన్‌పూర్‌లోని పెద్ద చెరువులో 1 లక్ష 5 వేల చేప పిల్లలు విడుదల చేశారు. కార్యక్రమంలో ...

Read More »

నిలకడగా కందకుర్తి వద్ద గోదావరి ప్రవాహం

  రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం కందకుర్తి గోదావరి నది ప్రవాహం నిలకడగా ఉంది. వర్షాకాలంలో కురిసిన వర్షాలకు తోడు మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు ద్వారా వచ్చిన ఉదృతితో గోదావరి నిండుకుండను తలపిస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన నీరు ఎప్పటికప్పుడు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వెళ్లాయి. అప్పట్లో పరవల్ళు తొక్కిన కందకుర్తి గోదారమ్మ నీటిమట్టం అలాగే ఉండిపోయింది. గత మాసం 29వ తేదీన మహారాష్ట్ర బాబ్లీప్రాజెక్టు గేట్లను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు మూసివేశారు. అప్పటినుంచి ...

Read More »

ఇబ్బందులు పడకండి… గ్రామ పంచాయతీ బిల్లులు చెల్లించండి..

  మోర్తాడ్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన 500,1000 నోట్లతో ప్రజలు ఇబ్బందులు పడవద్దని, రద్దయిన నోట్లతో ఇంటిపన్నులు, నీటి పన్నుల బకాయిలు చెల్లించుకోవాలని మోర్తాడ్‌, ఏర్గట్ల మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్‌లు గత రెండ్రోజులుగా వీది వీధిన పలు కాలనీల్లో డప్పుతో, మైకుల ద్వారా చాటింపు చేయిస్తున్నారు. అంతేగాకుండా శని, ఆది, సోమ వారాల్లో సెలవు రోజులు అయినప్పటికి ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యదర్శులు, కారోబార్లు, జూనియర్‌ ...

Read More »

ప్రజల మన్ననలు పొందేలా పోలీసులు విదులు నిర్వర్తించాలి

  మోర్తాడ్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదుదారులు నేరుగా వచ్చి పిర్యాదు చేసుకునేలా ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిస్కరించి ప్రజల మన్ననలు పొందాలని డిఐజి అకుల్‌ అగర్వాల్‌, కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ రాహుల్‌ హెగ్డేలు అన్నారు. శనివారం మోర్తాడ్‌ పోలీసు స్టేషన్‌ను సందర్శించి రికార్డులను, పోలీసు భవనాన్ని, ప్రహరీగోడ, కంచె, పరిసరాలను, పోలీసు క్వాటర్లను, లాకప్‌ గదులను వారు పరిశీలించారు. ముందుగా మోర్తాడ్‌ పోలీసులు డిఐజికి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌ చుట్టుగల ...

Read More »

శనివారంతో ట్రైనీ అధికారుల పర్యటన పూర్తి

  మోర్తాడ్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ధర్మోరా గ్రామానికి ఈనెల 7న విచ్చేసిన ట్రైనీ ఐఏఎస్‌ అభిషేక్‌ కుమార్‌, ఐపిఎస్‌ మోహియుద్దీన్‌, ఐఇఎస్‌ నేహ సింగ్‌, ఐఎస్‌ఎస్‌ ప్రియాదేవి, మాన్‌సింగ్‌లు శనివారంతో శిక్షణ పూర్తయిందని తెలిపారు. గత వారం రోజులుగా పలు గ్రామాలకు, వివిధ మండల కార్యాలయాలను, గ్రామ పంచాయతీలను సందర్శించి అనేక సమస్యలపై అవగాహన పొందినట్టు తెలిపారు. శనివారం గ్రామంలోని సమస్యలను ఇంటింటికి తిరుగుతూ తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగంచేసుకోవాలని ప్రజాప్రతినిదులు, గ్రామస్తులు ...

Read More »

విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి

  రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్ర శివారులో శుక్రవారం రాత్రి ఎడపల్లి మండలం ఎఆర్‌పి క్యాంపు గ్రామానికి చెందిన మల్లేశ్‌ (35)అనే యువకుడు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందినట్టు రెంజల్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐ ఆసీఫ్‌ తెలిపారు. సాటాపూర్‌ గేటు నుండి రెంజల్‌ తహసీల్‌ కార్యాలయం వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా టిప్పర్‌పై మృతుడు క్లీనర్‌గా పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో టిప్పర్‌పై నుండి మెటిరియల్‌ను అన్‌లోడ్‌ చేస్తుండగా పైన ఉన్న ...

Read More »

ఉప్పు ఉంది… పుకార్లు నమ్మొద్దు…

  నిజామాబాద్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మార్కెట్లో నిత్యవసర సరుకులైన ఉప్పుకు ఎలాంటి కొరత లేదని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ చాంబరులో ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ బహిరంగ మార్కెట్లో ఉప్పుకు కొరత లేదని, వదంతులను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. వదంతులను ఆసరా చేసుకొని వ్యాపారస్తులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకన్నా ఎక్కువ ధరకు అమ్మినట్టు సమాచారం అందితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు.

Read More »

14 నుండి గ్రంథాలయ వారోత్సవాలు

  రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14వ తేదీ నుంచి 21 వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు గ్రంథపాలకుడు రాజేశ్వర్‌ తెలిపారు. సోమవారం 11 గంటలకు సరస్వతి పూజా కార్యక్రమంతో వారోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 15న పుస్తక ప్రదర్శన, 16న మిషన్‌ కాకతీయ అంశంపై వ్యాసరచన పోటీ, 17న మ్యూజికల్‌ చైర్‌ పోటీలు, 18న జ్ఞాపక శక్తి పోటీలు, 19న రంగోలి, నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 21న విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుందని ఆయన వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా ...

Read More »

రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు…

  – ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని నీలా గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం, సోయాబిన్‌ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం గింజల బరువు తూకం వేసేందుకు విద్యుత్‌ కాంటలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శుద్దిచేసిన ధాన్యానికి తరుగులేకుండా తీసుకోవాలన్నారు. ...

Read More »

సర్పంచ్‌పై చర్య ఎప్పుడు

  నందిపేట, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొని చెక్‌ పవర్‌ కోల్పోయిన సర్పంచ్‌ షాకీర్‌పై చర్యలేదా? నందిపేట మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ షాకీర్‌ హుస్సేన్‌, అప్పటి కార్యదర్శి శంకరయ్య కలిసి గ్రామ పంచాయతీ పాలకవర్గ తీర్మానం లేకుండా ఇల్ల నిర్మాణాలకు, కోర్టు కేసులో ఉన్న భూమిలో అక్రమ నిర్మాణాలకు, అసైన్‌మెంట్‌ భూమిలో అనుమతులు ఇచ్చి గ్రామ పంచాయతీ ఖాజానాకు గండి కొట్టి లక్షల్లో అవినీతికి పాల్పడిన ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని డిఎల్‌పిఓ, డిపివో, కలెక్టర్‌కు, ...

Read More »

ఆకాశాన్నంటిన ఉప్పు, చక్కర ధరలు

  నందిపేట, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉప్పు ధర పెరిగిందంటూ శుక్రవారం రాత్రి నుంచి టివిల్లో, సోషలన మీడియాల్లో వస్తున్న వార్తలను నమ్మవద్దని, అవి కేవలం పుకార్లు మాత్రమేనని ప్రభుత్వం ప్రజలకు సూచించినా ప్రజల తీరుమారడం లేదు. శనివారం తాజాగా ఉప్పు, చక్కర లొల్లి మండల కేంద్రానికి పాకింది. ఉప్పు, చక్కర కొరత విషయం ఆనోట, ఈనోట వ్యాపించడంతో నందిపేట ప్రాంత జనం దుకాణాలవైపు పరుగులుతీశారు. ప్రజల రద్దీని చూసి కిరాణ దుకాణదారులు ఉప్పు, చక్కర ధరలు అమాంతంగా ...

Read More »

మూడో రోజు తప్పని తిప్పలు

  నందిపేట, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రబుత్వం పాత 500, 1000 నోట్లను రద్దుచేయడంతో నందిపేట ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నోట్ల మార్పిడి కోసం మూడు రోజులుగా బ్యాంకుల ఎదుట బారులు తీరుతున్నారు. శుక్రవారం నుంచి ఎటిఎంలు పనిచేస్తాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు వాటిని ఆశ్రయించగా, అవి పనిచేయక నిరాశ ఎదురవుతుంది. దీంతో బ్యాంకుల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. ఆంధ్ర బ్యాంకు, ఐఓబి బ్యాంకు, ఎస్‌బిహెచ్‌ బ్యాంకు, ఖుదావన్‌పూర్‌ ...

Read More »