Breaking News

గల్ప్‌ కుటుంబాల గోస

 

నందిపేట, నవంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుటుంబ సభ్యులను పోషించడానికి పొట్ట చేతపట్టుకొని ఉపాధి కోసం గల్ప్‌ దేశాలైన సౌదీ, దుబాయ్‌, ఖతర్‌, కువైట్‌, ఒమన్‌, బెహ్రెయిన్‌ దేశాలకు వలసవెళ్లిన కుటుంబ సభ్యుల గోస వర్ణనాతీతంగా ఉంది. నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్రమోడి 500, 1000 నోట్ల రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయంతో వచ్చిన సమస్యలలో ముఖ్యంగా బ్యాంకుల్లో ప్రతిరోజు విత్‌డ్రా పరిమితి విధించడంతో గల్ప్‌ నుండి కుటుంబ పోషణ కొరకు పంపిస్తున్న డబ్బు ఇక్కడ తీసుకోలేకపోతున్నారు. భారతదేశం నుంచి కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజలు గల్ప్‌ దేశాలలో వుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కరీంనగర్‌ తర్వాత నిజామాబాద్‌ జిల్లా వాసులు నివసిస్తున్నారు. జిల్లాలోని ఆర్మూర్‌ నియోజకవర్గం నందిపేట మండల ప్రజలు పెద్ద సంఖ్యలో గల్ప్‌ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. నందిపేట మండలం నుంచి సగటున ప్రతి కుటుంబం నుంచి ఒకరి చొప్పున గల్ప్‌ కార్మికులుగా బయట దేశాల్లో పనిచేస్తున్నారు. గల్ప్‌ కార్మికులు వారికి వచ్చే ప్రతినెల జీతం నుంచి వారి కుటుంబ సభ్యుల అవసరాల కొరకు తొందరగా అందాలనే ఉద్దేశంతో వెస్ట్రన్‌ యూనియన్‌ మాని ట్రాన్స్ఫర్‌, ఎక్స్‌ప్రెస్‌ మనీ, మణిగ్రామ్‌ లాంటి ఇంటర్నేషనల్‌ మని ట్రాన్ఫ్సర్‌ల ద్వారా డబ్బు పంపిస్తూ ఉంటారు. బయట దేశాల నుండి పంపిన డబ్బు ఇక్కడ నిమిషాల్లో తీసుకునే అవకాశం ఉండడంతో బ్యాంకులకు బదులుగా మని ట్రాన్స్ఫర్‌ ఏజేన్సీల ద్వారా డబ్బులు తీసుకుంటారు.

నందిపేట మండలంలో పోర్స్‌ ట్రావెల్స్‌, సాధన ట్రావెల్స్‌, సాయిప్రసాద్‌ ట్రావెల్స్‌, డొంకేశ్వర్‌లోని గేట్‌వే ఇంటర్నేషనల్‌లాంటి ఏజెన్సీల నుండి ప్రతిరోజు వందలాది మంది లక్షల్లో రూపాయలు తీసుకుంటూ ఉంటారు. గల్ప్‌ కార్మికులు నెలనెల తమ జీతం నుండి 15 నుంచి 20 వేలకు తక్కువ కాకుండా పంపిస్తూ ఉంటారు. మనీ ట్రాన్ప్సర్‌ ఏజెన్సీ వారు బ్యాంకుల నుండి తెచ్చి ప్రెమెంట్లకు పంచుతూ ఉంటారు. అయితే నవంబరు 8న ప్రధాని మోడి తీసుకున్న అకస్మాత్తు నిర్ణయంతో మనిట్రాన్స్ఫర్‌ ఏజెన్సీవారికి బ్యాంకు వారు డబ్బులు ఇవ్వడం లేదు. కరెంటు ఖాతా దారులకు వారానికి 50 వేల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికి బ్యాంకుల్లో డబ్బు లేదని, ఇవ్వడం లేదని మని ట్రాన్స్పర్‌ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు వారు ఏజెన్సీ వారికి డబ్బు ఇవ్వడం లేదని బయటి నుంచి వచ్చి డబ్బు కొరకు చెక్కు రాసి ఇస్తున్నారు. చెక్కులు తీసుకెళ్ళి బ్యాంకుల్లో జమచేస్తే తమ చేతికి డబ్బు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండడంతో చెక్కు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీంతో మనీ ట్రాన్స్పర్‌ ఏజెన్సీల వ్యాపారం వెల వెల బోతుంది. చట్టబద్దంగా రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆదేశానుసారం నడిచే మని ట్రాన్స్పర్‌ ఏజెన్సీల మూలంగా భారతదేశానికి కోట్లలో విదేశీ మారకద్రవ్యం వస్తుంది. దీంతో దేశ జిడిపి రేటు పెంచడంలో ముఖ్య భూమిక నిర్వహించే మనీ ట్రాన్స్పర్‌ ఏజెన్సీలకు వెసులుబాటు కల్పించాలని గల్ప్‌ కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *