Breaking News

Daily Archives: November 20, 2016

ఛలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి బల్దియా సానిటరీ ఎస్‌ఐ అరాచకాలకు నిరసనగా సోమవారం ఉదయం తలపెట్టిన ఛలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌, సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం వారు సమావేశమై ఈ విషయమై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సానిటరీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కార్మికుల పట్ల తీవ్ర అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ మాట వినని కార్మికులకు గైర్హాజరు వేస్తూ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు, వేదింపులకు గురిచేస్తున్నాడన్నారు. ...

Read More »

సత్యసాయి సేవాసమితి ఆద్వర్యంలో ప్రత్యేక పూజలు

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీసత్యసాయి సేవాసమితి కామారెడ్డి ఆధ్వర్యంలో సాయిబాబా 91వ జయంతిని పురస్కరించుకొని ఈనెల 19 నుంచి 23 వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సేవాసమితి ప్రతినిధులు తెలిపారు. సోమవారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ప్రత్యేక పూజలుంటాయన్నారు. ఉదయం ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, సాయి గాయత్రీ హోమం, భజన, హారతి, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలోహాజరు కావాలని కోరారు.

Read More »

ప్రమాదకరంగా వంతెనలు…

  నిజాంసాగర్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలం చెల్లిన వంతెనలతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా వరదనీరు తాకిడికి గురైతే ఏ వంతెనపై నుంచైనా వెళ్లాలంటే నరక యాతన పడాల్సిందే. నిజాం హయాంలో మండల కేంద్రానికి సమీపంలోని మంజీర ఉపనదిపై ఏళ్ల క్రిందట వంతెనలు నిర్మించారు. ఈ వంతెనలు నిర్మించి వంద సంవత్సరాలు పూర్తికావస్తున్నా నీటి పారుదల శాఖాధికారులు మరమ్మతులు చేయడం మాత్రం మరిచారు. వంతెనకింది పునాదులు కూడా ...

Read More »

శిథిలావస్థలో హసన్‌పల్లి గ్రామపంచాయతీ భవనం

  నిజాంసాగర్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గల గ్రామపంచాయతీ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఫలితంగా వర్షాకాలం వస్తే చాలు ఎప్పుడు కూలుతుందోననే భయాందోళన మధ్య కాలం వెళ్ళదీస్తున్నారు. గతంలో ఎనిమిదేళ్ళ క్రితం రూ. 10 లక్షల వ్యయంతో మండలంలోని గున్కుల్‌, గాలిపూర్‌, కోమలంచ, నర్వా, నర్సింగ్‌రావుపల్లి, సుంకిపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ కింద నూతనంగా గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించారు. విడతల వారిగా అన్ని గ్రామ పంచాయతీలు అవసరముంటే నిర్మిస్తామని హామీలిచ్చినా ఇంతవరకు రెండోవిడత ...

Read More »