Breaking News

Daily Archives: November 26, 2016

సంక్షేమ పాఠశాల కోసం విద్యార్థుల ఎంపిక

  కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, రామాంతపుర్‌, బేగంపేట్‌లో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి గిరిజన విద్యార్థులను శనివారం ఎంపిక చేశారు. జేసి సత్తయ్య ఆధ్వర్యంలో డ్రా పద్దతిలో ఎంపిక చేశారు. 1వ తరగతి విద్యార్థులకు ప్రవేశం గురించి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 35 దరఖాస్తులు రాగా డ్రా పద్దతిలో ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేశారు. వారిలో ఇద్దరు బాలికలు, ముగ్గురు బాలురు ఉన్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ది అధికారి గంగాధర్‌, సిబ్బంది ...

Read More »

మధ్యాహ్న భోజన పథకం నిర్వహణతీరు పరిశీలన

  కామరెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలవుతున్న తీరును శనివారం పరిశీలించారు. యువజన కాంగ్రెస్‌, విద్యార్థి నిరుద్యోగ జేఏసి, ఎన్‌ఎస్‌యుఐ సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాలలకు వెళ్లి భోజన పరిశీలన చేశారు. పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సరిగా అమలుకావడం లేదని, ప్రబుత్వం భోజన ఏజెన్సీలకు నిధులు నిలిపివేయడం వల్ల విద్యార్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జేసి, ఎంఇవో, ఆర్డీవో, డిఇవోల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు మధ్యాహ్న భోజన పథకం సజావుగా ...

Read More »

పిఆర్‌టియు కరపత్రాల ఆవిష్కరణ

  కామరెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎస్‌ అంతం, పిఆర్‌టియుటిఎస్‌ పంతం అనే కరపత్రాలను శనివారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. పిఆర్‌టియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామోదర్‌రెడ్డి, కుషాల్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 28న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద సిపిఎస్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. వాటికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించామన్నారు. ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు నర్సింహారెడ్డి, భాస్కర్‌రావు, పురుషోత్తం శర్మ, సురేశ్‌, జిల్లా బాధ్యులు సంతోష్‌కుమార్‌, ...

Read More »

‘కవి సామూహిక ఒంటరి’ పుస్తకావిష్కరణ

  కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో శనివారం కవి సామూహిక ఒంటరి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్షక్‌ బిఇడి కళాశాల డైరెక్టర్‌, సాహితీ వేత్త విశ్వనాథం మాట్లాడుతూ కవి యొక్కలూరి శ్రీరాములు రచించిన కవి ఒక సామూహిక ఒంటరి పుస్తకంలో ఎక్కడ చదివినా కవిత్వం జాలువారుతూ ఆనందింపజేస్తుందన్నారు. ఈ కవిత్వం అనుభూతి ప్రదానమైనదే కాకుండా తాత్త్వికతను పెనవేసుకొని ముందుకు సాగిన పుస్తకమని ప్రశంసించారు. కవిత్వం ఒక తపస్సు వంటిదని, కవి ఎప్పుడు నిత్యచైతన్య శీలిగా ...

Read More »

షీ టీం ఆధ్వర్యంలో యువకులకు కౌన్సిలింగ్‌

  కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో షీటీం ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. కామారెడ్డి డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ భాస్కర్‌ నేతృత్వంలో కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ రోడ్లపై, బస్టాండ్‌, ఇతర ప్రదేశాల్లో అమ్మాయిలపై అసభ్యకరంగా ప్రవర్తించిన 66 మందికి కౌన్సిలింగ్‌ నిర్వహించామన్నారు. 12 మందిపై ఈవ్‌టీజింగ్‌ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు రాజేందర్‌, ...

Read More »

వచ్చే సంవత్సరం 2 కోట్ల మొక్కలు నాటాలి…

  – జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌యోగితా రాణా నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే యేడు రెండు కోట్ల మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కని కాపాడాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన హరితహారం సమీక్షలో అన్ని శాఖల అధికారులతో ఈయేడు నాటిన మొక్కలను గురించిన వివరాలు తెలుసుకున్నారు. ఒక కోటి 20 లక్షలు టేకు మొక్కలు మిగిలిన 80 వేల వివిధ రకాల పండ్ల మొక్కలు ఏర్పాటు చేయాలని డిఎఫ్‌ఓ, డిఆర్‌డిఎ ...

Read More »

పిడిఎస్‌యు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

  కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట శనివారం పిడిఎస్‌యు ఆద్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. ఫీజు బకాయిలు, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పిడిఎస్‌యు నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆజాద్‌ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సర్కార్‌ 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతుందన్నారు. 3 వేల 84 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉండగా ...

Read More »

సహకార సంఘ సభ్యులకు 26 లక్షల సబ్సిడీ రుణం మంజూరు

  కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీ విఘ్నేశ్వర విశ్వబ్రాహ్మణ సహకార సంఘంలోని13 మంది సభ్యులకు విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్‌, బిసి కార్పొరేషన్‌ ద్వారా 26 లక్షల సబ్సిడీ డబ్బు మంజూరైనట్టు సంఘం అధ్యక్షుడు బెజ్జంకి సుదర్శన్‌ తెలిపారు. శనివారం సభ్యులకు వీటిని అందజేశారు. సంఘంలోని సభ్యులు పరికరాల కొనుగోలు కోసం ఒక్కొక్కరికి 20 వేల చొప్పున డబ్బు అందజేశామన్నారు. సబ్సిడీ డబ్బులను బిసి కార్పొరేషన్‌ సబ్సిడీ కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయలు మాఫీ చేస్తు బ్యాంకుల ...

Read More »

మహిళలు, యువతకు అండగా షీ టీం…

  – కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు, యువతులను రక్షించేందుకు షీటీంలను ఏర్పాటు చేస్తున్నట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో షీటీంను ఎస్పీ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అమ్మాయిలకు రోజురోజుకు రక్షణ లేకుండా పోతుందని, వారికి రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనతో ముందుగా హైదరాబాద్‌లో షీ టీంలు ప్రారంభించారని తెలిపారు. ...

Read More »

దుమ్ములేపుతున్న రోడ్డు..

  – విద్యార్థుల ఆందోళన, రాస్తారోకో బీర్కూర్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌-బాన్సువాడ ప్రధాన రహదారి మరమ్మతులు చేసి సంవత్సరం కావస్తున్నా రోడ్డుపై గల పాఠశాలలో దుమ్ము, దూలి వల్ల విద్యార్థులు అవస్థలు పడుతున్నారంటూ దామరంచ పాఠశాల విద్యార్థులు శనివారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్రధాన రహదారి రోడ్డు మరమ్మతుల కోసం 29 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినా గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల సంవత్సరం కాలం గడుస్తున్నా మరమ్మతులు ఇంకా పూర్తికాలేదని, గత సంవత్సరం ...

Read More »

యాసంగి పంటలపై అవగాహన

  నిజాంసాగర్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో హసన్‌పల్లి, నర్వ, బంజపల్లి గ్రామాల్లో శనివారం గ్రామసభ నిర్వహించారు. ఇందులో ఏఇవో రవీందర్‌ మాట్లాడుతూ రైతులకు పంటలపై అవగాహన కల్పించారు. డిసెంబరు మొదటి వారం నుంచి మార్చి 30 వరకు హెర్త్‌లూస్‌ నుంచి రబీ సాగుకు నీటి విడుదల కొనసాగుతుందని చెప్పారు. మార్చి 30 లోగా పంటలు వచ్చేవిధంగా యాసంగి పంటలు వేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రోడ్డుకు ఇరుపక్కల ...

Read More »

సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న రాధాకృష్ణ మహరాజ్‌

  బాసర, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ స్వామిజీ రాదాకృష్ణ మహారాజ్‌ శనివారం బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజస్థాన్‌ నుంచి తన శిష్యబృందంతో విచ్చేసిన స్వామిజీ స్థానిక మంగిరాములు మహారాజ్‌ ఆశ్రమం పక్కన మరో ఆశ్రమం ఏర్పాటు చేశారు. రాజస్తాన్‌లో సుమారు 2 లక్షల గోవుల సంరక్షణ చేస్తున్నామని, బాసరలో కూడా గోవులను పెంచే యోచనలో ఉన్నట్టు తెలిపారు. సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. గోదావరి నది ప్రవాహం, ఇక్కడి స్వచ్చమైన వాతావరణం ...

Read More »

డ్వాక్రా గ్రూప్‌ రుణాల మొత్తాన్ని సకాలంలో చెల్లించండి

  బీర్కూర్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో గల డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు ఆయా మొత్తాలనుసకాలంలో చెల్లించాలని ఎపిఎం గంగాధర్‌ అన్నారు. ప్రస్తుతం నోట్ల చలామణి దృష్ట్యా రూపాయల విషయంలో అపోహలు పెట్టుకోవద్దని సకాలంలో తమ వద్ద ఉన్న 500, 1000 నోట్లు చెల్లించినా బ్యాంకుల్లో రుణ మాఫీ చెల్లుబడి అవుతుందని ఆయన పేర్కొన్నారు. శనివారం మండల మహిళా సంఘాల సమాఖ్య సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ముఖ్య అతిథిగా కో ఆర్డినేటర్‌ రవిందర్‌ పాల్గొన్నారు. ...

Read More »