Breaking News

Daily Archives: November 17, 2016

30న విద్యార్థులకు అథ్లెటిక్‌ పోటీలు

  కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరగాంధీ స్టేడియంలో ఎన్‌వైసిఎస్‌ ఆధ్వర్యంలో 11 నుంచి 17 సంవత్సరాల బాల బాలికలకు అథ్లెటిక్‌ పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా కో ఆర్డినేటర్‌ బాపురెడ్డి, రాష్ట్ర కో ఆర్డినేటర్‌ రవిందర్‌రెడ్డిలు తెలిపారు. 2020 ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత్‌తరఫున ప్రాతినిధ్యం వహించే విధంగా గ్రామీణ స్థాయి నుంచి ఎన్‌వైసిఎస్‌ ఆద్వర్యంలో క్రీడాకారులను సన్నద్దం చేసేందుకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి, సిద్దిపేట, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ ...

Read More »

ఆల్పజోలమ్‌ తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

  – లక్షన్నర విలువ గల ఆల్పజోలమ్‌ స్వాధీనం కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆల్పజోలమ్‌ తరలిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు. డిప్యూటి ఎక్సైజ్‌ కమీషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌ ఆదేశాల మేరకు మాచారెడ్డి మండలం చుక్కపూర్‌ గ్రామ శివారులో తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్రవాహనంపై రాజాగౌడ్‌, బద్రిలను ...

Read More »

బిసి అధ్యాపకులకు సత్కారం

  డిచ్‌పల్లి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌గా అవార్డు అందుకున్న డాక్టర్‌ సి.హెచ్‌. ఆర్తి, ఉత్తమ అధ్యాపకులుగా అవార్డులు అందుకున్న డాక్టర్‌ ప్రవీణాబాయి, డాక్టర్‌ జే.వి.శివకుమార్‌లను గురువారం ఘనంగా సన్మానించారు. బిసి అధ్యాపకుల సంఘం ఆద్వర్యంలో కామర్స్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల సెమినార్‌ హాల్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెవివి బిసి టీచర్స్‌ అసోసియేషన్‌ సీనియర్‌ సభ్యులు ప్రొఫెసర్‌ యాదగిరి మాట్లాడుతూ అధ్యాపకులు అధ్యాపక వృత్తిని గౌరవిస్తూ ఒక బాద్యతాయుత ...

Read More »

ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి

  రెంజల్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మార్పిఎస్‌ జాతీయ కార్యదర్శి మానికొల్ల గంగాదర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం రెంజల్‌ మండల కేంద్రంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఛలో హైదరాబాద్‌ గోడప్రతులను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. ఈనెల 27న ధర్మయుద్ద సభను జయప్రదం చేయాలని కోరారు. మాదిగ, మాదిగ ఉపకులాలకు చెందినవారు కదిలి రావాలన్నారు. ఈ విషయాన్ని అందరిలోకి తీసుకెళ్లి చైతన్య పరచాలన్నారు. 23 ఏళ్ళుగా ...

Read More »

విద్యార్థులకు కుర్చీ పోటీలు ….

  రెంజల్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గురువారం చిన్నారి విద్యార్థులకు కుర్చీ పోటీలు నిర్వహించినట్టు గ్రంథ పాలకుడు రాజేశ్వర్‌ తెలిపారు. మండలంలోని ప్రభుత్వ, ప్రయివేటుపాఠశాలలకు చెందిన మొదటి, 2వ తరగతులకు చెందిన బాలబాలికలకు ఈ పోటీలు నిర్వహించినట్టు ఆయన పేర్కొన్నారు. విజేతలకు సోమవారం బహుమతి ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సాయిలు, సిద్ద ప్రభాకర్‌, ఉపాధ్యాయులు స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Read More »

బడా పెట్టుబడిదారుల మొండి బకాయిలు వసూలుచేయాలి

  రెంజల్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ స్థాయి బ్యాంకులు దేశంలోని బడా పెట్టుబడిదారుల మొండి బకాయిలు వసూలు చేసి తీరాలని రెంజల్‌ మండల అఖిలభారతీయ రైతుకూలీ సంఘం మండల అద్యక్ష, కార్యదర్శులు ఒడ్డెన్న, ఎస్‌.కె.నసీర్‌లు డిమాండ్‌ చేశారు. గురువారం బోర్గాంలో విలేకరులతో మాట్లాడారు. మొండి బకాయిలకు చెందిన బడా పెట్టుబడిదారులకు చెందిన 7106 కోట్లు మాఫీ చేస్తున్న విషయాన్ని వారుతీవ్రంగా ఖండించారు. దేశానికి అన్నంపెట్టే రైతు ఆరుగాలం శ్రమించి అప్పుల ఊబిలో పడి వాటిని తీర్చలేక ఆత్మహత్యలు ...

Read More »

తీరని నోటు కష్టాలు…

  నిజాంసాగర్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నోట్ల మార్పిడి కోసం ప్రజలకు తంటాలు తప్పడం లేదు. ఈనెల 8వ తేదీన కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్లను రద్దుచేయడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంకుల వద్ద ఉదయాన్నే 8 గంటల నుంచి టోకెన్లు ఇవ్వడంతో క్యూపద్దతి పాటిస్తున్నారు. పోలీసులు బందోబస్తు ఉండి ఒక్కొక్కరిని బ్యాంకులోకి అనుమతిస్తున్నారు. అందులో భాగంగా 1 నుంచి 100 లేదా 150 లోపే టోకెన్లు అయిపోయాయని, డబ్బులు లేవని, సమయం బ్యాంకు అధికారులు ...

Read More »

18 నుంచి గంగమ్మ ఆలయ వార్షికోత్సవాలు

  నిజాంసాగర్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట గ్రామ శివారులోగల 16 గేట్ల సమీపంలోని గంగమ్మ ఆలయంలో ఈనెల 18వ తేదీ నుంచి వార్షికోత్సవాలను నాలుగురోజుల పాటు నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 18న హోమం, 19 నుంచి బోనాలు, అన్నదానం,తదితర కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఆయాగ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Read More »

పన్నుల వసూలుకు స్పెషల్‌ డ్రైవ్‌

  నిజాంసాగర్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని గాలిపూర్‌, మక్దుమ్‌పూర్‌ ఇంటిపన్ను, నల్లాపన్ను, వసూలు చేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు బృందాలుగా ఏర్పడి ఇంటింటికి తిరుగుతూ పన్నులు చెల్లించాలని గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో కార్యదర్శులు సంధ్యారాణి, సుధాకర్‌, క్యాసప్ప, తదితరులున్నారు.

Read More »

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి

  నిజాంసాగర్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను మహిళలు వినియోగించుకోవాలని, ఆర్థికంగా బలోపేతం కావాలని తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఎపిఎం రాంనారాయణగౌడ్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులందరికి గ్రామ సంఘం పొదుపు, స్త్రీనిధి ఇలా పలురకాల రుణాలు అందజేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సిసిలు శ్రీకాంత్‌, సాయిలు, విఘ్నేశ్వర్‌గౌడ్‌, జబ్బర్‌ తదితరులున్నారు.

Read More »