Breaking News

అభివృద్దే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం కృషి

 

మోర్తాడ్‌, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దేనని మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో తహసీల్దార్‌, ఎంపిడివో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ, మోర్తాడ్‌ డిగ్రీకళాశాల భవన ప్రారంభోత్సవానికి, ఏర్గట్ల మండల కేంద్రంలోని పలు అభివృద్ది పనులకు ముఖ్యఅతిథిగా విచ్చేసి భూమిపూజచేసి ప్రారంభించారు. స్థానిక సర్పంచ్‌ దడివె నవీన్‌, ఎంపిపి కల్లడ చిన్నయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి కార్యక్రమంలో 18 బిసికుటుంబాలకు, ఎస్‌సి 6 కుటుంబాలకు, 51 వేల చొప్పున చెక్కులు లబ్దిదారులకు అందజేశారు. అనంతరం మోర్తాడ్‌లో రూ. 2 కోట్ల 2 లక్షలతో డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఏర్గట్ల మండల కేంద్రంలో 51 లక్షలతో అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ బిగింపు, 10 లక్షలతో సిసి రోడ్లు, 5 లక్షలతో పద్మశాలి భవనం, పిఏసిఎస్‌ గోదాముల నిర్మాణం, 10 లక్షలతోదోబీఘాట్‌, కమ్యూనిటీ హాల్‌కు భూమిపూజ చేశారు. స్థానిక సర్పంచ్‌ వైష్ణవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఏర్గట్ల సభలో ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతినిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు నిరంతర విద్యుత్‌, అన్ని పంటలకు సాగునీరు, సబ్సిడీపై యంత్ర పరికరాలు, విత్తనాలు, ఎరువులు సిఎం కల్పిస్తున్నారన్నారు. మహిళల అభివృద్దికి, మైనార్టీల అభివృద్దికితెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలపై నాయకులుగాని, అధికారులు గాని లంచం అడిగితే చొక్కా పట్టుకొని నిలదీయాలన్నారు. అవినీతి, లంచగొండితనం లేనిసంక్షేమ పథకాలను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే జమచేయడం జరుగుతుందన్నారు.

తెరాసలో చేరిన ఏర్గట్ల గ్రామస్తులు …

ఏర్గట్ల గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయడంతో గ్రామాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్‌ వైష్ణవి, ఎంపిటిసి అంజయ్య, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుకుమార్‌తో పాటు అన్ని కులసంఘాల సభ్యులు ఎమ్మెల్యే సమక్షంలో తెరాసలో చేరారు. కార్యక్రమంలో మండల అధికారులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

ఆర్‌ఎంపి, పిఎంపిలు వైద్యం చేయరాదు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రశేఖర్‌ బుధవారం ...

Comment on the article