Breaking News

Daily Archives: November 27, 2016

మైనార్టీల హక్కుల కోసం మే.సా. ముందుంటుంది

  – మే.సా. రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్‌ అహ్మద్‌ కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీల హక్కుల కోసం మైనార్టీ ఎంప్లాయిస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ (మే.సా.) ముందుంటుందని రాష్ట్ర అధ్యక్షుడు షారూఖ్‌ అహ్మద్‌ అన్నారు. కామారెడ్డిలో ఆదివారం నిర్వహించిన టిఎస్‌ మేసా కామారెడ్డిజిల్లా ఎన్నికల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో గంగ, జమున తహజీబ్‌ను కాపాడుకుంటూ మైనార్టీ ఎంప్లాయిస్‌ హక్కులను కాపాడుతామని ఇందుకోసం ప్రతి ఉద్యోగి పాటుపడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మైనార్టీ ఉద్యోగుల ...

Read More »

ధర్మయుద్దానికి తరలిన ఎంఆర్‌పిఎస్‌ నాయకులు

  కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లో ధర్మయుద్దం కార్యక్రమానికి కామారెడ్డి నుంచి ఎంఆర్‌పిఎస్‌ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు బాగయ్య మాట్లాడుతూ మాదిగలకు రిజర్వేషన్ల కోసం ఎంఆర్‌పిఎస్‌ జాతీయ వ్యవస్తాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేపడుతున్న అన్ని కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. ధర్మయుద్దం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రెండు రాష్ట్రాల్లోని మాదిగలతో హైదరాబాద్‌లో గర్జిస్తామన్నారు. పార్లమెంటులో రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించాలని డిమాండ్‌ చేశారు.

Read More »

అసంఘటిత కార్మికరంగానికి సమగ్ర చట్టాన్ని రూపొందించాలి

  కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసంఘటిత కార్మిక రంగానికి సమగ్రమైన చట్టం రూపొందించాలని తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య టిఎకెఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాగౌడ్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లా మొదటి మహాసభలు ఆదివారం కామారెడ్డిలో జువ్వాజి సత్యం అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్బంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల సంఘటిత కార్మిక రంగం, అసంఘటిత రంగ కార్మికులుగా మారుతూ ఉద్యోగ భద్రత లేక అలమటిస్తున్నారన్నారు. ఇఎస్‌ఐ, ...

Read More »

ప్రారంభానికి నోచుకోని ఆరోగ్య ఉపకేంద్రం

  నిజాంసాగర్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేదలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం లక్షలు వెచ్చించి ఆసుపత్రులు నిర్మించారు. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభానికి ముస్తాబైనప్పటికి ఆయాశాఖాధికారులకు వీటిని ప్రారంభించాలనే ఆలోచన కూడా లేకుండా పోయింది. దీంతో భవనాలు నిరుపయోగంగానే దర్శనమిస్తున్నాయి. ఆరోగ్య ఉపకేంద్రం అద్దె భవనంలో కొనసాగుతుంది. ఇకనైనా అధికారులు స్పందించి నూతన భవనాన్ని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Read More »

ఆ మూలమలుపులు… ప్రమాద ఘంటికలు

  – హెచ్చరిక బోర్డులు, ప్రమాదసూచికలు లేని రహదారులు – పట్టించుకోని ఆర్‌అండ్‌బి అధికారులు నిజాంసాగర్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం రహదారుల వెంట ప్రమాదాల నివారణకు పోలీసులు, ఆర్‌అండ్‌బి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేయడం జరిగింది. కానీ ఆ రెండు శాఖల అధికారులు ఆదేశాలను బేఖాతారు చేస్తున్నారు. దీంతోరహదారుల వెంట ఉన్న మూల మలుపుల వల్ల ప్రమాదహెచ్చరిక బోర్డులు, సూచిక బోర్డులు ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉంది. నిజాంసాగర్‌ నుండి కామారెడ్డి రహదారిపైన నిజాంసాగర్‌ ...

Read More »