Breaking News

Daily Archives: November 18, 2016

ఎంపి క‌విత‌ను క‌లిసిన మెద‌క్ డ‌యాసీస్ బిష‌ప్‌

నిజామాబాద్ ఎంపి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌వితను మెద‌క్ డ‌యాసీస్ బిష‌ప్ రెవ‌రెండ్ డాక్ట‌ర్ ఎ.సి సాల్మ‌న్ రాజ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర మొద‌టి బిష‌ప్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సాల్మ‌న్‌రాజ్‌ను క‌విత అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అభినందించిన బిష‌ప్, క్రైస్త‌వ‌ స‌మాజానికి ముఖ్య‌మంత్రి కేసిఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌శంసించారు.అయితే ఈ ఫ‌లాల‌ను ప్ర‌తి క్రిస్టియ‌న్‌కు అందిన‌ప్పుడే అన్నిరంగాల్లో వారు అభివృద్ధి చెందుతార‌న్నారు. టిఆర్ఎస్ ప్ర‌భుత్వం అన్ని మ‌తాల వారినీ స‌మ‌దృష్టితో చూస్తున్న‌ద‌న్నారు ...

Read More »

మోడి నిర్ణయాన్ని స్వాగతించిన విద్యార్థి సేన

  కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా పాత 500, 1000 నోట్లను రద్దుచేస్తూ ప్రదానిమంత్రి మోడి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు విద్యార్థిసేన నాయకులు తెలిపారు. సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి జింక భాస్కర్‌ శుక్రవారం కామారెడ్డిలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నిర్ణయం దేశంలో నల్లకుబేరులకు పెద్ద షాక్‌ ఇచ్చిందన్నారు. తాత్కాలికంగా దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగినా దీర్ఘకాలికంగా దేశానికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. తీవ్రవాదంపై మోడి నాయకత్వం ఎంతో బాగుందని, ఇలాంటి నిర్ణయాలను తాము ...

Read More »

విపక్ష నేత షబ్బీర్‌ అలీని కలిసిన మైనార్టీలు

  కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జమాతె ఉల్మాయే హింద్‌ అనే స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20న నిర్వహించనున్న సదస్సుకు శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీని ఆహ్వానించినట్టు ఏఐఎంఐఎం కామారెడ్డి అధ్యక్షుడు జాకీర్‌ హుస్సేన్‌, జమాతె ఉల్మాయే హింద్‌ కార్యదర్శి అజ్మత్‌ తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు అంతరించిపోతున్న విలువలు, భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఔన్నత్యానికి ఎదురవుతున్న ఇబ్బందులు అనేఅంశాలపై తమ సంస్థ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. కామారెడ్డి విద్యానగర్‌ కాలనీలోని ...

Read More »

సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసన

  కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సహకార బ్యాంకుల్లో రూ. 500 , 1000 నోట్ల డిపాజిట్లను స్వీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరించడం పట్ల నిరసన వ్యక్తంచేస్తూ శుక్రవారం సహకార కేంద్ర బ్యాంకు ఎదుట మేనేజర్‌ రంజిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. అఖిలభారత సహకార బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య తెలంగాణ కో ఆపరేటివ్‌ బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆందోలన చేపట్టినట్టు తెలిపారు. బ్యాంకుల్లో పాత నోట్ల చలామణి యదావిదిగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే ...

Read More »

శివాజీ బీడీ కంపెనీ మోసాలను అరికట్టాలి

  కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శివాజీ బీడీ కంపెనీ చేస్తున్న మోసాలకు నిరసనగా శివాజీ రేంజన కార్యాలయం ముందు శుక్రవారం ది తెలంగాణ బీడీ రోలరన యూనియనన ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. యూనియనన రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు లక్ష్మణ్‌ మాట్లాడుతూ శివాజీ బీడీ కంపెనీలో 6 సెంటర్లున్నాయని, ప్రతిసెంటరనకు 3 వేల మంది బీడీ కార్మికులు పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు. కంపెనీ వీరికి వెయ్యి బీడీలకు సరిపడా తూనికాకు ఇవ్వకుండా మోసం చేస్తుందని, ఇచ్చిన ఆకుతో 400 ...

Read More »

గ్రంథాలయంలో వ్యాసరచన పోటీలు

  నిజాంసాగర్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన వారికి 19వ తేదీన శనివారం బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని గ్రంథపాలకుడు వెంకన్న తెలిపారు.

Read More »

కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌

  నిజాంసాగర్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని పంచాయతీరాజ్‌ కార్యదర్శులు బృందాలుగా ఏర్పడి కోమలంచ, గాలిపూర్‌, గున్కుల్‌ గ్రామాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో పన్నులు చెల్లించి తమకు సహకరించాలని కోరారు. బకాయిలు చెల్లించడంలో 500, 1000 నోట్లు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యదర్శులు క్యాసప్ప, సంధ్యారాణి, తదితరులున్నారు.

Read More »

గంగమ్మ ఆలయంలో హోమం

  నిజాంసాగర్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రాజెక్టు16 గేట్ల సమీపంలోగల గంగమ్మ ఆలయంలో శుక్రవారం హోమం నిర్వహించారు. ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని, ఐదేళ్లకోసారి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More »

నిజాంసాగర్‌లో ఫిజియోథెరఫి శిబిరం

  నిజాంసాగర్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వికలాంగ విద్యార్థులకు ఫిజియోథెరపి, వ్యాయామం తప్పకుండా చేయాలని ఫిజియోథెరఫి వైద్యురాలు డాక్టర్‌ ప్రణీత అన్నారు. మండలంలో ఎంఇవో కార్యాలయంలో వికలాంగ విద్యార్థులకు ఫిజియోథెరఫి పరీక్షలు శుక్రవారం నిర్వహించారు. ప్రతిరోజు వ్యాయామం చేస్తేనే తప్పకుండా మార్పు వస్తుందని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఐఆర్‌టి సునీల్‌, తదితరులున్నారు.

Read More »

అనుబంధ కళాశాలలకు విసి హెచ్చరిక

  డిచ్‌పల్లి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ త్వరలో నిర్వహించబోయే యుజి, పిజి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్టు తెలిస్తే అలాంటి కళాశాలలను బ్లాక్‌ లిస్టులో పెడతామని వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య హెచ్చరించారు. అలసత్వాన్ని, అవకతవకలను సహించేది లేదని, మాల్‌ ప్రాక్టీస్‌కు ఆస్కారం లేకుండా పటిష్టంగా పరీక్షల నిర్వహణ ఉండాలని ఎవరినీ ఉపేక్షించేది లేదని విసి తీవ్రంగా హెచ్చరికలు చేశారు. శుక్రవారం పరీక్షల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో అఫిలియేటెడ్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశమై మాట్లాడారు. అదేవిధంగా ...

Read More »

వాహనాల తనిఖీలు

  నందిపేట, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని పలుగుట్ట వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసులు వాహనాలు తనికీలు చేశారు. హెల్మెట్లు, సరియైన దృవపత్రాలు లేనివారికి జరిమానాలు విధించారు. హెల్మెట్లు, సరియైన దృవపత్రాలు లేకుండా వాహనాలు నడపరాదని ఎస్‌ఐ జాన్‌రెడ్డి సూచించారు.

Read More »

కష్టాలు ఏ 10 డేస్‌

  నందిపేట, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం రూ. 500, 1000 నోట్లు రద్దుచేయడంతో వివిధ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రభావం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ళు అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపింది. నగదు లావాదేవీలు స్థంభించాయి. కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన రూ. 2 వేల నోట్లు సరిపడా అందుబాటులోకి రాకపోవడం, చిల్లర సమస్య కారణంగా రూ. 100 లోపు విలువ నోట్లు మాత్రమే లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఎటిఎంలు, బ్యాంకుల్లో ప్రజలకు చిన్న మొత్తంలోనే డబ్బులు లభిస్తున్నాయి. ...

Read More »

జాతీయ సేవా పథకం మహోన్నత పథకం

  – విసి సాంబయ్య డిచ్‌పల్లి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సేవా పథకం విద్యార్థుల్లో గొప్ప సేవా స్ఫూర్తిని పెంపొందిస్తుందని, ఇది ఒక మహోన్నత పథకం అని తెవివి వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య అన్నారు. తెయు ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌గా అద్భుతంగా విధులు నిర్వర్తించి రాష్ట్రస్థాయి బెస్టు ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌గా ఎన్నికైన డాక్టర్‌ ఆర్తిని శుక్రవారం విసి ఘనంగా సత్కరించారు. ఒక యువ ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ రాష్ట్రస్థాయిలో బెస్టు కో ఆర్డినేటర్‌గా ఎంపిక కావడం ...

Read More »

బాలలందరికి విద్య, బంగారు భవితకు బాట

  నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదరికాన్ని ఆసరాగా చేసుకొని తల్లిదండ్రులు నిస్సహాయంగా తమ పిల్లలను బడికి పంపించకుండా, చదువు మాన్పించడం సరికాదని ఇన్‌చార్జి జిల్లాకలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నూతన అంబేడ్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన బాలల దినోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 14 సంవత్సరాలు గల బాలబాలికలకు అంతరాయం లేకుండా పాఠశాల విద్య అందించేలా చూడాలని, చిన్న పిల్లలతో దుకాణలలో పనిచేయించడం సరైనపద్దతి కాదని, బాలల హక్కులు వారి అభ్యున్నతి ...

Read More »

గల్ప్‌ కుటుంబాల గోస

  నందిపేట, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుటుంబ సభ్యులను పోషించడానికి పొట్ట చేతపట్టుకొని ఉపాధి కోసం గల్ప్‌ దేశాలైన సౌదీ, దుబాయ్‌, ఖతర్‌, కువైట్‌, ఒమన్‌, బెహ్రెయిన్‌ దేశాలకు వలసవెళ్లిన కుటుంబ సభ్యుల గోస వర్ణనాతీతంగా ఉంది. నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్రమోడి 500, 1000 నోట్ల రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయంతో వచ్చిన సమస్యలలో ముఖ్యంగా బ్యాంకుల్లో ప్రతిరోజు విత్‌డ్రా పరిమితి విధించడంతో గల్ప్‌ నుండి కుటుంబ పోషణ కొరకు పంపిస్తున్న డబ్బు ఇక్కడ తీసుకోలేకపోతున్నారు. భారతదేశం నుంచి ...

Read More »

వికలాంగ విద్యార్థుల్లో విశ్వాసాన్ని పెంచేలా ఆట పోటీలు…

  నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వికలాంగ బాలబాలికలకు ఆట పోటీల్లో పాలుపంచుకునేలా చేసి ఇతర వ్యక్తులకన్నా తాము ఏ మాత్రం తక్కువ కాదనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని నింపడానికి ఆట పోటీలు చాలా దోహదపడతాయని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌ మైదానంలో మహిళ శిశు సంక్షేమశాఖ వికలాంగుల శాఖ, స్నేహ సొసైటీ సంయుక్తంగా డిసెంబరు 3న జరగబోయే ప్రపంచ వికలాంగుల దినాన్ని పురస్కరించుకొని జిల్లాలోగల వికలాంగ విద్యార్థులైన మానసిక సామర్థ్యం, సాధారణ భౌతికంగా ఈ ...

Read More »